అన్వేషించండి

White Hair: తెల్ల జుట్టు భయపెడుతోందా? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే నల్లని జుట్టు మీ సొంతం

సహజంగా తెల్ల జుట్టు 40 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంది. కానీ ప్రస్తుతం కొంతమందికి మాత్రం 20 ఏళ్ల నుంచే వస్తుంది.

హజంగా తెల్ల జుట్టు 40 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంది. కానీ చాలామందికి 20 ఏళ్ల నుంచే తెల్ల జుట్టు వచ్చేస్తోంది. దాని వల్ల చాలామంది చిన్న వయస్సులోనే పెద్దవాళ్లలా కనిపిస్తున్నారు. అన్నయ్య, అక్క అనిపించుకోవలసిన వయస్సులో అంకుల్, ఆంటీ అని పిలిపించుకుంటున్నారు. అంతేకాదు, తెల్ల జుట్టు వల్ల నలుగురిలో తిరిగేందుకు ఇబ్బందిపడుతున్నారు. మారుతున్న జీవన విధానం, ఒత్తిడి, ఆహారంలో మార్పులు, దూమపానం వంటి చెడు అలవాట్లు.. జుట్టు త్వరగా తెల్లబడటానికి ప్రధాన కారణాలు.  

శరీరంలో తగినంత మెలనిన్ ఉత్పత్తి జరగకపోతే జుట్టు తెల్లగా మారిపోతుంది. విపరీతమైన మానసిక ఆందోళన, వంశపారపర్యంగా కూడా జుట్టు నెరిసే అవకాశం ఉంది. చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం వల్ల వాటిని కనిపించకుండా చెయ్యడం కోసం కొందరు మార్కెట్లో దొరికే అనేక ఆయిల్స్, క్రీములు, హెయిర్ డైలు వాడుతున్నారు. వాటి వల్ల జుట్టుకి కొద్ది రోజుల పాటు నలుపు వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఒక వారం తర్వాత మళ్ళీ తెల్ల జుట్టు బయటపడి ఇబ్బందిగా మారుతుంది. అలా కాకుండా ఇంట్లో దొరికే వాటితోనే సహజంగా జుట్టు నల్లబడేలా చేసుకోవవచ్చు. అవేంటో  చూసేయండి మరి. 

ఉసిరి

కేశాల సంరక్షణకి ఉసిరి చాలా మంచిది. సహజంగా జుట్టు పెరుగుదల, అందంగా ఉండేందుకు జుట్టు రంగు కోల్పోకుండా చేసేందుకు ఉసిరి మంచిగా సహాయపడుతుంది. ఉసిరికాయ నుంచి విత్తనాలు వేరు చెయ్యాలి. తర్వాత ఆ ఉసిరిని మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని తల మాడుకు, జుట్టు మొదళ్ళకి బాగా పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల జుట్టు రాలే సమస్యతో పాటు తెల్ల జుట్టు నలుపు రంగులోకి మారుతుంది. ఉసిరి ఆకులను కూడా మెత్తగా రుబ్బుకుని పేస్ట్ లాగా చేసుకుని తలకి పట్టించుకోవచ్చు. ఇలా చెయ్యడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు పెరుగుదలకి ఇది సహాయపడుతుంది.

కొబ్బరి నూనె, నిమ్మరసం

కొబ్బరి నూనెలో నిమ్మరసం కలుపుకొని తలకు రాసుకోవడం వల్ల తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. నూనెలో ఉండే బయోటిన్ తెల్ల జుట్టుని నయం చెయ్యడంలో సహాయపడతాయి. అంతే కాదు జుట్టు మృదువుగా మారేందుకు ఇది దోహదపడుతుంది.

ఎలా చెయ్యాలి: కొద్దిగా కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని మాడుకి, జుట్టుకి బాగా పట్టే విధంగా రాసుకుని మర్దన చెయ్యాలి.

