అన్వేషించండి

Oats Dosa : ఓట్స్​తో టేస్టీ, క్రిస్పీ దోశలు.. ఇన్​స్టాంట్ రెసిపీ ఇదే

Healthy Breakfast : మీరు ఇన్​స్టాంట్ దోశను ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటే కాస్త హెల్తీగా ఓట్స్​ను ఉపయోగించవచ్చు. ఇవి మీకు ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు.. క్రిస్పీ, టేస్టీ అనుభూతిని ఇస్తాయి.

Dosa Recipe with Oats : ఓట్స్​తో మీరు రోటీన్ ఫుడ్​ కాకుండా టేస్టీగా, క్రిస్పీగా దోశలు తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం కూడా. ఓట్స్, ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో మీరు టేస్టీ దోశలు రెడీ చేసుకోవచ్చు. మీరు ఇన్​స్టాంట్ దోశల కోసం ఉదయం కాకుండా రాత్రి కూడా ఓట్స్​తో ఈ బ్యాటర్​ తయారు చేసుకోవచ్చు. కానీ వాటిలో ఉల్లిపాయలు అవాయిడ్ చేయాలి. ఉదయాన్నే పిండిలో కాస్త నీరు కలిపి దోశలు పోసుకోవాలి. ఇంతకీ ఓట్స్​తో క్రిస్పీ, టేస్టీ దోశలు ఎలా తయారు చేయాలో, వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

ఓట్స్ - అర కప్పు

బియ్యం పిండి - పావు కప్పు

రవ్వ - పావు కప్పు

పెరుగు - అరకప్పు

ఉల్లిపాయ - 1

అల్లం - అంగుళం

పచ్చిమిర్చి - 2

కొత్తిమీర - 1 కట్ట

కరివేపాకు - 1 రెబ్బ

జీలకర్ర - అర టీస్పూన్

కారం - పావు టీస్పూన్

కొబ్బరి తురుము - 2 టీస్పూన్లు (ఆప్షనల్)

నీరు - తగినంత

ఉప్పు - తగినంత

నూనె - తగినంత 

తయారీ విధానం 

ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీరను బాగా కడిగి సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓట్స్​ను మిక్సీలోకి తీసుకుని మెత్తగా పిండి చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని మిక్సింగ్ గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో బియ్యం పిండి, రవ్వ వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిలో పెరుగు వేసి బాగా మిక్స్ చేయండి. మీరు దీనిలో కాస్త పులిసిన పెరుగు తీసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు దానిలో తగినంత నీరు వేసి దోశ బ్యాటర్​లాగా సిద్ధం చేసుకోవాలి. మీరు నీటికి బదులు పెరుగును కూడా ఉపయోగించవచ్చు.

పిండిని ముద్దలు లేకుండా బాగా మృదువుగా అయ్యేలా కలపాలి. ఇప్పుడు దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలపాలి. జీలకర్ర, కారం, ఉప్పు, తురిమిన తాజా కొబ్బరి వేసి ఈ బ్యాటర్​ను సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయండి. పది నిమిషాల తర్వాత పిండిని తీసి నీటిని అడ్జెస్ట్ చేయండి. ఎందుకంటే ఓట్స్​ పిండి నీటిని పీల్చుకుంటుంది కాబట్టి. పిండి దోశ బ్యాటర్​లా ఉంటే దోశలు మంచిగా వస్తాయి. 

స్టౌవ్ వెలిగించి దానిపై నాన్​ స్టిక్ దోశ పాన్ పెట్టండి. దానికి నూనె అప్లై చేసి.. పిండిని బాగా అప్లై చేసి.. దోశలు పోసుకోండి. పిండిని ఒకేసారి వేసేయకుండా కొద్దిగా కొద్దిగా.. ఖాళీలు ఉండేలు వేయండి. ఇలా చేస్తే దోశ మరింత క్రిస్పీగా వస్తుంది. దోశ వేసిన తర్వాత నూనెను వేసి రోస్ట్ చేయండి. ఒకవైపు బంగారు వర్ణంలోకి వచ్చిన తర్వాత మరోవైపు తిప్పండి. ఇలా ఉడికించిన దానిని ప్లేట్​లోకి తీసుకుండి. మిగిలిన బ్యాటర్​తో కూడా ఇలానే చేయండి. అంతే వేడి వేడి టేస్టీ, క్రిస్పీ ఓట్స్ దోశలు రెడీ. వీటిని మీరు నచ్చిన చట్నీతో లాగించేయవచ్చు. ముఖ్యంగా పల్లీలతో చేసిన చట్నీ దీనికి పర్​ఫెక్ట్ కాంబినేషన్. ఇవి వేడి తగ్గిన తర్వాత తిన్నా కూడా మంచి రుచినే అందిస్తాయి. 

Also Read : టేస్టీ రవ్వ ఇడ్లీలు.. వీటి తయారీకి మినపప్పు అవసరమే లేదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
OLA EV Showroom: ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
Embed widget