News
News
X

Marburg Virus: ఎబోలా వైరస్‌లాగే మార్బర్గ్ కూడా ప్రాణాంతకమే, గబ్బిలాల ద్వారానే వైరస్ వ్యాప్తి

ఎబోలా వైరస్‌ లాంటిదే మరో ప్రాణాంతక వైరస్ మార్బర్గ్.

FOLLOW US: 

ఆఫ్రికాలో పుట్టిన ప్రాణాంతక వైరస్ ఎబోలా.ఈ వైరస్ సోకాక ఆ మనిషి బతకడం చాలా కష్టం. ఎబోలా వైరస్ ఫిలో వైరస్ కుటుంబానికి చెందినది. ఇప్పుడిదే కుటుంబానికి చెందిన మరో వైరస్ పుట్టుకొచ్చింది. పేరు మార్బర్గ్ వైరస్. ఇది కూడా ఎబోలా లాగే ప్రాణాంతకమైనది. ఒక పక్క కరోనాతో ప్రపంచం విలవిలలాడిపోతుంటే మరో పక్క ఈ కొత్త వైరస్ ఆఫ్రికన్ దేశాలను వణికిస్తోంది. ఘనా దేశంలో పుట్టిన వైరస్ ఎన్ని దేశాలకు పాకుతుందోనని ప్రపంచ ఆరోగ్య సంస్థ కలవరపడుతోంది. ఘనా దేశంలో ఇప్పటికే ఇద్దరి ప్రాణాలు తీసింది ఈ వైరస్.ఈ వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందో భారీగా ప్రాణనష్టం తప్పకపోవచ్చు. 

అప్పట్లోనే 31 మందికి...
మార్బర్గ్ ను 1967లోనే కనిపెట్టారు. అప్పట్లో ఉగాండా నుంచి సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌కు పరిశోధనల నిమిత్తం ఆఫ్రికన్ గ్రీన్ కోతులను తీసుకువచ్చారు. ల్యాబుల్లో పరీక్షలు చేస్తున్న సమయంలో అక్కడ పనిచేస్తున్న 31 మందికి తొలిసారి మార్బర్డ్ వైరస్ సోకినట్టు గుర్తించారు. వారికి చికిత్స చేసిన వైద్యులకు, వైద్యుల ద్వారా వారి కుటుంబసభ్యులకు కూడా వైరస్ సోకింది. ఏడుగురు మరణించినట్టు కూడా నివేదికలు చెబుతున్నాయి. 

గబ్బిలాల నుంచే...
ఎన్నో వైరస్‌ల వ్యాప్తికి గబ్బిలాలే కారణం అవుతున్నాయి. ఇప్పుడు మార్బర్గ్ వైరస్ వ్యాప్తికి కూడా గబ్బిలాలే కారణమని తేల్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అందులోనూ ఆఫ్రికన్ ఫ్రూట్ జాతికి చెందిన గబ్బిలాల నుంచే మనుషులకు ఈ వైరస్ సోకినట్టు డబ్య్లూహెచ్‌వో తెలిపింది. అయితే ఈ వైరస్ తనలో మోసుకెళ్తున్న గబ్బిలాలకు మాత్రం ఎలాంటి జబ్బు లక్షణాలు కలగవు, కనిపించవు. అదే మనుషులకు సోకితే మాత్రం మరణం అంచులకు తీసుకెళ్తుంది ఈ వైరస్. 2008లో ఉగాండాలో పర్యటించిన ఇద్దరు పర్యాటకుల్ల కూడా మార్బర్గ్ వైరస్ లక్షణాలు కనిపించాయి. ఆ తరువాత మళ్లీ దీని జాడ లేదు. 

ఇప్పుడు ఎలా...
ఇన్నేళ్ల తరువాత మళ్లీ ఈ వైరస్ ప్రజలకు సోకడం, ప్రాణాలు తీయడం కలవరానికి గురిచేస్తోంది. మనుషుల నుంచి మనుషులకు కూడా ఈ వైరస్ సోకుతుంది. మాట్లాడుతున్నప్పుడు నీటి తుంపర్లు, వారి రక్తం ద్వారా ఎదుటి మనిషికి సోకుతుందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ చెబుతోంది. అలాగే వైరస్ సోకిన వ్యక్తి యూరిన్, ఉమ్ము, చెమట, తల్లిపాలు, సెమెన్ ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఈ వైరస్ సోకాక రెండు రోజుల నుంచి 21 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. 

చికిత్స లేదు
కొన్ని రకాల టెస్టుల ద్వారా మార్బర్గ్ వైరస్ ను నిర్ధారిస్తారు. ప్రస్తుతానికి ఈ వైరస్ కు ఎలాంటి చికిత్ లేదు. వ్యాక్సిన్లు కూడా అందుబాటులో లేవు. అందుకే ఈ వైరస్ వస్తే బతకడం కష్టంగా మారుతుంది. 

Also read: ప్రపంచంపై దాడికి సిద్ధంగా ఉన్న మరో వైరస్ మహమ్మారి ‘మార్బర్గ్’, ఇది కూడా ఎబోలా లాంటిదే, ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

Also read: మగవారిని నిశ్శబ్దంగా చంపేస్తున్న ప్రొస్టేట్ క్యాన్సర్, ఈ అలవాటు ఉంటే మానుకోండి

Published at : 20 Jul 2022 03:06 PM (IST) Tags: Marburg virus Ebola virus Marburg Virus Deadly Marburg Spread by Bats

సంబంధిత కథనాలు

Viral Video: చిరుతతో ఆటలేంట్రా నాయనా? అదేమైనా కుక్క పిల్లా, తోకపట్టుకుని లాగుతున్నావ్?

Viral Video: చిరుతతో ఆటలేంట్రా నాయనా? అదేమైనా కుక్క పిల్లా, తోకపట్టుకుని లాగుతున్నావ్?

స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కడుపులో మంటగా ఉందా? ఇవిగో ఆయుర్వేద చిట్కాలు

స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కడుపులో మంటగా ఉందా? ఇవిగో ఆయుర్వేద చిట్కాలు

టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!

టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!

30 Days Water Challenge: 30 డేస్ వాటర్ ఛాలెంజ్ - ఈ ట్రెండ్ ఫాలో కావద్దు, ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే..

30 Days Water Challenge: 30 డేస్ వాటర్ ఛాలెంజ్ - ఈ ట్రెండ్ ఫాలో కావద్దు, ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే..

70 ఏళ్ల వయస్సులో బిడ్డకు జన్మనిచ్చిన బామ్మగారు, 54 ఏళ్ల కల ఫలించిన వేళ!

70 ఏళ్ల వయస్సులో బిడ్డకు జన్మనిచ్చిన బామ్మగారు, 54 ఏళ్ల కల ఫలించిన వేళ!

టాప్ స్టోరీస్

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు