అన్వేషించండి

Morning Walk: వాకింగ్‌ ఉదయానే చేయాలా? సాయంత్రం చేస్తే మంచి ఫలితాలు రావా?

వాకింగ్ చేయాలని సూచిస్తుంటారు వైద్యులు. అయితే వాకింగ్ ఉదయానే చేయాలా?

శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలన్నా, చురుగ్గా ఉండాలన్నా వాకింగ్ చేయడం చాలా అవసరం. ఉదయం కనీసం అరగంటైనా నడిస్తే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదని చెబుతారు. కానీ చాలా మందికి ఉన్న సందేహం వాకింగ్ ఉదయానే చేస్తేనే మంచిదా? మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పడుకునే ముందు చేయకూడదా? అని. దీనికి ఆరోగ్యనిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. 

ఉదయానే ఎందుకు చేయాలి?
ఉదయాన శరీరం, మెదడు తాజాగా ఉంటాయి. కాకపోతే ఉదయం పూట వచ్చే కాంతి శరీరానికి మేలు చేస్తుంది. శరీరానికి సహజ కాంతి చాలా అవసరం. మనకళ్ల వెనుక ఉండే సెన్సార్లు ఆ కాంతిని గుర్తించి మెదడులోని హైపోథాలమస్‌ ప్రాంతానికి సిగ్నల్స్ పంపిస్తాయి. ఎందుకంటే ఆ ప్రాంతమే మన జీవగడియారాన్ని నియంత్రించడంలో ముందుంటుంది. ఉదయానే వాకింగ్ చేయడం వల్ల సూర్య కాంతి శరీరంపై, కళ్లపై పడి జీవగడియారం సక్రమంగా పనిచేస్తుంది. ఉదయానే మీరు ఎంత త్వరగా లేస్తే రాత్రి పూట అంత త్వరగా నిద్ర పోతారు. జీవగడియారం అలా టైమింగ్స్ సెట్ చేసుకుంటుంది. అంతేకాదు సహజకాంతి శరీరాన్ని చేరడం వల్ల సెరోటోనిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. ఈ రసాయనమే మనలో ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ లాభాలు కావాలంటే ఉదయానే నడవాలి. 

ఎప్పుడైనా నడవచ్చు
ఉదయాన మాత్రమే నడవాలి అన్న నియమమేదీ లేదు. శరీరం చురుగ్గా ఉండేందుకు మీకు వీలయ్యే సమయంలో నడవచ్చు. రోజులో కనీసం అరగంట సేపు చెమటపట్టేలా నడిస్తే చాలా మంచిది. చాలా మంది మెల్లగా నడుస్తూ వాకింగ్ ను పూర్తి చేస్తారు. అలా మెల్లగా నడవడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. చేతులు ఊపుతూ వేగంగా నడిస్తేనే ఫలితం ఉంటుంది. క్యాన్సర్ ముప్పు తగ్గడంతో పాటూ,  హృదయ సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. గుండెకు రక్షణ కలుగుతుంది. ఇలా వేగంగా వాకింగ్ చేసేవారిలో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. 

మిగతా వ్యాయామాలతో పోలిస్తే నడక చాలా భిన్నం. మిగతా శారీరక ఎక్సర్ సైజులు చేసేందుకు ప్రత్యేకంగా ఓ సమయం కావాలి. కానీ నడక ఎప్పుడైనా చేసుకోవచ్చని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. రోజులో రెండు మూడు సార్లు, వీలైన సమయంలో నడక సాగించవచ్చు. ఏది ఏమైనా రోజులో మాత్రం కచ్చితంగా వాకింగ్ చేయాలి. 

భోజనం చేశాక వాకింగ్ చేస్తే బాన పొట్ట వచ్చే అవకాశం తగ్గుతుంది. పొట్ట పట్టేసినట్టు అవ్వదు. తిన్నాక కనీసం పదినిమిషాలు నడిచేందుకు ప్రయత్నించాలి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also read: మగవారిని నిశ్శబ్దంగా చంపేస్తున్న ప్రొస్టేట్ క్యాన్సర్, ఈ అలవాటు ఉంటే మానుకోండి

Also read: నెయ్యి అన్నం ఇలా చేస్తే పిల్లలు వదలకుండా తినేస్తారు

Also read: తరచూ పండ్లు తినే వారిలో డిప్రెషన్ వచ్చే అవకాశం తక్కువ, చెబుతున్న కొత్త అధ్యయనం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Elections :  ఏడాది చివరిలోపు స్థానిక ఎన్నికలూ పూర్తి - రేవంత్ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారా ?
ఏడాది చివరిలోపు స్థానిక ఎన్నికలూ పూర్తి - రేవంత్ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారా ?
Jagan On Congress: ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
Erraballi Dayakar Rao: బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
Paris Olympics 2024: చరిత్రలో నిలిచిపోయేలా, క్రీడా ప్రపంచం అబ్బురపడేలా
చరిత్రలో నిలిచిపోయేలా, క్రీడా ప్రపంచం అబ్బురపడేలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TTD Special Focus on Tirumala Laddu | తిరుమల లడ్డూపై టీటీడీ ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది..?YS Jagan To Join In India Alliance.. ?| ఇండియా కూటమిలోకి జగన్..? ఇవే టాప్- 5 కారణాలు | ABP DesamOld Music Instruments Repair | ఆనాటి వాయిద్యాల కంటే నేటి ప్లాస్టిక్ చప్పుళ్లపైనే అందరికి మోజు3 Teams May Target Rohit Sharma in the IPL 2025 Mega Auction | ముంబయికి రోహిత్ గుడ్ బై..| ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Elections :  ఏడాది చివరిలోపు స్థానిక ఎన్నికలూ పూర్తి - రేవంత్ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారా ?
ఏడాది చివరిలోపు స్థానిక ఎన్నికలూ పూర్తి - రేవంత్ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారా ?
Jagan On Congress: ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
Erraballi Dayakar Rao: బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
Paris Olympics 2024: చరిత్రలో నిలిచిపోయేలా, క్రీడా ప్రపంచం అబ్బురపడేలా
చరిత్రలో నిలిచిపోయేలా, క్రీడా ప్రపంచం అబ్బురపడేలా
Old City Bonalu 2024 : లాల్‌ దర్వాజా  సింహ వాహిని బోనాల వేడుకలు..28,29 తేదీల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలివే!
లాల్‌ దర్వాజా సింహ వాహిని బోనాల వేడుకలు..28,29 తేదీల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలివే!
Double iSmart: 'డబుల్‌ ఇస్మార్ట్‌' సాంగ్‌లో కేసీఆర్ వాయిస్‌ వాడటంపై వివాదం - వివరణ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్ మణిశర్మ
'డబుల్‌ ఇస్మార్ట్‌' సాంగ్‌లో కేసీఆర్ వాయిస్‌ వాడటంపై వివాదం - వివరణ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్ మణిశర్మ
వయస్సును రివర్స్ చేయొచ్చు - నమ్మడం లేదా? తన ఏజ్‌ను 22 ఏళ్లకు తగ్గించుకున్న ఈ 78 ఏళ్ల డాక్టర్ సీక్రెట్ ఇదే
వయస్సును రివర్స్ చేయొచ్చు - నమ్మడం లేదా? తన ఏజ్‌ను 22 ఏళ్లకు తగ్గించుకున్న ఈ 78 ఏళ్ల డాక్టర్ సీక్రెట్ ఇదే
Wine Shops Closed : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, రెండ్రోజులు వైన్స్ షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్ న్యూస్, రెండ్రోజులు వైన్స్ షాపులు బంద్
Embed widget