అన్వేషించండి

BlueBerries: బ్లూ బెర్రీ పండ్లను చదువుకునే పిల్లలకు ఖచ్చితంగా తినిపించాలి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి

బ్లూ బెర్రీ పండ్లు మెదడు ఆరోగ్యం పై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి.

బ్లూ బెర్రీ పండ్లను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇది మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా ఆంథోసైనిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇవి ముదురు ఊదా రంగును కలిగి ఉంటాయి. సాధారణ బ్లూ బెర్రీ పండ్లతో పోలిస్తే, వైల్డ్ బ్లూ బెర్రీ పండ్లు ఆంథోసైనిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు 33% ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచేందుకు సహకరిస్తాయి. మెదడు త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండా ఆ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది. బ్లూ బెర్రీ పండ్లను కేవలం ఊదా రంగులోనే కాదు ఎరుపు, నీలం రంగుల్లో కూడా లభిస్తాయి. వీటిలో పాలీఫెనాల్స్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఈ పాలీఫెనాల్స్ న్యూరో ప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉంటాయి. అంటే అవి మెదడు రక్తనాళాల ద్వారా రక్తప్రవాహం సవ్యంగా జరిగేలా చూస్తాయి. దీనివల్ల ఆరోగ్యకరమైన అభిజ్ఞా పని తీరు లభిస్తుంది. అంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడులో వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిస్తుంది.

స్కూలుకెళ్లే పిల్లలకు రోజు ఐదు నుంచి ఆరు బ్లూ బెర్రీ పండ్లను తినిపించండి. వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదివినది ఎక్కువ కాలం పాటూ గుర్తుంటుంది. 12 వారాలు పాటు క్రమం తప్పకుండా తిన్నవారిలో జ్ఞాపకశక్తి పెరిగినట్టు  అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ బ్లూ బెర్రీ పండ్లను తినేవారిలో రక్త పోటు కూడా అదుపులో ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉండడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండెపోటు, గుండె వైఫల్యం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. బ్లూ బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యమైన మూలం. ఈ సమ్మేళనాలను మన శరీరానికి అందించాల్సిన అవసరం ఉంది. ఇవి న్యూరో డిజెనరేటివ్ డిజార్డర్ రాకుండా అడ్డుకుంటాయి. కాబట్టి బ్లూ బెర్రీ పండ్లను పిల్లలకు రోజూ తినిపించేందుకు ప్రయత్నించండి. 

బెర్రీలలో బ్లూ బెర్రీలు, బ్లాక్ బెర్రీలు, రాస్పెబెర్రీస్ పండ్లరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన మెదడుకు సహకరించేవే. బ్లూ బెర్రీలు తినడం వల్ల అందానికి మేలు జరుగుతుంది. మొటిమల సమస్యను తగ్గిస్తుంది. వీటిలో సాలిసిలిక్ యాసిడ్ అనే ఆమ్లం ఉంటుంది. ఇవి చర్మాన్ని రక్షిస్తుంది. మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి రాకుండా బ్లూ బెర్రీలు అడ్డుకుంటాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే వీటిని తినడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ వంటివి అధికంగా ఉంటాయి. ఇవన్నీ మనకి అత్యవసరమైన విటమిన్లు. 

Also read: జాగ్రత్త పడండి, పెరిగిపోతున్న మధుమేహం కేసులు - భవిష్యత్తులో 130 కోట్ల మందికి డయాబెటిస్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: రాష్ట్రంలో అనర్హులకు పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
రాష్ట్రంలో అనర్హులకు పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: రాష్ట్రంలో అనర్హులకు పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
రాష్ట్రంలో అనర్హులకు పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Sai Pallavi: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
PF Withdraw: ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
Crime News: ఏపీలో దారుణాలు - సత్యసాయి జిల్లాలో విద్యుత్ కాంట్రాక్టర్ దారుణ హత్య, శ్రీకాకుళంలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ఏపీలో దారుణాలు - సత్యసాయి జిల్లాలో విద్యుత్ కాంట్రాక్టర్ దారుణ హత్య, శ్రీకాకుళంలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
Embed widget