Pimples: మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలతో చిటికెలో మటుమాయం!
వర్షాకాలం వచ్చిందంటే వచ్చేమహిళలకి వచ్చే సమస్యలు జుట్టు రాలడం, మొటిమలు. తేమ వాతావరణం కారణంగా ముఖం జిడ్డుగా మారి మొటిమలు వస్తాయి. ఇవి ముఖానికి ఉన్న అందాన్ని పోగొడతాయి.
వర్షాకాలం వచ్చిందంటే మహిళలకి వచ్చే సమస్యలు జుట్టు రాలడం, మొటిమలు. తేమ వాతావరణం కారణంగా ముఖం జిడ్డుగా మారి మొటిమలు వస్తాయి. కొంతమందికి ఇవి త్వరగా పోతే మరి కొంతమందికి మాత్రం అసలు తగ్గకపోగా ముఖమంతా వచ్చి ఇబ్బంది కలిగిస్తాయి. ఒక్కోసారి మొటిమల నుంచి చీము లాంటి ద్రవం కారుతుంది. దీని వల్ల ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. ఇంకొంతమందికి నెలసరి వచ్చే వారం ముందు నుంచి మొటిమలు వస్తాయి. అవి వచ్చాయంటే పీరియడ్స్ వస్తున్నాయని సూచన. మొటిమలు తగ్గించుకునేందుకు ఎన్నో చర్మ సంరక్షణ ఉత్పత్తులు ఉన్నప్పటికీ ఇంట్లో దొరికే వాటితోనే సహజమైన పద్ధతిలో వాటిని తగ్గించుకోవచ్చు. అవేంటో ఓ సారి చూసేద్దామా..
వేపాకులు
వేపాకులు, పాలు, పసుపు కలిపి మెత్తగా రుబ్బుకుని పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. దాన్ని ముఖానికి రాసుకుని కొద్ది నిమిషాలపాటు ఉంచుకోవాలి. తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. కొన్ని రోజుల పాటు ఇలా చెయ్యడం వల్ల మొటిమల సమస్య నుంచి బయట పడొచ్చు.
బంగాళాదుంప
బంగాళా దుంపని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వాటిని మొటిమల మీద పెట్టుకోవాలి. ఓ ఐదు నిమిషాల పాటు వాటిని మొటిమల మీద ఉంచుకొని తర్వాత చిన్నగా రుద్దుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి.
తేనె, బ్రౌన్ షుగర్
తేనె, బ్రౌన్ షుగర్ మిశ్రమాన్ని బాగా కలిపి దాన్ని ఫేస్ అంతా ఆ అప్లై చేసుకోవాలి. కొద్ది నిమిషాల తర్వాత దాన్ని ముఖం మీద మెల్లగా రుద్దుకుని కడుక్కోవాలి. బ్రౌన్ షుగర్ చర్మంలోని మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే తేనె చర్మానికి మంచి పోషణని అందిస్తుంది.
తరచూ ముఖం కడగాలి
అన్నిటికంటే ముఖ్యంగా ముఖాన్ని రోజుకి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చెయ్యడం వల్ల ముఖం మీద ఉన్న మురికి, జిడ్డు తొలగిపోతుంది. మొటిమలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
కలబంద గుజ్జు
కలబంద గుజ్జుని ముఖం మీద రాయాలి. రాత్రి పడుకోబోయే ముందు రాసుకుని ఉదయం లేవగానే శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చెయ్యడం వల్ల కూడా మొటిమలు తగ్గుతాయి.
❂ ఎర్ర కంది పప్పుని నీటిలో బాగా నానబెట్టి మెత్తగా పేస్టులగా చేసుకోవాలి. ఈ పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెలనిన్ ఉన్న ప్రాంతాలపై సమర్థవంతంగా పని చేస్తాయి. మచ్చలను కూడా తగ్గించడంలో సహాయపడతాయి.
❂ నిద్ర తక్కువైనప్పుడు కూడా చర్మంపై మొటిమలు వస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన ఆహారం, కంటి నిండా చాలా అవసరం.
❂ మొటిమలు వచ్చినప్పుడు స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఆయిల్, వేపుళ్లవంటి కొవ్వు అధికంగా ఉండే ఆహర పదార్థాలు తినకూడదు.
❂ మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వల్ల కూడా మొటిమలు వస్తాయి. వాటిని గిల్లుతూ ఉండటం అసలు చేయకూడదు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: తెల్ల జుట్టు సమస్యా? ఈ చిట్కాలు పాటిస్తే నల్లని జుట్టు మీ సొంతం
Also read: బియ్యపు నీళ్లతో శుభ్రం చేసుకుంటే నిజంగానే జుట్టు బాగా పెరుగుతుందా? పట్టుకుచ్చులా మెరుస్తుందా?