By: ABP Desam | Updated at : 02 Oct 2023 02:31 PM (IST)
Image Credit: Pixabay
దీర్ఘకాలిక ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలని చూపిస్తుంది. ఇది ఆందోళన, భయం, నిరాశ, విచారం మరెన్నో భావోద్వేగాలకి దారి తీస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల ప్రభావితమయ్యే శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. ఒత్తిడికి ప్రతిస్పందనగా శరీరం కాటేకొలమైన్ అని పిలిచే ఒత్తిడి హార్మోన్ విడుదల చేస్తుంది. ఈ ఒత్తిడి హార్మోన్లు శరీరంలో ఆక్సిజన్ డిమాండ్ ని పెంచుతాయి. దీని వల్ల శరీరం చురుకుగా స్పందించేలా చేస్తుంది. పెరిగిన ఆక్సిజన్ డిమాండ్ వల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది.
దీర్ఘకాలిక ఒత్తిడి ప్రభావాలు
హృదయ స్పందన రేటు, రక్తపోటులో దీర్ఘకాలిక పెరుగుదల కనిపిస్తుంది. గుండె పరిమాణంలో కోలుకోలేని మార్పు కనిపిస్తుంది. గుండె లయలో మార్పులు సంభవిస్తాయి. కరొనరీ ధమనుల సంకోచ వ్యాకోచాలలో మార్పుల వల్ల గుండె కండరాలకి రక్త సరఫరా తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని మయోకార్డియల్ ఇస్కిమియా అంటారు. గుండె అసాధారణ లయలు మెదడులో రక్తం గడ్డకట్టేలా చేస్తుంది. ఫలితంగా స్ట్రోక్ కి కారణమవుతుంది. చాలా కాలం పాటు ఒత్తిడి హార్మోన్లు గుండె జబ్బులకి సాధారణ ప్రమాద కారకాలుగా ఉన్నాయి. రక్త కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, షుగర్ లేవల్స్ పెంచుతాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
నిద్రలేమికి కారణమయ్యే భావోద్వేగ ఒత్తిడి
మానసిక ఒత్తిడి పేలవమైన నిద్రని ప్రోత్సహిస్తుంది. నిద్ర సరిగా లేకపోవడం వల్ల పని మీద దృష్టి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. నిద్రసరిపోకపోతే రక్తపోటు పెరగడానికి దారి తీస్తుంది. నిరంతరం ఈ సమస్య వస్తే అది గుండెకి ప్రమాదకారిగా మారుతుంది. సుదీర్ఘకమైన మానసిక ఒత్తిడి శారీరక శ్రమ తగ్గడానికి దారి తీస్తుంది. ఇది ఊబకాయానికి కారణమవుతుంది. స్థూలకాయం నిద్రలో శ్వాస సమస్యలు కలిగిస్తుంది. దీన్నే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అని పిలుస్తారు. ఇది చికిత్స చేయకపోతే గుండె ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే రక్తపోటు పెరగడానికి దోహదపడుతుంది.
ఆహార కోరికలు పెంచుతుంది
స్వీట్లు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మానసిక ఒత్తిడికి దారి తీస్తాయి. అవి గుండెకి హానికరం. మానసిక ఒత్తిడి నుంచి బయట పడటానికి ఆల్కహాల్, ధూమపానం వంటి అలవాట్లుకి బానిసలుగా మారే ప్రమాదం ఉందని పరిశోధనలో తేలింది. యువతలో గుండె జబ్బులు, మరణాలకి ప్రధాన కారకంగా ఉంటుంది.
ఇటీవల జరిపిన పరిశోధన ప్రకారం కార్డియోవాస్కులర్ యాక్టివిటీ, ఇన్ఫ్లమేశం మధ్య సంబంధాన్ని చూపిస్తుంది. బాల్యంలో ఒత్తిడితో కూడిన బాధకరమైన సంఘటనలు ఏవైనా ఉంటే వాటి తాలూకు గుర్తులు తర్వాత జీవితంలో గుండె జబ్బులకు ప్రమాద కారకాలుగా మారతాయట. సాధారణ కరొనరీ ఆర్టరీ వ్యాధులతో పాటు ఒత్తిడి కార్డియోమయోపతి అని పిలిచే గుండె కండరాల బలహీనతకు కారణమవుతుంది. ఇది దుఖం, భయం, విపరీతమైన కోపం వంటి అనేక రకాల భావోద్వేగ ఒత్తిళ్ళని కలిగిస్తుంది. గుండె జబ్బులకి కారణమవుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: పచ్చి అరటి పండు తినడం వల్ల ఈ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చా?
Facts about Christmas : క్రిస్మస్ గురించి అమ్మబాబోయ్ అనిపించే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.. మీకు తెలుసా?
Diet Soda Drinks: డైట్ సోడా డ్రింక్స్ అధికంగా తాగుతున్నారా? మీ కాలేయం ప్రమాదంలో పడినట్లే, నష్టలివే!
Instant Breakfast Recipe : బరువును తగ్గించే ఈజీ రెసిపీ.. దీనికి ఆయిల్ అవసరమే లేదు
Diabetic Coma : డయాబెటిక్ కోమాకి కారణాలు ఇవే.. ప్రాణాలమీదకి తెచ్చే సమస్యకు చెక్ పెట్టొచ్చా?
Christmas Celebrations : క్రిస్మస్ పండుగ వచ్చేస్తోంది, ఏ దేశంలో ఎలా జరుపుకుంటారో తెలుసా?
Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం
MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!
మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ
Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు
/body>