Optical Illusion: ఈ చిత్రంలో చేప ఉంది కనిపించిందా? 30 సెకన్లలో కనుక్కుంటే మీరు తెలివైన వారే
Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్ వల్ల మీకు కాసేపు కచ్చితగా టైమ్ పాస్ అవుతుంది.
Optical Illusion: కంటిని మాయ చేసే మాయాజాలం ఆప్టికల్ ఇల్యూషన్. కళ్ల ముందే అంతా కనిపిస్తున్నా కూడా ఇంకా ఏదో దాక్కునే ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన బొమ్మలో పిల్లి, కుక్క క్లియర్ గా కనిపిస్తున్నాయి. అలాగే కుండ, చెత్త డబ్బా కూడా కనిపిస్తోంది. ఉత్తరాలు, కర్టెన్లు, ఖాళీ టిన్లు అనేకం ఉన్నాయి. వీటితో పాటూ ఆ బొమ్మలో ఓ చేప కూడా ఉంది. అది ఎక్కడుందో కనుక్కుంటే మీరు చాలా తెలివైన వారే. కాకపోతే అది ఎక్కడుందో మాత్రం కనిపెట్టడం కాస్త కష్టమే. బొమ్మను కాస్త పరిశీలనగా చూస్తే మీకు చెప్ప కనిపించేస్తుంది.
కనిపించిందా?
మీకు క్లూ కావాలా?... చేప వేరేగా కాకుండా ఒక వస్తువుపై డ్రాయింగ్ రూపంలో ఉంది. కాస్త పరిశీలనగా చూస్తే మీకు దొరకేస్తుంది. గంట సేపు చూస్తే ఎవరికైనా కూడా చేప కనిపించేస్తుంది. కానీ కేవలం 30 సెకన్లలో మాత్రమే దాన్ని కనిపెట్టాలి.
జవాబు ఇదిగో...
చేప కనిపెట్టేసిన వాళ్లకి కంగ్రాట్స్. కనిపెట్టని వాళ్ల కోసమే ఈ జవాబు. నీళ్ల కుండ కింద పడి నీరంతా బయటికి పోయినట్టు ఉంది కదా, కుండపైన చూడండి సన్నని గీతలో ఓ చేప బొమ్మ ఉంది. పరిశీలనగా చూస్తే ఆ చేప బొమ్మ కనిపించేస్తుంది.
ఆప్టికల్ ఇల్యూషన్లు ఈనాటివి కావు. వీటికి వేల ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు. టీవీలు వంటి వినోదాలు లేని కాలంలో ఇవే అప్పటి ప్రజలకు అలరించాయిట. అయితే వీటి సృష్టి కర్త ఎవరో మాత్రం ఇంతవరకు తెలియలేదు . చరిత్రకారులు తెలుసుకునే ప్రయత్నం చేసినా జవాబు దొరకలేదు. మెదడు చురుగ్గా పనిచేయడానికి ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు మేలు చేస్తాయి. ఇలాంటివి మెదడుకు , కంటికి సమన్వయాన్ని పెంచుతాయి. అలాగే ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే ఆప్టికల్ ఇల్యూషన్లు చాలా ప్రజాదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లు క్రియేట్ చిత్రకారుల సంఖ్య పెరిగిపోయారు. విదేశాల్లో చాలా మంది చిత్రకారులు ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లు వేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఇల్యూషన్లు వైరల్ గా మారాయి.
ఆప్టికల్ ఇల్యూషన్లంటే ఇష్టమైన వారు ఇన్ స్టాలో వీటి కోసం ప్రత్యేకంగా ఉన్న పేజీలను అనుసరించవచ్చు.
View this post on Instagram
Also read: కొత్త ఏడాది వేడుకల్లో అతిగా మద్యం తాగాలనుకుంటున్నారా? అయితే మీ శరీరంలో ఏం జరుగుతుందంటే