అన్వేషించండి

Online Vs Offline Food: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే అంత ఖరీదా? అంటే కూపన్ల ఆఫర్ హంబక్కేనా? తేడా చూడండి!

మీరు జొమాటో, స్వీగ్గిల నుంచి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? అయితే, రియల్ ధరలకు, అందులో పేర్కొనే ధరలకు మధ్య ఈ వ్యత్యాసాన్ని ఎప్పుడైనా గమనించారా?

ఈ రోజుల్లో ఎవరూ హోటల్‌కు వెళ్లి టిఫిన్లు, భోజనాలు చేయడం లేదు. ఆర్డర్ పెడితే చాలు.. అన్నీ ఇంటికే వచ్చేస్తున్నాయి. పైగా.. ఫుడ్ యాప్స్‌లో ఆఫర్లు కూడా బాగానే ఇస్తారు. కూపన్ అప్లై చేస్తే.. చాలా తక్కువ ధరకే ఆ ఫుడ్ ఇంటికి వచ్చేస్తుంది. అయితే, ఇది ఇప్పటివరకు ప్రజలకు ఉన్న అభిప్రాయం. కానీ, ముంబయికి చెందిన ఓ వ్యక్తి చేసిన ఈ కంపేరిజన్ చూసిన తర్వాత.. మనం ఇలా మోసపోతున్నామా? ఇన్నాళ్లు కూపన్ల పేరుతో వస్తున్న ఆఫర్లన్నీ హంబక్కేనా అని ఆశ్చర్యపోతారు. వాస్తవానికి మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్న ఫుడ్ ధరలకు, హోటల్‌లో వసూల్ చేసే నిజమైన ధరలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. దీని గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఇతడు ఆ విషయాన్ని ఫొటోలతో సహా వివరించాడు. అయితే, ఈ పోస్ట్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

రాహుల్ కాబ్రా అనే వ్యక్తి Zomato నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఫుడ్‌ బిల్లును.. అదే ఆహారాన్ని నేరుగా హోటల్‌కు వెళ్లి కొనుగోలు చేస్తే అయ్యే బిల్లును పోల్చాడు. ఆ రెండు ఫొటోలను LinkedInలో పోస్ట్ చేశాడు. ఈ బిల్లుల మధ్య వ్యత్యాసం చూసి షాకయ్యారు. రెండు బిల్లులకు మధ్య సుమారు రూ.200 వరకు తేడా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. పైగా, జొమాటాలో పేర్కొన్న ఆహార ధరలు హోటల్ ధరలు కంటే ఎక్కువ ఉన్నాయి.  

ఫుడ్ సర్వీస్ ప్రొవైడర్ Zomato ఒక ఆర్డర్‌పై ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకోడానికి ఈ బిల్లులే నిదర్శనమని అతడు పేర్కొన్నాడు. వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్, వెజ్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ మోమోలను జొమాటో ద్వారా ముంబైలోని తూర్పు కాండివాలిలోని ‘ది మోమో ఫ్యాక్టరీ’ నుంచి ఆర్డర్ చేశాడు. నేరుగా హోటల్‌కు వెళ్లి ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఆ ఫుడ్‌కు మొత్తం రూ.512 అయ్యింది. జొమాటో ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన అదే ఫుడ్‌కు రూ.764 అయ్యింది. దానికి కూపన్ వర్తిస్తే.. రూ.75 తగ్గి, మొత్తం రూ.690 అయ్యింది. కూపన్ అప్లై చేసినా సరే, నేరుగా కొనుగోలు చేసిన ఆహారం కంటే అదనంగా రూ.178 ఎక్కువ అయ్యింది. అంటే, ఆన్‌లైన్‌లో ఆ ఆహారం విలువను 34.76 శాతానికి పెంచాడని రాహుల్ తెలిపాడు. 
 
అయితే, దీనిపై నెటిజనులంతా భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఇందులో Zomato తప్పులేదని, రెస్టారెంట్ భాగస్వాములే ఆన్‌లైన్‌లో తమ ఆహారాన్ని విక్రయించేందుకు ధరలను రెట్టింపు చేశారని పలువురు తెలుపుతున్నారు. రెస్టారెంట్ యజమానులు అదనపు కమీషన్ కోసం ఆన్‌లైన్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని అంటున్నారు. ‘‘ప్రస్తుతం పెట్రోల్, గ్యాస్ ధరలు గణీయంగా పెరిగాయి. వాటిని కూడా మీరు పరిగణించాలి. మీకు అదనంగా ఖర్చవుతుందని భావిస్తే అలాంటి యాప్స్‌ను వినియోగించకుండా నేరుగా వెళ్లి కొనుగోలు ఫుడ్ కొనుగోలు చేయడమే బెటర్’’ అని మరికొందరు అంటున్నారు. ‘‘వారు ఫుడ్ మెనూలోని ఆహార ధరలను అలాగే ఉంచి, సర్వీసు కోసం అదనంగా డబ్బులు వసూలు చేసి ఉంటే ఇలాంటి ఫిర్యాదులు ఉండవు. ఫుడ్ రేట్లు పెంచి చూపించడం వల్లే ఈ వివాదమని మరొకరు వ్యాఖ్యానించారు.
Online Vs Offline Food: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే అంత ఖరీదా? అంటే కూపన్ల ఆఫర్ హంబక్కేనా? తేడా చూడండి! 

ఈ పోస్ట్‌పై Zomato కూడా స్పందించింది. ‘‘హాయ్ రాహుల్, జొమాటో కస్టమర్, రెస్టారెంట్ మధ్య మధ్యవర్తిత్వ ప్లాట్‌ఫారమ్‌గా మాత్రమే పనిచేస్తుంది. మా ప్లాట్‌ఫారమ్‌లో రెస్టారెంట్ భాగస్వాములు అమలు చేసే ధరలపై ఎటువంటి మాకు ఎలాంటి నియంత్రణ లేదు. మీ అభిప్రాయాన్ని మేము.. వారికి తెలియజేశాం. దీన్ని పరిశీలించాలని వారిని అభ్యర్తించాం’’ అని పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే.. రెస్టారెంట్ యాజమాన్యమే రెండు రకాల ధరలను కస్టమర్లపై రుద్దుతుందని అర్థమవుతుంది. దీనిపై మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘‘రెస్టారెంట్లు నేరుగా వెళ్లి కొనుగోలు చేస్తే ఒక ధర, జొమాటో ద్వారా ఆర్డర్ చేస్తుంటే మరో ధరను కమీషన్ కోసం వసూళ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకు ఇంటికి వచ్చి ఫుడ్ ఇచ్చే ‘జోమాటో’ సర్వీస్ ప్రొవైడర్‌ తప్పులేదని అర్థమవుతుంది. Zomato ఇస్తున్న ఆ కూపన్ల వల్ల కొంతవరకైనా డబ్బు ఆదా అవుతుంది. ఆ కూపన్స్ లేకపోతే.. ఇంకా రెట్టింపు డబ్బులను చెల్లించాల్సి వస్తుంది’’ అని పేర్కొన్నాడు. 

Also Read: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్‌’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Also Read: ఇలా కిస్ చేస్తే గనేరియా వస్తుందా? ముద్దు ఆరోగ్యానికి మంచిదేనా?

టాప్ హెడ్ లైన్స్

Healthy Skin Diet : ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి
ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి
Hemorrhoids Risk : యువకుల్లో పెరుగుతోన్న హెమరాయిడ్స్.. ఈ అలవాట్లే మొలలకు ప్రధాన కారణమంటోన్న పరిశోధనలు
యువకుల్లో పెరుగుతోన్న హెమరాయిడ్స్.. ఈ అలవాట్లే మొలలకు ప్రధాన కారణమంటోన్న పరిశోధనలు
Coconut Benefits : కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
Mens Day 2026 Wishes : హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget