Mayonnaise: పచ్చిగుడ్లతో చేసే మయోనెస్‌ను నిషేధించిన కేరళ - ఎందుకు?
ఉప్పగా తగిలే మయోనెస్ అంటే పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టం. అయితే దీనిని కేరళ ప్రభుత్వం నిషేధించింది.
హోటల్లో అందించే ఆహారం నాణ్యత పై ప్రభుత్వ వర్గాలు చెక్ చేస్తూనే ఉంటాయి. కేరళలో కేవలం ఫుడ్ పాయిజనింగ్ వల్లే ఎక్కువ మరణాలు నమోదు అవుతూ ఉంటాయి.అందుకే కేరళ ప్రభుత్వం ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తుంది. ఈ క్రమంలో ఉడకబెట్టని గుడ్లను ఉపయోగించి చేసే మయోనైస్ ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పాశ్చరైజ్డ్ గుడ్లతో చేసిన మయోనెస్, గుడ్లు ఉపయోగించకుండా చేసే వెజ్ మయోనెస్ ను మాత్రం అమ్ముకోవచ్చని చెప్పింది.
కేరళకు చెందిన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కొన్ని రోజులుగా హోటళ్లలో మయోనెస్‌ను చెక్ చేసింది. అందులో పచ్చి గుడ్లతో చేసే మయానెస్ వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, అవి త్వరగా పాడవుతాయని వారు గుర్తించారు. అందుకే ఉడకని గుడ్లతో చేసే మయోనెస్ వాడకూడదని కేరళ ప్రభుత్వం చెప్పింది.
పచ్చి గుడ్లతో చేసిన మయోనెస్‌లో బ్యాక్టీరియా పునరుత్పత్తి త్వరగా జరుగుతున్నట్టు గుర్తించారు అధికారులు. మయోనెస్ వాడకం గత అయిదేళ్లుగా అధికమైంది. నూనె, పంచదార, ఉప్పు, నిమ్మరసం వంటి పదార్థాలతో పాటు గుడ్డులోని తెల్ల సొనను గ్రైండ్ చేసి మయోనైస్ తయారు చేస్తారు. ఇలా పచ్చి గుడ్డును వాడడం వల్ల ఇందులో బ్యాక్టీరియా ఉత్పత్తి అధికంగా ఉన్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అలాగే కొవ్వు శాతం కూడా అధికంగా ఉంటుంది. ఒక స్పూను మయోనైస్లో 94 కేలరీలు శక్తి శరీరానికి అందుతుంది. కాబట్టి బరువు త్వరగా పెరుగుతారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు ఈ తెల్లని క్రీమును తినకూడదు.
View this post on Instagram
Also read: సంక్రాంతి రోజు వీటిని కచ్చితంగా తినాల్సిందే - తింటేనే పండుగ చేసుకున్నట్టు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.