కరివేపాకు

కరివేపాకు కంటికే కాదండోయ్ జుట్టు సంరక్షణకి మంచిగా ఉపయోగపడుతుంది. జుట్టు కుదుళ్ళను బలపరిచి కేశాలు అందంగా కనిపించేలా చేస్తుంది.

ఎలా చెయ్యాలి: ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి వాటిని బాగా ఉడికించాలి. అది పూర్తిగా చల్లారిన తర్వాత వడకట్టి తలకి రాసుకుని మర్దన చేసుకోవాలి. దాన్ని జుట్టుకు కనీసం 30-45 నిమిషాల వరకు తలకి పెట్టుకుని ఉండాలి. కనీసం వారానికి రెండు సార్లు ఇలా చెయ్యడం వల్ల తెల్ల జుట్టు సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు.

టీ లేదా కాఫీ పొడి

వాటితో టీ లేదా కాఫీ చేసుకుని తాగితే బాగుంటుంది. కానీ, తలకి ఎందుకు అని అనుకుంటున్నారా? తెల్ల జుట్టు సమస్యకి ఇవి చాలా బాగా పని చేస్తాయంట. కాఫీ పొడి లేదా టీ పొడిని నీటిలో వేసి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. జుట్టుకి ఉన్న సహజమైన రంగుని కాపాడేందుకు టీ పొడిని బాగా ఉపయోగపడుతుంది. జుట్టు రంగు మారేందుకు కాఫీ పొడిని తలకి అప్లై చేసుకోవచ్చు.

నల్ల నువ్వులు

తెల్ల జుట్టును సహజమైన నలుపు రంగులోకి మార్చేందుకు నల్ల నువ్వులు బాగా ఉపయోగపడతాయి. పచ్చి నల్ల నువ్వులను రోజు ఖాళీ కడుపుతో తినడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.

బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్

ఇందులో రాగి పుష్కలంగా ఉంది. జుట్టుకి మంచి రంగు ఇచ్చేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్లో దీని బాటిల్స్ దొరుకుతాయి. ప్రతి రోజు రోజు ఉదయాన్నే కొన్ని నెలల పాటు దీన్ని ఒక టేబుల్ స్పూన్ తింటే మంచి ఫలితం ఉంటుంది.

ఉల్లిపాయ పేస్ట్

ఇది జుట్టుకి మంచి పోషణ అందిస్తుంది. ఉల్లిపాయని మెత్తగా పేస్ట్ చేసుకుని తలకి అప్లై చేసుకోవాలి. ఒక గంట తర్వాత దాన్ని కడిగేయాలి. ఇలా చెయ్యడం వల్ల క్రమంగా తెలుపు రంగులో ఉన్న జుట్టు నలుపు రంగులోకి మారుతుంది.

రోజ్మెరి, సేజ్

ఎండిన రోజ్మెరి మొక్క ఆకులు, సేజ్ మొక్క ఆకును ఒక రెండు కప్పుల నీటిలో వేసుకుని బాగా ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని తలకి పట్టించి 15-20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత దాన్ని శుభ్రంగా కడగాలి. వారం వారం ఇలా చెయ్యడం వల్ల తెల్ల జుట్టుని నివారించవచ్చు.

కుంకుడు కాయలు

తెల్ల జుట్టుని నివారించేందుకు అద్భుతమైన రెమిడీ కుంకుడు కాయ. రాత్రి పూట ఇనుప పాత్రలో కుంకుడు కాయలు వేసుకుని బాగా నానబెట్టుకోవాలి. ఉదయం వీటిని మరిగించి తలకి పట్టించాలి. క్రమం తప్పకుండా ఇలా చెయ్యడం వల్ల జుట్టుకి మంచి రంగు వస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలుపరిశోధనలుహెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also read: బియ్యపు నీళ్లతో శుభ్రం చేసుకుంటే నిజంగానే జుట్టు బాగా పెరుగుతుందా? పట్టుకుచ్చులా మెరుస్తుందా?

Also read: మధుమేహం రాకుండా ఉండాలన్నా, వచ్చాక అదుపులో ఉండాలన్నా దివ్యౌషధం ఇదే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Bengalore: సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Embed widget