News
News
X

Carrot Peel Benefits: క్యారెట్ తొక్కతో ఎన్నో ప్రయోజనాలో తెలిస్తే ఇంకెప్పుడు వాటిని పారెయ్యరు

క్యారెట్ తో చేసే ఏ వంటకాలైనా చాలా రుచి కరంగా ఉంటాయి. వాటి తొక్కలతో కూడా బోలెడు ఉపయోగాలు ఉన్నాయి.

FOLLOW US: 

క్యారెట్ రంగే కాదు రుచి కూడా చాలా బాగుంటుంది. క్యారెట్ తో ఏ వంటకం చేసిన అద్భుతంగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే కెరోటిన్ కంటికి చాలా మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తి పెంచి రక్తహీనత సమస్య రాకుండా చేస్తుంది. వీటిలో ఉండే పొటాషియం రక్తనాళాలకి మేలు చేస్తుంది. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. తరచూ క్యారెట్ తినడం వల్ల మలబద్ధకం సమస్య రాదు. చిన్న పిల్లలకి బియ్యం, క్యారెట్, బంగాళాదుంప ముక్కలు వేసి ఉడికించి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఆరు నెలలు దాటిన పసి పిల్లలకి ఇది బలవర్థకమైన ఆహారం. ఎక్కువ మంది క్యారెట్ తొక్కు తీసేసి వండుకుంటారు. కానీ ఆ తొక్కలో కూడా బోలెడు పోషకాలు ఉన్నాయి. క్యారెట్ పీల్స్ లో మూడింట ఒక వంతు ఫైబర్ ఉంటుంది. ఆ తొక్కతో కూడా రకరకాల వంటలు చేసుకోవచ్చు. వాటి వల్ల ఉన్న ఉపయోగాలు తెలిస్తే ఇంకెప్పుడు వాటిని పారెయ్యరు.

క్యారెట్ తొక్క స్టాక్

క్యారెట్ తొక్కలని ఉడకబెట్టి దానికి కొంచెం ఉప్పు వేసి వాటిని ఏదైనా కూర లేదా సూప్ కూడా చేసుకోవచ్చు. తొక్కల్లో ఉండే ఫైబర్ శరీరానికి అన్నీ విధాలుగా ప్రయోజనాలు అందిస్తుంది.

చిప్స్

ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వాటికి కొద్దిగా మసాలాలు జోడించి చిప్స్ మాదిరిగా వేసుకోవచ్చు. బంగాళాదుంపలు చిప్స్ వేసుకున్నట్టుగా క్యారెట్ తొక్కతో చిప్స్ చేసుకుంటే చాలా రుచిగా, కరకరలాడుతూ ఉంటాయి.

క్యారెట్ పీల్స్ తో పేస్ట్

తులసి, పైన్ గింజలు, ఆలివ్, చీజ్ కలిపి క్యారెట్ పీల్స్ తో కలిపి పేస్ట్ చేసుకోవచ్చు. ఇందులో వాల్ నట్స్, పిస్తా కూడా జోడించవచ్చు. ఇది ఆరోగ్యకరం కూడా.

News Reels

క్యారెట్ సూప్

కొన్ని నానబెట్టిన గింజలతో పాటు క్యారెట్ తొక్కలు బ్లెండ్ చేసి వాటిని కొబ్బరి పాలతో బాగా ఉడికించాలి. ఉప్పు, కారం కూడా కొద్దిగా వేసుకోవాలి. ఈ ఫైబర్ రిచ్ సూప్ ఎంతో రుచిగా ఉండి శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తుంది. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది.

గార్నిష్ గా

శాండ్ విచ్, ర్యాప్ ఇలా ఏ రుచికరమైన వంటకం మీద చక్కగా అలంకరించడానికి ఉపయోగించుకోవచ్చు. తొక్కలను నీటిలో శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత వాటిని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అలా కాకుండా జ్యూసీ రుచి పొందడానికి పచ్చిగా కూడా గార్నిష్ చేసుకోవచ్చు.

క్యాండి క్యారెట్

క్యారెట్ పీల్స్ షుగర్ సిరప్ లో నానబెట్టి వాటిని 200 డిగ్రీల ఫారెన్ హీట్ దగ్గర 30-60 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత 100 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద అవి పొడిబారె వరకు ఉంచుకోవాలి. ఇది ఆరోగ్యకరమైన ఇంట్లో తయారు చేసుకోగలిగే సింపుల్ స్వీట్. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.

క్యారెట్ పొడి

క్యారెట్ తొక్కలను ఎండబెట్టి వాటిని పొడి చేసుకోవాలి. ఈ పొడిని కూర లేదా సూప్ లో ఉపయోగించవచ్చు. పోషక విలువలు పెంచుకోవడానికి సలాడ్స్ లో కూడా వీటిని జోడించుకోవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: ముక్కు నుంచి రక్తం కారుతోందా? ఇలా చేసి ఆపేద్దాం

Also read: మెరిసే జుట్టు కోసం కాఫీ ప్యాక్స్- సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు

Published at : 30 Sep 2022 12:31 PM (IST) Tags: carrot Carrot Peel Carrot Peel Benefits Carrot Peel Uses Carrot Peel chips Healthy Carrot Carrot Peel Soup

సంబంధిత కథనాలు

Cucumber: చలికాలంలో కీరదోస తినొచ్చా? ఆయుర్వేదం నిపుణులు ఏం చెప్తున్నారు

Cucumber: చలికాలంలో కీరదోస తినొచ్చా? ఆయుర్వేదం నిపుణులు ఏం చెప్తున్నారు

Golden Tongue Mummies: పురావస్తు తవ్వకాల్లో బంగారు నాలుకల మమ్మీలు, గోల్డ్‌ కోటెడ్ ఎముకలు

Golden Tongue Mummies: పురావస్తు తవ్వకాల్లో బంగారు నాలుకల మమ్మీలు, గోల్డ్‌ కోటెడ్ ఎముకలు

సంవత్సరానికి 12 నెలలే ఎందుకు ఉన్నాయి? నెలల పేర్లు వెనుకున్నది ఎవరు?

సంవత్సరానికి 12 నెలలే ఎందుకు ఉన్నాయి? నెలల పేర్లు వెనుకున్నది ఎవరు?

Cooking Facts: పాస్తాను నీటితో కడగొచ్చా? మైక్రోవేవ్ ఓవెన్‌లో వంటలు చెయ్యకూడదా? ఏది వాస్తవం, ఏది అపోహ?

Cooking Facts: పాస్తాను నీటితో కడగొచ్చా? మైక్రోవేవ్ ఓవెన్‌లో వంటలు చెయ్యకూడదా? ఏది వాస్తవం, ఏది అపోహ?

విజృంభిస్తున్న కేమల్ ఫ్లూ, ఇదొక అంటువ్యాధి - మళ్లీ మాస్కులు పెట్టుకోవాలా?

విజృంభిస్తున్న కేమల్ ఫ్లూ, ఇదొక అంటువ్యాధి - మళ్లీ మాస్కులు పెట్టుకోవాలా?

టాప్ స్టోరీస్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్