Coffee: కాఫీని ఇలా తాగితే సులువుగా బరువు తగ్గుతారు
కాఫీ ద్వారా కూడా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
తెల్లారిందంటే కప్పు కాఫీ చేతిలో ఉండాల్సిందే. లేకుంటే ఉత్సాహం, చురుకుదనం ఏదీ ఉండదు. కాఫీ ఏ ఒక్క పూట కాఫీ తాగకపోయినా ఆ రోజంతా డీలా పడే వారి సంఖ్య ఎక్కువ. ప్రపంచంలో కాఫీ తాగుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. సాధారణంగా పాలు, కాఫీ పొడి, చక్కెర కలుపుకొని దీన్ని తయారు చేస్తారు. అయితే ఈ కాఫీని బరువు తగ్గించే పానీయంగా కూడా మనం మార్చుకోవచ్చు. దీనికి చేయాల్సిందల్లా చిన్న చిట్కాలు పాటించడమే.
కాఫీ తాగే వాళ్ళు దానిలో చక్కెర, పాలు, ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు వంటివి కలపకుండా కేవలం బ్లాక్ కాఫీ తాగడానికి ప్రయత్నించండి. ఇది దీనిలో క్యాలరీలు ఉండవు. అంటే బరువు పెరగరు. ఇది జీవక్రియను పెంచడంలో కూడా సహాయపడుతుంది. దీనివల్ల తిన్నది చక్కగా అరిగి ఒంటపడుతుంది. బరువు పెరగకుండా కొవ్వు రూపంలో పేరుకుపోకుండా బ్లాక్ కాఫీ అడ్డుకుంటుంది.
కాఫీ తాగాలనుకునేవారు చక్కెరను కలపకుండా తాగండి. దీనికి బదులుగా స్టెవియా కలుపుకొని తాగితే మంచిది. స్టెవియా అనేది సహజ స్వీట్నర్. దీనిలో చక్కెర శాతం ఉండదు. ఇది బయట మార్కెట్లలో ఎక్కువగానే లభిస్తుంది. దీన్ని తక్కువ మొత్తంలో కాఫీలో కలుపుకొని తాగుతూ ఉండండి. చక్కెరను దూరంగా పెట్టడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా తగ్గుతుంది.
పాలతో కాఫీలు తయారు చేసుకుని తాగేవారు... వెన్న తీసిన పాలనే వాడడం మంచిది. క్రీమ్ అధికంగా ఉండే పాలను వాడడం వల్ల ఆ క్రీమ్ లో ఉండే కొవ్వు శరీరంలో అధిక బరువు రూపంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి తక్కువ క్యాలరీలు ఉన్న కొవ్వు తీసిన పాలను లేదా బాదంపాలు, ఓట్స్ పాలను వాడడం మంచిది. దీనిలో చక్కెరను మాత్రం కలుపుకోవద్దు.
కాఫీ చేసుకునేటప్పుడు చిటికెడు దాల్చిన చెక్క పొడిని కూడా కలుపుకోండి. ఈ దాల్చిన చెక్క పొడి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాదు తీపి తినాలన్న కోరికలను కూడా తగ్గిస్తాయి. దీనివల్ల మీరు ఇతర తీపి పదార్థాలు ఏవీ తినకుండా నియంత్రణలో ఉంటారు. తద్వారా కూడా సహజంగా ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు.
రోజుకోసారి లేదా రెండు సార్లు కాఫీ తాగితే ఎంతో ఆరోగ్యమని అధ్యయనాలు చెబుతున్నాయి. గుండె జబ్బు వచ్చే ప్రమాదాన్ని కాఫీ తగ్గిస్తుంది. క్యాన్సర్ కు వ్యతిరేకంగా కాఫీ పనిచేస్తుంది. కాఫీ తాగే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం పది శాతం తగ్గుతుంది. అలాగే పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా ఇది అడ్డుకుంటుంది.
Also read: బ్లూ బెర్రీ పండ్లను చదువుకునే పిల్లలకు ఖచ్చితంగా తినిపించాలి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి
Also read: జాగ్రత్త పడండి, పెరిగిపోతున్న మధుమేహం కేసులు - భవిష్యత్తులో 130 కోట్ల మందికి డయాబెటిస్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.