Bizzare Food: మ్యాగీ మిల్క్ షేక్.... ఇంతకన్నా అరాచకం ఉందా? తిట్టిపోస్తున్న నెటిజన్లు
రకరకాల ఆహారాలు అప్పుడప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంటాయి. వాటిలో కొన్ని ‘వావ్’ అనిపిస్తే... మరికొన్ని మాత్రం వామ్మో అని భయపెడతాయి.
మనకు మ్యాగీ కొత్తేం కాదు. ఈ కాలం పిల్లల ఫేవరేట్ బ్రేక్ ఫాస్ట్ కూడా అదే. దీన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా తింటారు. కొందరు ప్లెయిన్ మ్యాగీ ఇష్టపడితే, మరికొందరు మసాలా మ్యాగీ తినడానికి ఇష్టం చూపుతారు. ఆ మధ్యన ఎవరో పానీపూరికీ మ్యాగీని జత చేశారు. ఇది సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అయ్యింది. అంతేనా వెరైటీ దోశె కూడా నెటిజన్లను ఆకట్టుకుంది. సోషల్ మీడియా పుణ్యమాని ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఇదిగో ఇప్పుడు మ్యాగీ మిల్క్ షేక్ వంతు వచ్చింది.
కానీ ఈసారి నెటిజన్లు మ్యాగీ మిల్క్ షేక్ విషయంలో మాత్రం నెగిటివ్ గా స్పందిస్తున్నారు. దీన్ని తయారుచేసినవాడెవడో నాకు తెలియాలే అంటూ తిట్ల పురాణం అందుకుంటున్నారు. మ్యాగీ రుచేంటి, మిల్క్ షేక్ రుచేంటి? ఆ రెండూ కలిపి తింటే వాంతులవ్వడం ఖాయం అంటూ చీదరించుకుంటున్నారు. ఈ మ్యాగీ మిల్క్ షేక్ గురించి ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. అందులో రెండు గ్లాసుల్లో మిల్క్ షేక్ ఉండగా, పైన మ్యాగీతో గార్నిష్ చేసి ఉంది. మ్యాగీని తక్కువ మొత్తంలో కాకుండా గ్లాసు నిండా కుమ్మరించారు. దీన్ని తినాలో, తాగాలో అర్ధం కాని పరిస్థితి.
Some idiot share this with me...
Maggie Milk-shake.... Jinda pakadna hai in banane waalo ko... 🤢🤢🤢 pic.twitter.com/m0BV8m7zyI
— Mayur Sejpal | मयूर सेजपाल 🇮🇳 (@mayursejpal) September 11, 2021
— Proud Indian 🇮🇳 (@onlyproudindian) September 11, 2021
Also read: ఆ చాకోలెట్ వినాయకుడిని చివరికి ఏం చేస్తారంటే...?
Also read: సోంపు నీళ్లతో బరువు తగ్గుతారా? నిజమేనా?
Also read: గుడ్లు తిన్నాక... వీటిని తినకండి, తింటే ఏమవుతుందంటే...
Also read: రోజుకు నాలుగైదు వేరు శెనగపలుకులు తినండి చాలు... ఆ జబ్బులకు దూరంగా ఉండొచ్చు
Also read: ఈ టీ తాగితే .. అందం అమాంతం పెరిగిపోతుందా!
Also read: ఎర్రబియ్యం తింటే బానపొట్ట మాయం... మధుమేహులకు అమృతం