International Kissing Day: ఇలా కిస్ చేస్తే గనేరియా వస్తుందా? ముద్దు ఆరోగ్యానికి మంచిదేనా?
ముద్దు పెట్టుకుంటున్నారా? అయితే, మీరు ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ రకం ముద్దు వల్ల గనేరియా వచ్చే ప్రమాదం ఉందట.
ముద్దు ఆరోగ్యానికి మంచిదే. కానీ, కొన్ని రకాల ముద్దులు ఆరోగ్యానికి హానికలిగించే అవకాశాలు ఉన్నాయని తాజా స్టడీ ఒకటి వెల్లడించింది. ఈ రోజు (జూన్ 6న) ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే. కాబట్టి, ముద్దు వల్ల ప్రయోజనాలే కాకుండా, వాటివల్ల వచ్చే సమస్యలు గురించి కూడా తెలుసుకుందాం.
ముద్దుల్లో కంటే అత్యంత పాపులర్ ముద్దు ఫ్రెంచ్ కిస్. దీన్నే డీప్ కిస్ అని కూడా అంటారు. కోరికలతో రగిలిపోయే జంటలు ఇలా డీప్‌గా కిస్ చేసుకుంటారు. నాలుకలతో యుద్ధం చేసుకుంటారు. ఇది లైంగిక కోరికలను మరింత ప్రేరేపించి మంచి అనుభూతిని ఇస్తుంది. అందుకే, ఫ్రెంచ్ కిస్‌కు అంత పాపులారిటీ. అయితే ఫ్రెంచ్ కిస్ వల్ల గనేరియా వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నోటిలో ఉండే లాలాజలం వల్లే గనేరియా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు వెల్లడించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) లెక్కల ప్రకారం ఏటా 78 మిలియన్ల మందికి గనేరియా సంక్రమిస్తోంది. వాస్తవానికి ఈ వ్యాధి సురక్షితం కాని సెక్స్ వల్ల మాత్రమే వస్తుందని భావించారు. అయితే, ముద్దు పెట్టుకోవడం వల్ల కూడా గనేరియా వస్తుందని అధ్యయనంలో తేలింది. ఓరల్ సెక్స్ చేసేవారికి కూడా గనేరియా ముప్పు ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ‘ఆనల్ గనేరియా’కు దారి తీయొచ్చని పేర్కొన్నారు. ముద్దు వల్ల వచ్చే వ్యాధిని ‘థ్రోట్ గనేరియా’ అని అంటారు.
ఫ్రెంచ్ కిస్ వల్లే ముప్పు ఎందుకు?: పెదాలు కలిస్తే పెద్దగా నష్టం ఉండదు. కానీ, నాలుకలు పెనవేసుకుని పెట్టుకొనే ముద్దుతోనే ముప్పు ఎక్కువట. ఎందుకంటే, ఫ్రెంచ్ కిస్ సమయంలో ఒకరి లాలాజలం మరొకరిలోకి వెళ్తుంది. వారిలో ఎవరికి ఏ వ్యాధి ఉన్నా.. సులభంగా సంక్రమిస్తుంది. అందుకే, ఫ్రెంచ్ కిస్ చాలా ప్రమాదకరం అని అంటున్నారు. అయితే, అపరిచితులను కిస్ చేసేప్పుడు మరీ, అంత డీప్‌గా ముద్దుపెట్టుకోకపోవడమే బెటర్ అంటున్నారు. ముఖ్యంగా హోమో సెక్సువల్స్ (స్వలింగ సంపర్కులు)లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు మెల్‌బోర్న్‌లో నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.
ఫ్రెంచ్ కిస్‌తో ప్రయోజనాలు కూడా ఉన్నాయి: ఫ్రెంచ్ కిస్‌ను ‘మోస్ట్ ప్యాషనేట్ కిస్’ అని పిలుస్తారు. అయితే పారీస్‌లో మాత్రం ఈ కిస్‌ను ‘ఫ్రెంచ్ కిస్’ అని పిలవరు. ఎందుకంటే.. అది వారికి సాధారణమైన ముద్దు. ఫ్రెంచ్ కిస్ జీవిక్రియను పెంపొందిస్తోందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. శరీరంలో క్యాలరీలను బర్న్ చేయడానికి ఫ్రెంచ్ కిస్ బాగా ఉపయోగపడుతుందట. ఆరోగ్యకరమైన ఈ జంట ముద్దులు పెట్టుకోవడం వల్ల నోటిలో లాలాజలం.. బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలతో పోరాడుతుందని పరిశోదకులు తెలిపారు. గాఢంగా ముద్దు పెట్టుకోవడం వల్ల లాలాజల ప్రవాహం పెరిగి.. నోరు, దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటిని శుభ్రంగా ఉంచుకొనేవారికి మాత్రమే వర్తిస్తుంది.
గొంతు గనేరియా లక్షణాలు ఇవే:
⦿ నిరంతర దురద లేదా గొంతు నొప్పి.
⦿ గొంతులో ఎరుపు.
⦿ జ్వరం.
⦿ మెడలో వాపు.
⦿ ఆహారం మింగడం కష్టమవుతుంది.
Also Read: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
గమనిక: వివిధ అధ్యయనాలు, హెల్త్ ఆర్టికల్స్ నుంచి గ్రహించిన వివరాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయమైనా సరే.. మీరు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.
Also Read: వృద్ధుడి వృషణాల నుంచి విజిల్స్, కారణం తెలిసి షాకైన డాక్టర్లు!