అన్వేషించండి

రోజుకు ఇన్నిసార్లు ‘నెంబర్ టు’కు వెళ్తున్నారా? మీకు ఈ సమస్య ఉన్నట్లే!

మలవిసర్జనకు సంబంధించిన సైకిల్ ఒకొక్కిరికి ఒక్కో విధంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఏది మల బద్దకం? ఎన్ని సాార్లు వెళ్లడం సాధారణం?

దయం నిద్రలేవగానే అందరూ కాలకృత్యాలు తీర్చుకోవాల్సి ఉంటుందని అంతా అనుకుంటారు. అలా చేస్తే ఆరోగ్యకరం అని భావిస్తుంటారు కూడా. వాస్తవానికి కడుపులో పేగుల కదలికలను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. వీటిలో కొన్ని మన చేతిలో ఉండవు. ఇద్దరూ ఒకే రకమైన ఆహారం తీసుకున్నప్పటికీ ఒకరికి అది పేగులలో కదలికలు పెంచి.. వెంటనే మల విసర్జన చెయ్యాల్సి రావచ్చు. మరొకరికి పెద్దగా మార్పులు కనిపించకపోవచ్చు అనేది నిపుణుల వాదన. అలాగే, మీరు రోజుకు ఎన్నిసార్లు మల విసర్జన (నెంబర్ టు)కు వెళ్తున్నారనే విషయం మీద మీకు అవగాహన ఉండాలి. దాన్ని తప్పకుండా వైద్యులకు తెలియజేయాలి. అప్పుడే మీ సమస్య ఏమిటనేది వారు కచ్చితంగా తెలుసుకోగలరు.

రోజుకు ఎన్నిసార్లు మల విసర్జన సాధారణం?

చాలా మందికి సాధారణంగా మల విసర్జన ఒక సైకిల్ ప్రకారం జరుగుతుంది. రోజూ ఒకే సమయానికి మల విసర్జనకు వెళ్లడం అలవాటు ఉంటుంది. అలాంటి వారిలో 98 శాతం మంది రోజుకు మూడు సార్లు వెళ్తారట. మరికొందరు వారానికి మూడు సార్లు మాత్రమే వేళ్తారట. ఇన్ప్లమేటరీ బవెల్ సిండ్రోమ్ లేదా డైవర్టిక్యులర్ వ్యాధి వంటి కొన్ని సమస్యల వల్ల తరచుగా పేగుల్లో కదలికలు ఉండొచ్చు. దాని వల్ల కొందరు పదే పదే మల విసర్జనకు వెళ్లాల్సి రావచ్చు. లేదా పూర్తిగా వెళ్లకపోవచ్చు. అది వ్యక్తి సమస్యపై ఆధారపడి ఉంటుంది.

వ్యాయామం చాలా అవసరం

శారీరక శ్రమ పెరిస్టాల్సిస్ కదలికలను ప్రేరేపిస్తుంది. కాబట్టి శారీరకంగా చురకుగా ఉండడం కేవలం ఫిట్ నెస్ కోసం మాత్రమే కాదు.. మిగతా ఆరోగ్యం, బవెల్ మూమెంట్స్ కోసం కూడా చాలా అవసరమే. సాధారణం కంటే తక్కువ సార్లు లేదా వారానికి మూడు సార్లు కంటే తక్కువ మల విసర్జనకు వెళ్తే  మలబద్దక సమస్య ఉన్నట్టే భావించాలి. తీసుకునే ఆహారం, జీవనశైలిలో సాధారణ మార్పులు ద్వారా మలబద్దకం సమస్య నుంచి బయటపడొచ్చు.

తాజా కాయగూరలు, పండ్లు, తృణధాన్యాలతో ఎక్కువ ఫైబర్ శరీరానికి అందుతుంది. దీనితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం కూడా మలబద్దకాన్ని నివారిస్తుంది.

మల విసర్జన విషయంలో అసాధారణం ఏమిటి?

కొందరిలో బవెల్ క్యాన్సర్ వల్ల కూడా మల విసర్జన సమస్యలు ఏర్పడతాయి. ఈ క్యాన్సర్ లక్షణాలపై అవగాహన ఉంటే.. దాన్ని గుర్తించడం సులభమవుతుంది. మల విసర్జన, మల బద్దకం విషయంలో ఏది అసాధారణమో తెలియడం అవసరం.

  • మల ద్వారం నుంచి రక్త స్రావం జరగడం లేదా మలంలో రక్తం పడడం.
  • సాధారణంగా ఉండే మల విసర్జన అలవాట్లలో మార్పు రావడం తరచుగా వెళ్లడం, లేదా మల బద్దకం.
  • కడుపులో నొప్పి లేదా కడుపులో లంప్ ఏర్పడడం.
  • విపరీతమైన అలసట.
  • కారణం లేకుండా బరువు తగ్గడం.

మల విసర్జనకు సంబంధించిన సాధారణ అలవాట్లలో ఏవైనా మార్పులు వచ్చినట్లు మీరు గమనిస్తే తప్పకుండా డాక్టర్ ను సంప్రదించి మీ సమస్య గురించి చర్చించడం అవసరమని గుర్తించండి.

Also read : సెప్టిక్ షాక్ చాలా ప్రాణాంతం - ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
DGCA Committee Report: ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ ఆందోళన- హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ ఆందోళన- హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
DGCA Committee Report: ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ ఆందోళన- హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ ఆందోళన- హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్
Mowgli 2025 OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'మోగ్లీ' - న్యూ ఇయర్ సర్ప్రైజ్... నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'మోగ్లీ' - న్యూ ఇయర్ సర్ప్రైజ్... నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
Bajaj Pulsar: భారీ మార్పులతో పల్సర్ 150 భారత్‌లో రీలాంచ్! చేసిన మార్పులేంటో చూడండి!
భారీ మార్పులతో పల్సర్ 150 భారత్‌లో రీలాంచ్! చేసిన మార్పులేంటో చూడండి!
Cloud Kitchen : మీరు వంట బాగా చేస్తారా? అయితే తక్కువ ఖర్చుతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించండి.. లక్షల్లో సంపాదించవచ్చు
మీరు వంట బాగా చేస్తారా? అయితే తక్కువ ఖర్చుతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించండి.. లక్షల్లో సంపాదించవచ్చు
Embed widget