అన్వేషించండి

Coconut water health benefits: కొబ్బరి నీళ్లలో ఇన్ని పోషకాలా? ఈ సమస్యలన్నీ పరార్

రామమందిరంలో బాలరాముడి ప్రతిష్టాపన సమయంలో పూజ పూర్తయ్యే వరకు ఉపవాసదీక్షలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడి ఈ కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నారట. ఈ వార్త తో కొబ్బరినీళ్లకు చాలా ప్రాచూర్యం లభించింది.

Coconut water benefits: తియ్యని, స్వచ్ఛమైన కొబ్బరి నీళ్లు వేసవి తాపాన్ని తీర్చడంలో ముందుంటాయి. ఖనిజ లవణాలు, ఎలక్ట్రోలైట్లు కలిగిన కొబ్బరి నీరు జీర్ణాశయంలో ఏర్పడే సమస్యలకు సహజ చికిత్స చేస్తాయి.

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIMS)కి చెందిన వైద్య నిపుణులు ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో ఎనిమిది వారాల పాటు ప్రతి రోజూ కొబ్బరినీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలను గురించి వెల్లడించారు. అల్సరేటివ్ కోలైటిస్ సమస్య ప్రారంభదశలో ఉన్నవారిలో చాలా మెరుగైన మార్పులు కనిపించాయట. కొబ్బరినీళ్లలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఇది కోలైటిస్ సమస్యలో మంచి ఫలితాలు ఇస్తున్నట్టు భావిస్తున్నారు. అందుకే ఇతర గ్యాస్ట్రోఇంటస్టయిన్ సమస్యలకు కొబ్బరి నీళ్లు చికిత్సగా వాడాలని నిర్ణయించారు.

అయోధ్యలో రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు ముందు దాదాపుగా 11 రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడి నిరాహార దీక్షలో ఉన్నారు. ఆసమయంలో ఆయన కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసకున్నారట. ఈ విషయం ఆయన వెల్లడి చేసిన తర్వాత కొబ్బరి నీళ్లకు ప్రజాధరణ గణనీయంగా పెరింగిందట.

వేడిగా, తేమగా ఉండే తీరప్రాంతాల్లో కొబ్బరి నీళ్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక్కడ కొబ్బరి సాగు చాలా ఎక్కువగా సాగుతుంది. ఎలక్ట్రోలైట్స్, మినరల్స్, విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కనుక ఉపవాసంలో ఉన్న వారికి మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వారు త్వరగా శక్తి సంతరించుకోవడానికి కూడా దోహదం చేస్తాయి. సహజంగా చల్లగా ఉండే ఈ పానీయం క్యాలరీ కాన్షియస్ డ్రింక్ గా చెప్పుకోవచ్చు. ఇన్ని సుగుణాలున్న కొబ్బరినీళ్ల ఉపయోగాలు మరి కొన్ని తెలుసుకుందాం.

హైడ్రేటింగ్ డ్రింక్

ఉపవాస సమయంలో లేదా వర్కవుట్ల మధ్య విరామాల్లో, ఎండలో తిరగాల్సి వచ్చినపుడు చెమట రూపంలో నష్టపోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి పొందేందుకు కొబ్బరి నీళ్లు గొప్ప ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం తో పాటు ఎలక్ట్రోలైట్స్ వంటి పోషకాలతో ఉంటుంది.

శక్తి పెంచుతుంది

ఇందులో ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో శక్తిస్థాయిని తక్షణమే పెంచడంలో కొబ్బరి నీళ్లు ఉత్తమమైన ఎంపిక.

చర్మ సంరక్షణ

చర్మం క్లియర్ గా మెరుస్తూ ఉండేందుకు కొబ్బరి నీళ్లు దోహదం చేతాయి. శరీరంలో టాక్సిన్లను బయటికి పంపి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఫ్రీరాడికల్ చర్య నుంచి చర్మాన్ని కాపాడుతాయి. ముఖ్యంగా మలాయి కలిగిన కొబ్బరి నీళ్లు చర్మం పై మెరుపును పెంపొందిస్తాయి.

యాంటీఇన్ఫ్లమేటరీ

కొబ్బరి నీళ్లలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో మైక్రోబయోమ్ ను సమర్థవంతంగా మార్చగలదు. పోటాషియం కలిగి ఉంటుంది కనుక తేలిక పాటి అల్సర్లను, కోలైటిస్ సమస్యకు మంచి చికిత్సగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీరు ఎక్కువైన పొటాషియం, క్లోరైడ్, సిట్రేట్ లను విసర్జించడానికి సహాయపడుతుంది. ఫలితంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం నివారించబడుతుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి.

మోతాదు తప్పకూడదు

కొబ్బరి నీళ్లలో ఎన్నో పోషకాలున్నప్పటికీ, ప్రయోజనాలు ఉన్నప్పటికీ పరిమితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహులు సహజ చక్కెరలు కలిగిన ఈ పానీయాన్ని మితంగా తీసుకోవాలి. చాలా రకాల ఇతర పానీయాలతో పోలిస్తే ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి రక్తంలో చక్కెర స్థాయిని పెంచే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.

Also read : Quit Alcohol: అకస్మాత్తుగా ఆల్కహాల్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు

వీడియోలు

అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
Rule Changes From 1st January: పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
Telugu Film Chamber : తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
Year Ender 2025: ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
MLC Nagababu: గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
Embed widget