అన్వేషించండి

Irregular Heartbeat: ఈ లక్షణాలకు కనిపిస్తే గుండె లయ తప్పినట్టే, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోతాయ్ జాగ్రత్త

గుండె జబ్బుల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. హృదయ సంబంధ సమస్యలు వచ్చే ముందు బాడీలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే..

Irregular Heartbeat Warning Signs: శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె. గుండె ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. హైబీపీ, హై కొలెస్ట్రాల్, డయాబెటిస్, ఒబేసిటీ, స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే, గుండె సంబంధ సమస్యలు వచ్చే సమయంలో కొన్ని లక్షణాలు ముందుగానే తెలుస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదిస్తే ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంతకీ గుండె సమస్యలు ఎదురయ్యే ముందు కనిపించే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం..

1. ఆందోళన

కొన్నిసార్లు అనుకోకుండా శరీరంలో ఆందోళన ఏర్పడుతుంది. గుండె సమస్యలలో ఆందోళన కూడా ముఖ్యమైనది. ఆందోళన అనేది గుండె సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. హృదయం మీద అధిక భారం పడినప్పుడు ఈ లక్షణం కనిపిస్తుంది.  

2. దడ

గుండె సమస్యలు తలెత్తే సమయంలో ప్రధానంగా కనిపించే లక్షణం గుండె వేగంగా కొట్టుకోవడం. అప్పుడప్పుడు దడ అనేది ప్రమాదం కానప్పటికీ, తరచుగా గుండె దడ ఏర్పడితే సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. గుండె దడ అనేది గుండె పోటుకు ప్రాథమిక లక్షణంగా చెప్పుకోవచ్చు.

3. అలసట

తీవ్రమైన అలసట కూడా గుండె సమస్యకు కారణం కావచ్చు. చిన్న పనికి కూడా చేతకాకపోవడం, నడవడానికి కూడా ఇబ్బంది పడితే హృదయ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. గుండె సమర్థవంతంగా రక్తాన్ని పంపింగ్ చేయనప్పుడు, శరీరానికి అవసరమైన ఆక్సీజన్ అందనప్పుడు ఈ సమస్యల తలెత్తుతుంది.

4. మైకం కమ్మడం

తరచుగా తల తిరిగినట్టైతే గుండె సరిగా కొట్టుకోవడం లేదని అర్థం. మెదడు, ఇతర అవయవాలకు రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. మనిషి మూర్చపోవడంతో పాటు అకస్మాత్తుగా పడిపోయే అవకాశం ఉంటుంది.

5. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

పని చేస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే గుండె సంబంధ సమస్యకు కారణంగా పరిగణించాలి. గుండె రక్తాన్ని సరిగ్గా ప్రసరణ చేయని సందర్భంలో ఈ సమస్య ఏర్పడుతుంది. ఊపిరితిత్తులలో ఫ్లూయిడ్స్ పేరుకుపోయినప్పుడు కూడా ఈ సమస్య ఏర్పడుతుంది.

6. చెమటలు పట్టడం

సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా చెమటలు పట్టడం కూడా హృదయ సమస్యకు కారణం కావచ్చు. ప్రత్యేకించి శారీరక శ్రమ, ఎక్కువ వేడి లేని సమయంలో ఈ లక్షణం కనిపిస్తే సీరియస్ గా తీసుకోవాలి. గుండె సరిగా పని చేయని సందర్భంలో ఈ లక్షణం కనిపిస్తుంది. 

7. ఛాతీలో నొప్పి

ఛాతీలో నొప్పి లేదంటే ఛాతిలో అసౌకర్యం కలిగినా హృదయ సంబంధ సమస్యకు కారణంగా పరిగణించాలి. ఈ నొప్పి ఒత్తిడిని కలిగించడంతో పాటు గుండెను పిండిన ఫీలింగ్ కలుగుతుంది. తగినంత ఆక్సీజన్ అందని సమయంలో ఈ లక్షణం కనిపిస్తుంది.  

Also Read: పెట్రోల్‌ను కూల్‌డ్రింక్‌లా తాగేస్తున్న యువతి - దాని టేస్ట్ అలా ఉంటుందట!

Read Also: వామ్మో.. ఆ రాష్ట్రంలో లెక్కలేనన్ని ఎయిడ్స్ కేసులు, 48 మంది విద్యార్థులు మృతి - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Ek Love Story: ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి  పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Embed widget