Tiger Attacks Dog: దాక్కో దాక్కో కుక్క.. పులొచ్చి కొరుకుద్ది పీక.. ఇక్కడ అదే జరిగింది, ఇదిగో వీడియో!
పులులు ఈ మధ్య అడవుల్లో కంటే.. జనవాసాల మధ్య ఎక్కువగా తిరుగుతున్నాయి. అప్పుడప్పుడు రోడ్లపైకి వచ్చి పలకరిస్తున్నాయి. ఆకలిస్తే.. కుక్కలను ఆహారంగా చేసుకుంటున్నాయి.
‘పుష్ప’ సినిమాలోని ‘‘దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక’’ పాట ఈ ఘటనకు కరెక్టుగా సరిపోతుంది. జనవాసాల్లోకి వచ్చిన ఓ పులి.. ఓ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. దీంతో ఆ ఇంట్లోని ఓ కుక్క దానిపై దాడి చేసి.. నోట కరుచుకుని ఎత్తుకెళ్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయ్యో.. ఆ కుక్క పులిని చూసిన వెంటనే దాక్కొని ఉంటే ప్రాణాలు దక్కేవని అంతా జాలిపడతున్నారు. కానీ, కుక్కలు విశ్వాసానికి మారుపేరు.. తమ ఇంటికి వచ్చిన ఆపదను యజమాని వరకు చేరనివ్వవు. ఆ పులిని తరిమి.. ఆ ఇంటిని, యజమానిని రక్షిద్దామని అనుకుంది. చివరికి తన ప్రాణాలనే త్యాగం చేసింది.
ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందో తెలియరాలేదు. ఈ వీడియోను IFS అధికారి ప్రవీణ్ కాశ్వన్ శనివారం ట్వీట్ చేశారు. జనవాసాల్లోకి వచ్చిన ఓ పులి ఇంటి గేటు ముందుకు వచ్చి ఆహారం కోసం వెతకసాగింది. దానికి ఆ ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క కనిపించింది. అంతే.. అమాంతంగా గేటు దూకేసింది. దాన్ని చూడగానే కుక్క పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ, అప్పటికే ఆలస్యమైంది. పులి.. దాని పీకను నోటితో పట్టుకుని గోడ దూకి తీసుకెళ్లిపోయింది.
See that leopard. Others don’t stand a chance. Via WA. pic.twitter.com/Ha3X9eBwWl
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 24, 2021
మీరు పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే.. చాలా జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆకలితో ఉండే పులులు జనావాసాల్లోకి వచ్చి కుక్కలను ఆహారంగా తీసుకుంటున్నాయని, పెంపుడు కుక్కలకు ఐరన్ కాలర్ పెట్టినట్లయితే.. పులులు వాటిని ఎత్తుకెళ్లలేవని సూచిస్తున్నారు. మీరు కూడా అటవీ లేదా పర్వత ప్రాంతాల్లో ఉంటున్నట్లయితే.. మీ పెంపుడు కుక్కకు ఐరన్ కాలర్ పెట్టండి. ఏం చేస్తాం.. ముప్పు ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం.
This is unusual sight for some. But in many regions including hilly areas Leopards usually hunt dogs. So local people keep a iron collar over their pets. Which save them.
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 24, 2021
Also in many regions stray dogs are huge trouble for leopards. One example from Reddit. pic.twitter.com/YFErLiD1VQ
Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్
Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!
Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)
Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి