News
News
X

Eight Wives: ఒకే ఇంట్లో 8 మంది భార్యలతో హ్యాపీగా కాపురం.. ఇతడిదో చిత్రమైన ప్రేమకథ!

ఇతడో వరల్డ్ ఫేమస్ హస్బెండ్.. ఎనిమిది మంది అమ్మాయిలతో చూడగానే ప్రేమలో పడిపోయాడు. వారిని పెళ్లి చేసుకుని హ్యాపీగా సంసారం చేసేస్తున్నాడు.

FOLLOW US: 

ద్దరు భార్యల ముద్దుల మొగుళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలిసిందే. భార్యలిద్దరు పరస్పర అంగీకారంతో నడుచుకుంటే పర్వలేదు. ఇద్దరూ పంతానికి, పట్టింపుకులకు పోతేనే కష్టం. వారి ఇష్టానికి తగినట్లుగా నడుచుకోడానికి ఆ భర్త పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. అయితే, థాయ్‌లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇద్దరు కాదు ముగ్గురు కాదు.. ఏకంగా ఎనిమిది మందిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఇతడికి తప్పకుండా చుక్కలు కనిపిస్తుండాలే అని అనుకుంటున్నారా? కానే కాదు.. అతడు ఆ 8 మంది భార్యలతో హాయిగా కాపురం చేసేస్తున్నాడు. ఇప్పుడు వీరిలో ఇద్దరు గర్భవతులు కూడా. 

టాటూ ఆర్టిస్ట్ ఓంగ్ డ్యామ్ సోరోట్‌కు థాయ్‌లాండ్‌లో ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయాడు. థాయ్ సాంప్రదాయ యంత్రాల పచ్చబొట్లు వేయడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఓంగ్ ఎనిమిది మంది భార్యలతో ఒకే ఇంట్లో అన్యోన్యంగా జీవిస్తున్నాడనే విషయం తెలుసుకుని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఓ థాయ్ కమెడియన్ ఇటీవల ఓంగ్, అతడి భార్యలను ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా ఓంగ్ తన ప్రేమ, పెళ్లిల్ల గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. తమది చాలా హ్యాపీ ఫ్యామిలీ అని, తన భార్యలెప్పుడు ఒకరితో ఒకరు పోట్లాడుకోరని చెప్పాడు. అంతేకాదు.. వారు తనని ఎంతో ప్రేమగా చూసుకుంటారని తెలిపాడు. ఓంగ్ గురించి అతడి భార్యలు స్పందిస్తూ.. ఈ భూమిపై అత్యంత దయగల, బాధ్యతాయుత భర్త అని ప్రశంసలతో ముంచెత్తారు. 

ఒక్కోక్కరితో ఒక్కో చోట ప్రేమ..: ఓంగ్ తన ఎనిమిది మంది భార్యలను తొలి చూపులోనే ప్రేమించాడు. నచ్చిన వెంటనే ప్రపోజ్ చేసి పెళ్లికి ఒప్పించాడు. చిత్రం ఏమిటంటే.. అతడికి పెళ్లయ్యిందని తెలిసి కూడా మిగతా యువతులు అతడిని పెళ్లి చేసుకున్నారు. ఓంగ్ తన మొదటి భార్య నాంగ్ స్ప్రైట్‌ను స్నేహితుడి పెళ్లిలో చూసి ప్రేమలో పడ్డాడు. ఆలస్యం చేయకుండా అదే పెళ్లిలో ఆమెకు ప్రపోజ్ చేసి పెళ్లి చేసేసుకున్నాడు. రెండో భార్యను నాంగ్ నాన్‌లోని ఓ మార్కెట్‌లో చూసి ప్రేమించాడు. మూడో భార్య ఓ హాస్పిటల్‌లో, నాలుగు, ఐదు, ఆరో భార్యలను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్‌లో చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓంగ్ తన తల్లితో కలిసి ఫ్రా పాథోం చెడి ఆలయానికి వెళ్లినప్పుడు ఏడో భార్య నాంగ్ ఫిల్మ్‌ను చూసి పెళ్లాడాడు. ఓ రోజు నలుగురు భార్యలతో కలిసి పట్టయ్యాకు విహార యాత్రకు వెళ్లినప్పుడు ఓంగ్ ఎనిమిదో భార్యను చూశాడు. అక్కడే పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. 

