By: Haritha | Updated at : 19 Jul 2022 07:50 AM (IST)
మార్బర్గ్ వైరస్ బ్లడ్ శాంపిల్
కరోనా నుంచి ఇంకా కోలుకోలేదు, అప్పుడే మంకీపాక్స్ భయం పట్టుకుంది. ఈ భయంతోనే అన్ని దేశాలు నలిగిపోతుంటే ఇప్పుడు మరో వైరస్ పురుడుపోసుకుంది. అందులోనూ అది ప్రాణాంతక వైరస్ అయిన ఎబోలా కు చెల్లిలాంటిది. ఇప్పటికే ఘనా దేశంలో రెండు కేసులు నమోదయ్యాయి. ఆ వైరస్ పేరు ‘మార్బర్గ్ వైరస్’. ఘనాలోని ఇద్దరు వ్యక్తుల నుంచి తీసుకున్న రక్తనమూనాలను పరిశీలించిన వైద్యులకు ఈ కొత్త వైరస్ జాడ కనిపించింది. ఈ విషయాన్ని బ్రిటన్ కు చెందిన గార్డియన్ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఈ వైరస్ కూడా అంటు వ్యాధిలా సోకితే ప్రపంచంలో మరో గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఇదీ ప్రాణాంతకమైనదే...
ఈ వైరస్ కు సంభంధించి ప్రస్తుతం పరిశోధనలు సాగుతున్నాయి. ఇది ఎలా వ్యాపిస్తుంది, ఎంత వేగంగా వ్యాపిస్తుంది వంటి విషయాలను తెలుసుకునేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది కూడా మనిషి నుంచి మనిషికి వేగంగా సోకితే ఆరోగ్య ప్రపంచంలో మరో అలజడి తప్పదు. ఇది కూడా ఎబోలా వైరస్ లాగే ప్రాణాంతకమైనదని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. ఈ వైరస్ కు చికిత్స కానీ, వ్యాక్సిన్ కానీ ఉనికిలో లేదు. ఈ వైరస్ సోకితే అధిక జ్వరం వస్తుంది. అలాగే శరీరంలో అంతర్గత రక్తస్రావంతో పాటూ బాహ్య రక్తస్రావం కూడా అయ్యే అవకాశాలు అధికం. ప్రస్తుతం ఘనాలో ఇద్దరిలో ఈ వైరస్ ను గుర్తించారు. వారితో కాంటాక్ట్ లోకి వెళ్లిన 98 మందిని గుర్తించి ఐసోలేట్ చేశారు.
జంతువుల నుంచి
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఘనాలోని మార్బర్గ్ వైరస్ వ్యాప్తిని నిర్ధారించింది. ఈ వైరస్ సోకిన జంతువుల నుంచి కూడా మనుషులకు వ్యాపిస్తుంది. గబ్బిలాల నుంచి అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే గబ్బిలాలుండే ప్రాంతాలను శుభ్రం చేయాలని, వాటిని అక్కడ్నించి తరిమేయాలని, అలాగే అన్ని రకాల మాంసాలను బాగా ఉడికించాకే తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య అధికారులు.
లక్షణాలు ఇలా...
మార్బర్గ్ వైరస్ సోకితే ఆ వ్యక్తుల్లో వికారం, వాంతులు, ఛాతీ నొప్పి, గొంతు నొప్పి, కడుపునొప్పి, అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు తీవ్రంగా మారి పచ్చ కామెర్లు, క్లోమం వాపు, బరువు తగ్గిపోవడం, మతిమరుపు, కాలేయం వైఫల్యం చెందడం, రక్తస్రావం కావడం, అవయవాలు పనిచేయకపోవడం వంటివి కలుగుతాయి. అందుకే ఈ వైరస్ రాకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం.
Also read: అనుమానమే లేదు, మగవారి కన్నా ఆడవాళ్లే శక్తిమంతులు
Also read: వాకింగ్ ఉదయానే చేయాలా? సాయంత్రం చేస్తే మంచి ఫలితాలు రావా?
Also read: మగవారిని నిశ్శబ్దంగా చంపేస్తున్న ప్రొస్టేట్ క్యాన్సర్, ఈ అలవాటు ఉంటే మానుకోండి
Viral Video: చిరుతతో ఆటలేంట్రా నాయనా? అదేమైనా కుక్క పిల్లా, తోకపట్టుకుని లాగుతున్నావ్?
స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కడుపులో మంటగా ఉందా? ఇవిగో ఆయుర్వేద చిట్కాలు
టాయిలెట్లో టైంపాస్? గంటలు గంటలు కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!
30 Days Water Challenge: 30 డేస్ వాటర్ ఛాలెంజ్ - ఈ ట్రెండ్ ఫాలో కావద్దు, ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే..
70 ఏళ్ల వయస్సులో బిడ్డకు జన్మనిచ్చిన బామ్మగారు, 54 ఏళ్ల కల ఫలించిన వేళ!
iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!
Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !
WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు