అన్వేషించండి

High Cholesterol: కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోకపోతే ఎముకలు విరిగిపోతాయ్, జాగ్రత్త!

అదేంటి కొలెస్ట్రాల్, ఎముకల ఆరోగ్యానికి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? దీన్ని అంత తేలికగా తీసుకోవద్దు. అలా చేస్తే ఎముకల పటుత్వాన్ని కోల్పోతారు.

కొలెస్ట్రాల్ అనేది ప్రస్తుత రోజుల్లో సాధారణమైన వ్యాధి అయిపోయింది. ఇది గుండె ఆరోగ్యంతో ముడి పడి ఉంటుంది. భారతదేశంలోని దాదాపు 25-30 శాతం పట్టణ ప్రజలు, 15-20 శాతం గ్రామీణ జనాభా అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారని అంచనా. అయితే అనియంత్రిత కొలెస్ట్రాల్ ఎముకల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని చాలా తక్కువ మందికే తెలుసు. దీని గురించి తెలుసుకున్నారంటే మీరు కూడా జాగ్రత్త పడతారు.

కొలెస్ట్రాల్, ఎముకల ఆరోగ్యానికి సంబంధం ఏంటి?

కొలెస్ట్రాల్ అనేది కాలేయం ద్వారా ఉత్పత్తి చేయబడిన కొవ్వు పదార్థం. కొన్ని ఆహారాలు అధికంగా తీసుకున్నప్పుడు ఏర్పడుతుంది. శరీర సాధారణ పనితీరుకి ఇది చాలా అవసరం. హార్మోన్ ఉత్పత్తి, బైల్ యాసిడ్ సింథసిస్ సహా వివిధ ప్రక్రియలలో పాల్గొంటుంది. ఇది ఎముకల్ని ప్రభావితం చేస్తుంది. కొలెస్ట్రాల్ ఎముకల నష్టానికి దోహదపడుతుంది. ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు ఆస్టియోబ్లాస్ట్‌లపై ప్రభావం చూపుతాయి. ఆస్టియోక్లాస్ట్ ఎముక ఏర్పడటానికి కారణమయ్యే కణాలకు సంబంధించిన కార్యాలపాలు పెంచుతాయి. ఈ అసమతుల్యత కాలక్రమేణా ఎముక ద్రవ్యరాశిని కోల్పోయేలా చేస్తుంది.

బోలు ఎముకల వ్యాధి

అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు బోలు ఎముకల వ్యాధి అభివృద్ధికి దారి తీస్తాయి. ఇది పెళుసుగా, బలహీనమైన ఎముకలతో కూడిన రుగ్మత. అధిక కొలెస్ట్రాల్ ఎముక పెరుగుదల విషయంలో సమతుల్యానికి దారి తీస్తుంది. ఫలితంగా పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. దీని వల్ల ఎముకలు బలహీనపడిపోతాయి. తేలికపాటి గాయాల నుంచి పగుళ్ళకి గురయ్యే అవకాశం ఉంది. తుంటి, వెన్నెముక, మణికట్టులో ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి.

వాపు, ఆక్సీకరణ ఒత్తిడి

అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు దీర్ఘకాలిక మంట, ఆక్సీకరణ ఒత్తిడితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రెండూ ఎముక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి వల్ల ఎముకలకు నష్టం వాటిల్లుతుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంచుకోవడం దీనికి సరైన మార్గం. స్టాటీన్స్ వంటి కొన్ని మందులు ఎముకల ఆరోగ్యానికి నష్టం వాటిల్లకుండా చేస్తాయి.

జీవనశైలి మార్పులు అవసరం

ఎముకల మీద కొలెస్ట్రాల్ ప్రభావం పడకుండా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. అందుకోసం ఈ చిట్కాలు పాటిస్తే మంచిది.

ఆరోగ్యకరమైన ఆహారం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు తీసుకోవాలి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంతో పాటు ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.

వ్యాయామం: నడక, రన్నింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఇవి ఎముకల సాంద్రతని పెంచుతాయి.

కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి: కొలెస్ట్రాల్ స్థాయిలని క్రమం తప్పకుండా పర్యవేక్షించుకోవాలి. ఆరోగ్య సంరక్షణ నిపుణులతో మాట్లాడి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలు నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.

విటమిన్ డి: ఎముకలు పటిష్టంగా ఉండేందుకు విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా తీసుకోవాలి. పాల ఉత్పత్తులు, ఆకుకూరలు తీసుకుంటే మంచిది. సూర్యరశ్మి నుంచి తగినంత విటమిన్ డి పొందేలా చూసుకోవాలి. లేదంటే నిపుణుల సలహా ప్రకారం సప్లిమెంట్లు తీసుకోవచ్చు. ఇవి రెండూ సరిగా తీసుకుంటే ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: బరువు తగ్గించే స్మార్ట్ స్నాక్ ఐడియాస్

టాప్ హెడ్ లైన్స్

Seed Cycling : అమ్మాయిలు సీడ్ సైక్లింగ్ ఫాలో అయితే కలిగే లాభాలు ఇవే.. పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయా?
అమ్మాయిలు సీడ్ సైక్లింగ్ ఫాలో అయితే కలిగే లాభాలు ఇవే.. పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయా?
Minoxidil for Hair : మినాక్సిడిల్ ఎవరు వాడాలి? ఎంత మోతాదులో అప్లై చేయాలి? ఆపేస్తే మళ్లీ జుట్టు రాలిపోతుందా?
మినాక్సిడిల్ ఎవరు వాడాలి? ఎంత మోతాదులో అప్లై చేయాలి? ఆపేస్తే మళ్లీ జుట్టు రాలిపోతుందా?
Fridge Food Storage Guide : ఫ్రిడ్జ్‌లో పాలు, కూరగాయలు, మాంసం ఎక్కడ పెట్టాలి? ఏ అరలో ఏది పెట్టాలో తెలుసా?
ఫ్రిడ్జ్‌లో పాలు, కూరగాయలు, మాంసం ఎక్కడ పెట్టాలి? ఏ అరలో ఏది పెట్టాలో తెలుసా?
Chest Pain : ఛాతీలో చీల్చేసినట్టు నొప్పి వస్తుందా? ఇది హార్ట్ ఎటాక్ కాదు.. కానీ చాలా ప్రమాదమంటోన్న వైద్యులు
ఛాతీలో చీల్చేసినట్టు నొప్పి వస్తుందా? ఇది హార్ట్ ఎటాక్ కాదు.. కానీ చాలా ప్రమాదమంటోన్న వైద్యులు

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada SAAP Office Attack: విజయవాడలో శాప్ ఆఫీసు ఘటన.. వైసీపీ నేతలపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు
విజయవాడలో శాప్ ఆఫీసు ఘటన.. వైసీపీ నేతలపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు
Adilabad RIMS: రిమ్స్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదు రోజుల శిశువు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
రిమ్స్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదు రోజుల శిశువు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
Vijayawada News: అన్నదానం కార్యక్రమంలో సాంబారు గిన్నెల్ పడి మహిళ మృతి.. విజయవాడలో విషాదం
అన్నదానం కార్యక్రమంలో సాంబారు గిన్నెల్ పడి మహిళ మృతి.. విజయవాడలో విషాదం
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత! దుర్గమ్మ దర్శనానికి వెళ్లే మార్గం ఇదే!
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత! దుర్గమ్మ దర్శనానికి వెళ్లే మార్గం ఇదే!
Kalki 2: 'కల్కి 2'లో మరో పాన్ ఇండియా యాక్టర్... షూటింగ్ ఎంత కంప్లీట్ చేశారంటే?
'కల్కి 2'లో మరో పాన్ ఇండియా యాక్టర్... షూటింగ్ ఎంత కంప్లీట్ చేశారంటే?
AP Weather Report: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. నేటి నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు
ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. నేటి నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు
KTR: రైతులకు సాగునీళ్లు అడిగితే బీఆర్ఎస్ నేతల అరెస్టులా ? ప్రభుత్వానికి సిగ్గుండాలంటూ కేటీఆర్ ఫైర్
రైతులకు సాగునీళ్లు అడిగితే బీఆర్ఎస్ నేతల అరెస్టులా ? ప్రభుత్వానికి సిగ్గుండాలంటూ కేటీఆర్ ఫైర్
Hyderabad Ganesh Nimajjanam: ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం సెగ! బారికేడ్లు పీకి, నిమజ్జనం చేసిన గణేష్ ఉత్సవ సమితి! అసలేం జరిగింది
ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం సెగ! బారికేడ్లు పీకి, నిమజ్జనం చేసిన గణేష్ ఉత్సవ సమితి! అసలేం జరిగింది
Embed widget