Human Skull on Sale: వేలానికి మనిషి పుర్రె, ఎముక - కొనేయడానికి సంపన్నులు సిద్ధం, కానీ..

బతికి ఉన్న మనిషిని విక్రయించడం ఎంత నేరమో.. చనిపోయిన వ్యక్తి అస్థికలను అమ్మడం కూడా అంతే తప్పు. కానీ, చట్టంలో మాత్రం ఆ విషయం ప్రస్తావన లేదు. దీంతో ఆ దేశంలో మానవ పుర్రెను వేలానికి పెట్టారు.

FOLLOW US: 

విలువైన వస్తువులు వేలం పాటలో అమ్మేయడం గురించి తెలిసిందే. ముఖ్యంగా ప్రాచీన వస్తువులను సొంతం చేసుకోడానికి సంపన్నులు ఎంత మొత్తాన్ని చెల్లించేందుకైనా సిద్ధంగా ఉంటారు. వివిధ కళాఖండాల నుంచి అరుదైన పెయింటింగ్స్ వరకు ప్రతి ఒక్కటీ విలువైనదే. కానీ స్కాట్‌లాండ్‌లో ఓ మనిషి పుర్రె, ఎముకను వేలం వేయడానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసి జనాలు ఉలిక్కిపడ్డారు. అయితే, సంపన్నులు మాత్రం వాటిని దక్కించుకోడానికి ఎంత మొత్తమైనా చెల్లిస్తామని ముందుకొచ్చారు. కానీ, అప్పుడే వారికి మింగుడుపడని ఓ ప్రకటన వచ్చింది. 

మానవ అవశేషాలను విక్రయించడం అనైతికమంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. పుర్రె, తొడ ఎముకను విక్రయించేందుకు చట్టబద్ధంగా ఎలాంటి అడ్డంకులు లేవు. ఈ నేపథ్యంలో వేలం పాట నిర్వాహకులు వాటిని వేలం వేసే వస్తువుల జాబితాలో పెట్టారు. అయితే, అది చట్ట వ్యతిరేకం కాకపోయినా.. మానవ అవశేషాలను అమ్మకానికి పెట్టడం ‘అనైతికం’ అని కొందరు వాదించారు. మానవ అవశేషాలను వైద్య సంబంధిత వస్తువులుగా పరిగణించామని, మానవ కణజాల చట్టం లేదా ఏదైనా ఖనన చట్టాలకు లోబడి ఉండనంత వరకు వాటిని విక్రయించడం నేరం కాదని నిర్వాహకులు అన్నారు.  

ఈ సందర్భంగా మే 5న మాంట్రోస్‌లోని టేలర్స్ జరిగే వేలం పాట జాబితాలో పేర్కొన్న వస్తువుల్లో వీటిని చేర్చారు. స్కాట్లాండ్‌కు చెందిన సొసైటీ ఆఫ్ యాంటిక్వేరీస్ ఆ వస్తువులను తొలగించాల్సిందిగా కోరింది. ‘వ్యక్తులను వస్తువులుగా మార్చడం తప్పు’ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో అంగస్ ఆక్షన్ హౌస్‌లోని మిలిటేరియా, డొమెస్టిక్, రూరల్ బైగోన్స్ జాబితాల నుంచి వాటిని తొలగించారు. 

Also Read: మగాళ్లు జాగ్రత్త! మొబైల్ అతిగా వాడితే ‘అది’ మటాష్, షాకింగ్ న్యూస్ చెప్పిన నిపుణులు

దీనిపై సొసైటీ ఆఫ్ యాంటిక్వేరీస్ ఆఫ్ స్కాట్లాండ్‌కు చెందిన డాక్టర్ సైమన్ గిల్మర్ స్పందిస్తూ.. “హ్యూమన్ టిష్యూ యాక్ట్ లేదా సెపల్చర్ (ఖననం)కి సంబంధించిన చట్టాలకు విరుద్ధంగా ఉన్న మానవ అవశేషాలను కొనుగోలు చేయడం లేదా విక్రయించడం స్కాట్‌లాండ్‌లో చట్టవిరుద్ధం కాదు. కానీ, అది అనైతికమని మేం భావిస్తున్నాం. జీవించే వ్యక్తులను రవాణా చేయడం చట్టవిరుద్ధం, కానీ చనిపోయినప్పుడు ఎందుకు మారుతుంది? మానవ అవశేషాలను గౌరవంగా పరిగణించాలి. వాటిని విక్రయించడం తగదు’’ అని తెలిపారు. అయినా వాళ్లు అమ్మితే అమ్మారు.. కానీ, ఆ పుర్రెను ఇంట్లో పెట్టుకుని ఏం చేసుకుంటారు చెప్పండి. కొనేవాళ్లకైనా బుర్ర ఉండాలిగా!!

Also Read: ఫోన్ మాట్లాడుతూ లోకం మరిచింది, రెప్పపాటులో ప్రమాదం - ఇదిగో వీడియో

Published at : 28 Apr 2022 05:57 PM (IST) Tags: Scotland Human Skull on Sale Human Skull on Auction Human Bone On Sale

సంబంధిత కథనాలు

Bermuda Triangle Tour: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!

Bermuda Triangle Tour: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Vulvar Cancer: కనిపించని శత్రువు వల్వార్ క్యాన్సర్, మహిళలూ ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

Vulvar Cancer: కనిపించని శత్రువు వల్వార్ క్యాన్సర్, మహిళలూ ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

Menstrual Hygiene Day: రుతుక్రమంలో ‘అక్కడ’ సబ్బు వాడకూడదా? ఈ టిప్స్ పాటిస్తే ఇన్ఫెక్షన్లు దూరం!

Menstrual Hygiene Day: రుతుక్రమంలో ‘అక్కడ’ సబ్బు వాడకూడదా? ఈ టిప్స్ పాటిస్తే ఇన్ఫెక్షన్లు దూరం!

Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్

Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్

టాప్ స్టోరీస్

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!