Best Time to Walk : ఉదయం నడిస్తే మంచిదా? సాయంత్రం నడక బెటరా? ఎప్పుడు వాక్ చేస్తే మంచిదో తెలుసా?
Benefits of Walking : ఆరోగ్యంపైన శ్రద్ధతో చాలామంది వాక్ చేస్తూ ఉంటారు. కొందరు ఉదయం నడిస్తే.. మరికొందరు సాయంత్రం నడుస్తారు. కానీ ఏ సమయంలో నడిస్తే మంచి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
Morning Walk vs Evening Walk : బరువు తగ్గాలనే, ఫిట్‌గా ఉండాలని, నడిస్తే ఆరోగ్యానికి మంచిదని చాలామంది వాక్ చేస్తారు. కొందరు పనులు మానుకుని సమయాన్ని కేటాయించి వాక్ చేస్తే.. మరికొందరు పనుల్లో భాగంగానే వాక్ చేస్తూ ఉంటారు. ఉదయాన్నే నిద్ర లేచి వాకింగ్ చేస్తే ఫిట్‌గా ఉంటారని కొందరు నమ్మితే.. ఉదయం సమయం దొరకట్లేదు సాయంత్రం నడిస్తేనే బెటర్ అని మరికొందరు వాకింగ్ చేస్తారు. అయితే ఈ రెండు సమయాల్లో ఏది మంచిది. అసలు ఏ సమయంలో నడిస్తే ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందుతాయో ఇప్పుడు చూసేద్దాం.
ఉదయం నడక, సాయంత్రం వాక్‌లో ఏది మంచిదో.. సైన్స్ ఏమి చెప్తుంది. అసలు నడకవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. ఉదయం నడిస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? సాయంత్రం నడిస్తే కలిగే లాభాలు ఏంటి? నడిచేందుకు ఏది బెస్ట్ టైమో.. దానివల్ల కలిగే లాభాలు ఏంటో.. నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో చూసేద్దాం.
ఉదయపు నడకతో కలిగే లాభాలు.. (Morning Walk Benefits)
ఎర్లీ మార్నింగ్ లేచి పార్క్‌లో లేదా ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో వాక్ చేస్తే శారీరక, మానసిక ప్రయోజనాలు పొందవచ్చు. పనుల్లో క్లారిటీ వస్తుంది. ఫోకస్ పెరుగుతుంది. మెటబాలీజం పెరిగి బరువు తగ్గుతారు. ఫ్యాట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. పార్క్‌లలో లేదా చెట్ల మధ్య తిరిగితే ప్యూర్ ఆక్సీజన్ అందుతుంది. చేసే పనుల్లో క్రియేటివిటీ.. ప్రొడెక్టివిటీ పెరుగుతుంది.
సాయంత్రం నడిస్తే ఇవే బెనిఫిట్స్ (Evening Walk Benefits)
ఉదయం పనుల్తో సమయం కుదరదనుకుంటే సాయంత్రం హాయిగా నడవచ్చు. దీనివల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గుతుంది. మంచిగా రిలాక్స్ అవుతారు. నిద్ర నాణ్యత పెరుగుతుంది. నిద్ర సమస్యలు ఉన్నవారికి ఇది మెరుగైన ఫలితాలు ఇస్తుంది. జీర్ణసమస్యలు దూరమై.. గట్ హెల్త్ మెరుగవుతుంది.
ఏ సమయం బెస్ట్ అంటే..
ఉదయం నడిచినా.. సాయంత్రం నడిచినా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలే అందుతాయి. కాబట్టి మీకు ఏ సమయం అనువుగా ఉంటుందో చూసుకోవాలి. అంతేకాకుండా వాతావరణం ఏ సమయంలో అనుకూలంగా ఉందో చూసుకుని వాక్ చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. కాబట్టి వ్యక్తిగత సమయాలకు అనుగుణంగా దీనిని ప్లాన్ చేసుకోవచ్చు. అయితే కొందరు అదే పనిగా ఎక్కువ నడుస్తారు. అది మంచిది.
ఒకవేళ మీరు వాక్ చేయాలనుకుంటే.. మొదటి రోజు ఎక్కువ నడిచేసి.. తర్వాత తగ్గించడం కాకుండా.. మీరు రోజూ ఒకటే దూరం వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. ఇది మీకు అలవాటు అయితే.. ఆ తర్వాత దూరాన్ని పెంచుకోవచ్చు. మీ శరీరం చెప్పే మాట వినండి. అది అలసట ఉన్నప్పుడు దాని మాట విని.. రెస్ట్ ఇవ్వండి. ఫోర్స్ చేసి.. మీరు వాక్ చేస్తాను అంటే హెల్త్ సమస్యలు పెరుగుతాయి. అలాగే మీ లైఫ్‌స్టైల్‌కి, శరీరానికి, టైమ్‌కి ఏది సెట్ అవుతుందో మీకు తెలియకపోతే.. నిపుణుల సలహాలు తీసుకుని దానికి అనుగుణంగా దీనిని ప్లాన్ చేసుకుంటే.
Also Read : టెన్షన్ తగ్గించుకోండి లేదంటే హార్ట్ ఎటాక్స్ తప్పవట.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిపుణుల సలహాలు ఇవే