అన్వేషించండి

Wall squats: గోడకుర్చీ వేస్తే హైబీపీని త్వరగా తగ్గించుకోవచ్చు

గోడకుర్చీ ఇకపై శిక్ష కాదు, అది ఆరోగ్యాన్ని అందించే ఒక వ్యాయామం.

ఒకప్పుడు అల్లరి చేసే వాళ్ళని, మార్కులు తక్కువ వచ్చే వాళ్ళని తరగతి గదిలో గోడకుర్చీ వేయమనేవారు. మనకు తెలిసినంతవరకు గోడకుర్చీ అనేది ఒక చిన్న శిక్ష. కానీ ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం అది శిక్ష కాదు, ఒక వరం. మన కండరాలకు మేలు చేసే ఒక వ్యాయామం. అధిక రక్తపోటును తగ్గించే అద్భుత వర్కౌట్. ఈ విషయాన్ని ఒక అధ్యయనం ఇటీవల తేల్చింది. బీపీని నియంత్రించే వ్యాయామాల్లో గోడకుర్చీ కూడా ఒకటని చెబుతోంది ఈ కొత్త అధ్యయనం. బీపీని నియంత్రించడానికి ఎక్కువ మంది వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేస్తారు. వాటితో పాటు రోజుకు ఓ ఐదు నిమిషాలు గోడకుర్చీ వేసినా కూడా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.

ఈ కొత్త అధ్యయనం గురించి బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో రాశారు. మొత్తం 16,000 మంది పై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. గోడకుర్చీ కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్ కిందే వస్తుందని వారు చెప్పారు. హైబీపీని త్వరగా తగ్గించుకోవాలంటే గోడకుర్చీ వేయడం, నేలపై ప్లాంక్స్ చేయడం వంటివి మెరుగ్గా పనిచేస్తాయని ఈ అధ్యయనం చేసిన పరిశోధనకర్తలు తేల్చారు. గోడకుర్చీ వేసినప్పుడు గోడకు వీపును ఆనించి, నేలకు తొడలు సమాంతరంగా ఉండేలా కుర్చీలో కూర్చున్నట్లుగా ఉంటుంది. ఇది శరీరంపై ఒక భిన్నమైన ఒత్తిడిని కలిగిస్తుంది. రెండు నిమిషాలు కంటే ఎక్కువ సేపు ఈ భంగిమలో కూర్చుంటే కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ తర్వాత గోడకుర్చీ వేయడం ఆపేస్తే వెంటనే రక్తప్రసరణ మొదలవుతుంది. ఇది శరీరం అంతా రక్తం ప్రసరించేలా చేస్తుంది. అయితే ఈ గోడకుర్చీ వేసినప్పుడు కచ్చితంగా శ్వాస ఎక్కువగా తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి.

ఐదు నిమిషాల పాటూ రోజూ గోడకుర్చీ వేయడం కష్టం కాబట్టి కనీసం రెండు నిమిషాలు గోడకుర్చీ వేయడం అలవాటు చేసుకోండి. ఇది ఆరోగ్యం పై ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన డైట్ ని కూడా తీసుకుంటే అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ఆల్కహాల్, ధూమపానం వంటివి పూర్తిగా మానేయాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు వంటివి పూర్తిగా అదుపులో ఉంటాయి. 40 ఏళ్లు దాటిన వారు తప్పకుండా ప్రతి నెలా రక్తపోటును చెక్ చేయించుకోవడం చాలా అవసరం. 

రోజూ గోడకుర్చీ వ్యాయామం చేయలేని వారు వారానికి మూడుసార్లు అయినా కనీసం రెండు నిమిషాలు పాటు ఈ గోడకుర్చీ వేస్తే ఎంతో మంచిది. హృదయ సంబంధం వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే రోజుకు అరగంట నుంచి గంట వరకు వాకింగ్ చేయడం కూడా ఎంతో ఆరోగ్య కరం. ఇవన్నీ కూడా గుండె వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. 

Also read: రోజుకు రెండు స్ట్రాబెర్రీలు తినడం వల్ల మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

టాప్ హెడ్ లైన్స్

Kidney Cancer : నగరవాసుల్లో పెరుగుతోన్న కిడ్నీ క్యాన్సర్ కేసులు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తోన్న ఆంకాలజిస్ట్
నగరవాసుల్లో పెరుగుతోన్న కిడ్నీ క్యాన్సర్ కేసులు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తోన్న ఆంకాలజిస్ట్
Monsoon Hair Fall : వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా ఊడుతుందా? కారణాలివే.. తగ్గించేందుకు నిపుణులు చెప్పిన చిట్కాలు
వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా ఊడుతుందా? కారణాలివే.. తగ్గించేందుకు నిపుణులు చెప్పిన చిట్కాలు
Blood Tests : రొటీన్​కు భిన్నంగా వైద్యులు సూచిస్తోన్న 5 రక్త పరీక్షలు.. వీటితో వ్యాధులు ముందుగానే గుర్తించవచ్చా?
రొటీన్​కు భిన్నంగా వైద్యులు సూచిస్తోన్న 5 రక్త పరీక్షలు.. వీటితో వ్యాధులు ముందుగానే గుర్తించవచ్చా?
Blood in Urine : మూత్రంలో రక్తం కనిపిస్తుందా? కిడ్నీ క్యాన్సర్‌(Kidney Cancer)కు సంకేతం కావచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దంటోన్న నిపుణులు
మూత్రంలో రక్తం కనిపిస్తుందా? కిడ్నీ క్యాన్సర్‌(Kidney Cancer)కు సంకేతం కావచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దంటోన్న నిపుణులు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Hindu Dharma: హిందూ ధర్మం -
హిందూ ధర్మం - "దుస్తులకు సంబంధించిందా , గుణానికి సంబంధించిందా?
Vijayawada Sai Krishna Case: సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Embed widget