అన్వేషించండి

Curd: పెరుగు మిలిపోయిందా? ఇదిగో ఈ టేస్టీ వంటలు చేసేయండి

పెరుగు మిగిలిపోతే వేస్ట్ చేయకుండా వాటిని అనేక రకాల మార్గాలలో ఉపయోగించి టేస్టీ వంటలు చేసుకోవచ్చు.

పెరుగుతో చివరి ముద్ద తిననిదే భారతీయులు ఆహారం తిన్న సంతృప్తి ఉండదు. ప్రతి ఒక్కరూ పెరుగుని ఏదో ఒక విధంగా తీసుకుంటూనే ఉంటారు. కానీ ఫ్రెష్ పెరుగుకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. కాస్త పుల్లటి వాసన వచ్చినా సరే పక్కన పెట్టేస్తారు. బాబోయ్ పులుపు అని నోట్లో పెట్టుకోవడానికి కూడ ఇష్టం చూపించరు. దాన్ని బయట పడేస్తారు. కానీ ఇలా మిగిలిపోయిన పెరుగుతో బోలెడు లాభాలు ఉన్నాయని మీకు తెలుసా? వీటి గురించి తెలిస్తే మాత్రం పెరుగు అసలు వేస్ట్ చేయకుండా ఉంటారు.

స్మూతీస్: మిగిలిపోయిన పెరుగులో తాజా పండ్ల ముక్కలు, కొద్దిగా తేనె వేసుకుని బ్లెండ్ చేసుకుని స్మూతీలా చేసుకోవచ్చు. పెరుగు క్రీమ్ ఫ్లేవర్ ని అందిస్తుంది.

మారినేడ్: చికెన్, మటన్, టోఫు ఏదైనా మసాలా కూర వండుకోవడానికి మెరినేట్ చేసి పెట్టుకుంటారు. అందులో ఫ్రెష్ పెరుగుకి బదులు పుల్లగా ఉండే పెరుగు వేస్తే రుచి బాగుంటుంది.

సలాడ్ డ్రెస్సింగ్: పెరుగులో సుగంధ ద్రవ్యాలు, లెమన్ జ్యూస్, ఆలివ్ ఆయిల్ వేసుకుని క్రీమ్ గా టాంగీ చేసుకోవచ్చు. ఇది సలాడ్ మీద డ్రెస్సింగ్ గా వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

రైతా: బిర్యానీలో రైతా లేకుండా కంప్లీట్ చేసిన సంతృప్తి రాదు. దోసకాయ, క్యారెట్, ఉల్లిపాయలు, దానిమ్మ గింజలు, టొమాటో ముక్కలు వేసి చక్కగా రైతా చేసుకుని తినవచ్చు. స్పైసీ డిష్ తిన్న తర్వాత రైతాతో తింటే వేడి కూడా చేయదని చెప్తుంటారు.

లస్సీ: పెరుగులో కాస్త పంచదార, నీళ్ళు, మామిడి లేదా రోజ్ వాటర్ కలుపుకుని బ్లెండ్ చేసుకుని లస్సీ తయారు చేసుకోవచ్చు. దీనికి తాజా పెరుగు మాత్రమే కాదు మిగిలిపోయిన పెరుగుతో చేసుకున్న టేస్ట్ సూపర్ గా ఉంటుంది.

డిప్స్: పెరుగులో సుగంధ ద్రవ్యాలు, మూలికలు, కాల్చిన వెల్లుల్లి వేసి డిప్ తయారు చేసుకోవచ్చు. కూరగాయలు, చిప్స్, పిటా బ్రెడ్ ని డిప్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది.

పర్ఫైట్: ఆరోగ్యకరమైన, రుచికరమైన పర్ఫైట్ కోసం గ్రానోలా, తాజా పండ్లు, తేనె వేసుకుని చేసుకోవచ్చు.

బేకింగ్: బేకింగ్ రెసిపిలో కొంత భాగం మజ్జిగ, పెరుగు లేదా పాలతో చేసుకోవచ్చు. ఇది కేక్, మఫిన్, పాన్ కేక్ లో టాంగ్ గా వేసుకోవచ్చు.

ఫ్రీజింగ్: మిగిలిపోయిన పెరుగులో పండ్లు, తేనె వేసుకుని ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ మాదిరిగా చాలా టేస్టీగా ఉంటుంది.

పాప్సికల్స్: పాప్సికల్ అచ్చులలో పెరుగు పోసి అందులో పండ్లు లేదా పండ్ల ప్యూరీ చేసుకోవచ్చు. చల్లగా ఉండటం కోసం దాన్ని కాసేపు ఫ్రిజ్ లో పెట్టుకుంటే సరిపోతుంది.

ఫేస్ మాస్క్: పెరుగులో మాయిశ్చరైజింగ్, ఎక్స్ ఫోలియేటయింగ్ గుణాలు ఉన్నాయి. మెరిసే చర్మం కోసం ఇంట్లో తయారు చేసిన ఫేస్ మాస్క్ లో తేనె, ఓట్ మీల్ కలుపుకుని వేసుకోవచ్చు. ఇది చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది.

హెయిర్ కండిషనర్: జుట్టుకు సహజమైన కండిషనర్ గా పెరుగు వేసుకోవచ్చు. తలకి పెరుగు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

ALso Read: ఎమోషనల్ స్ట్రెస్ వల్ల గుండె ప్రమాదంలో పడుతుంది జాగ్రత్త!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget