Walking for Heart : రోజూ నడిస్తే గుండెకు మంచిదా? కాదా? నిపుణులు ఏమంటున్నారంటే
Walking Benefits : నడక ఆరోగ్యానికి మంచిదే కానీ.. గుండె ఆరోగ్యానికి మంచిదా కాదా? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Walking and Heart Disease : రోజూ నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే వ్యాయామం చేయలేనివారు కనీసం వాకింగ్ అయినా చేయాలని సూచిస్తారు నిపుణులు. బరువు తగ్గడం నుంచి యాక్టివ్గా ఉండడం, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలని దూరం చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అయితే ఇది గుండె ఆరోగ్యానికి మంచిదా? కాదా? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటి? వంటి విషయాలు తెలుసుకుందాం.
నడక గుండెకు మంచిదా? కాదా?
కార్డియాలజిస్టుల ప్రకారం రోజూ నడవడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిదట. రోజుకు 30 నిమిషాలు వేగంగా నడవడం వల్ల హృదయ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో తేలింది. కాబట్టి గుండె ఆరోగ్యం కోసం రోజూ నడవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎందుకు మంచిదంటే..
రోజూ వాకింగ్ చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావం గుండెపై పడకుండా ఆరోగ్యం మెరుగవుతుందని చెప్తున్నారు. లేకుంటే బీపీ, షుగర్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని దూరం చేసుకోవాలనుకుంటే రోజూ వాకింగ్ చేయాలి అంటున్నారు. అయితే ఏ వ్యాధివల్ల గుండెపై ఎలాంటి ఇబ్బంది పడుతుంది.. నడకతో ఆ ఇబ్బందులు ఎలా దూరం చేసుకోవచ్చంటే..
బీపీ
రక్తపోటు అధికంగా ఉంటే అది గుండెపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అందుకే బీపీ ఉంటే హార్ట్ఎటాక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దానిని కంట్రోల్ చేసుకోవడానికి రోజూ వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ప్రతిరోజూ నడవడం వల్ల బీపీ కంట్రోల్ అవ్వడంతో పాటు గుండె సమస్యలు ప్రమాదం తగ్గుతుందని చెప్తున్నారు.
రక్త ప్రసరణ
రక్త ప్రసరణ తక్కువగా ఉంటే వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందానికి, జుట్టు ఎదుగుదలపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. సరైన రక్త ప్రసరణ లేకుంటే గుండెకు కూడా ప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల అవయవాలు డ్యామేజ్ అవుతాయి. ఈ ఇబ్బందిని దూరం చేసుకోవడంలో కూడా వాకింగ్ మంచి ప్రయోజనాలు ఇస్తుంది. నడక శరీరంలో రక్తప్రసరణను పెంచుతుంది. దీనివల్ల గుండె సమర్థవంతంగా బ్లడ్ పంప్ చేస్తుంది.
చెడు కొలెస్ట్రాల్
చెడు కొలెస్ట్రాల్ వివిధ కారణాల వల్ల శరీరంలో పేర్కొంటుంది. అయితే ఇది ఎక్కువ అయితే రక్తంలో కలిసి హార్ట్ పంపింగ్ విధానాన్ని స్లో చేయడం, లేదా గుండె చుట్టూ పేర్కొని గుండె సమస్యలను రెట్టింపు చేయడం చేస్తుంది. సరైన్ వ్యాయామం లేకుంటే పరిస్థితి ఇంకా దిగజారుతుంది. కాబట్టి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు కచ్చితంగా వాకింగ్ చేయాలి. వ్యాయామం కూడా దానితో జత చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కొలెస్ట్రాల్ పెరిగితే గుండె ప్రమాదం రెట్టింపు అవుతాయని గుర్తించుకోవాలి.
మధుమేహం..
మధుమేహం కూడా గుండె ఆరోగ్యంపై నెగిటివ్గా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని మెరుగుచేసుకోవడానికి రోజూ వాకింగ్ చేయాలని గుర్తించుకోండి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవాలంటే తిన్న తర్వాత కచ్చితంగా వాకింగ్ చేస్తే మంచిది.
బరువు
బరువు ఎక్కువగా ఉన్నా కూడా గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. దానిని తగ్గించుకునేందుకు కూడా నడక మంచి ఫలితాలు ఇస్తుంది. ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి, బరువును అదుపులో చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది బెస్ట్ ఆప్షన్.
ఇవన్నీ హార్ట్ సమ్యలను దూరం చేస్తాయి. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజూ వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. రెగ్యులర్గా వాకింగ్ చేయడం వల్ల 20 నుంచి 30 శాతం హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్స్ తగ్గతున్నాయని స్టడీలు పేర్కొంటున్నాయి. కాబట్టి మీరు గుండె ఆరోగ్యంతో పాటు పూర్తి ఆరోగ్నాన్ని కాపాడుకునేందుకు రోజూ నడిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.






