గొడవలు పడరా?: కొంతమంది మహిళలు చిన్న చిన్న విషయాలకు కూడా అపార్థాలు చేసుకుంటారు. ఫలితంగా స్పర్థలు వస్తాయి. అయితే, ఇప్పటివరకు ఓంగ్ భార్యల మధ్య ఒక్కసారి కూడా అలాంటి పరిస్థితి రాలేదట. ఇందుకు కారణం.. ఓంగ్ అందరినీ సమానంగానే చూస్తాడట. వారి మధ్య ఎలాంటి గొడవ లేకుండా చాలా బాధ్యతగా వ్యవహరిస్తాడట. మొదటి భార్య అంగీకారం తర్వాతే ఓంగ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. భార్యల అనుమతి తీసుకున్నాకే మిగతా అమ్మాయిలను కూడా పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి.. ఈ విషయంలో అతడి తప్పేలేదట. ‘‘అతడు ప్రపోజ్ చేశాడు సరే.. మరి, అప్పటికే అతడికి పెళ్లయ్యిందని తెలిసి కూడా మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు?’’ అని ప్రశ్నకు మిగతా భార్యలు సమాధానం ఇస్తూ.. ‘‘అతడు చాలా ఆకర్షణీయంగా ఉంటాడు. చాలా కూల్‌గా, కేరింగ్‌గా ఉంటాడు. అతడిని చూడగానే పిచ్చిగా ప్రేమించేశాం. అందుకే పెళ్లి చేసుకున్నాం’’ అని తెలిపారు. 

ధనవంతుడిని కాదు.. అంతా పనిచేస్తాం: ఓంగ్ ధనవంతుడు కాబట్టే.. ఎనిమిది మందిని పెళ్లి చేసుకోగలిగాడని చాలా మంది భావిస్తున్నారు. దీనిపై ఓంగ్ స్పందిస్తూ.. ‘‘నేను ధనవంతుడిని కాదు. టాటూలు వేయడమే కాకుండా కొన్ని సోషల్ మీడియా సైట్స్ కూడా నడుపుతున్నాను. నా భార్యలందరే వేర్వేరు పనులు చేస్తుంటారు. ఆహారం నుంచి కాస్మోటిక్స్ వరకు వివిధ రకాల ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. వాటి ద్వారా వచ్చే ఆదాయంతోనే మేం జీవిస్తున్నాం’’ అని తెలిపాడు. ఒక వేళ మీ భార్యల్లో ఎవరైనా మీ నుంచి దూరం కావాలి అనుకుంటే? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘వారికి ఎట్టి పరిస్థితుల్లో అడ్డు చెప్పను. వారి నిర్ణయాన్ని గౌరవిస్తాను’’ అని తెలిపాడు. 

Published at : 31 Jan 2022 12:43 PM (IST) Tags: Thailand థాయ్‌లాండ్ Eight Wives Thai Man Eight Wives Thailand Man Eight Wives

సంబంధిత కథనాలు

Viral Video: చిరుతతో ఆటలేంట్రా నాయనా? అదేమైనా కుక్క పిల్లా, తోకపట్టుకుని లాగుతున్నావ్?

Viral Video: చిరుతతో ఆటలేంట్రా నాయనా? అదేమైనా కుక్క పిల్లా, తోకపట్టుకుని లాగుతున్నావ్?

స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కడుపులో మంటగా ఉందా? ఇవిగో ఆయుర్వేద చిట్కాలు

స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కడుపులో మంటగా ఉందా? ఇవిగో ఆయుర్వేద చిట్కాలు

టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!

టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!

30 Days Water Challenge: 30 డేస్ వాటర్ ఛాలెంజ్ - ఈ ట్రెండ్ ఫాలో కావద్దు, ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే..

30 Days Water Challenge: 30 డేస్ వాటర్ ఛాలెంజ్ - ఈ ట్రెండ్ ఫాలో కావద్దు, ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే..

70 ఏళ్ల వయస్సులో బిడ్డకు జన్మనిచ్చిన బామ్మగారు, 54 ఏళ్ల కల ఫలించిన వేళ!

70 ఏళ్ల వయస్సులో బిడ్డకు జన్మనిచ్చిన బామ్మగారు, 54 ఏళ్ల కల ఫలించిన వేళ!

టాప్ స్టోరీస్

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు