అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2026

(Source: ECI/ABP News)

Diabetes: చక్కెర తక్కువ ఆహారాలు ఇవిగో, వీటిని లాగించేయండి ఏ సమస్యా ఉండదు

మధుమేహం ఉన్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే సమస్యలు తప్పవు.

చుట్టూ చక్కెర అధికంగా ఉండే ఆహారాలే కనిపిస్తున్నప్పుడు మధుమేహవ్యాధిగ్రస్తులకు ఏం తినాలో అర్థం కాదు. వారు చక్కెర అధికంగా ఉన్న ఆహారం తింటే సమస్యలు అధికమవుతాయి. అందుకే వారికి ఏ ఆహారాల్లో చక్కెర శాతం తక్కువ ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, వాటిని  తినడం ద్వారా పోషకాలను కూడా పొందొచ్చు. 

క్యారెట్లు
ఇవి చలికాలంలో అధికంగా లభిస్తాయి. రోజు వారీ ఆహారంలో తినాల్సిన ముఖ్యమైన ఆహారాల్లో ఇవీ ఒకటి. వందగ్రాముల క్యారెట్లలో 4.7 గ్రాముల చక్కెర ఉంటుంది. కాబట్టి ఒకటి లేదా రెండు క్యారెట్లు తినడం వల్ల శరీరంలో చేరే చక్కెర చాలా తక్కువ. దీన్ని కూరగా, స్మూతీగా, జ్యూస్ గా కూడా చేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. 

కీరాదోసలు
ఇవి వేసవి కాలంలో చాలా మేలు చేస్తాయి. వడదెబ్బ నుంచి కాపాడతాయి.  వేసవి కాలంలో డయాబెటిస్ రోగులు హ్యాపీగా వీటిని తినొచ్చు. వీటిలో చక్కెర, కార్బోహైడ్రేట్లు, గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి కీరాదోసలు మధుమేహులకు చాలా సురక్షితం. ఇందులో తక్కువ కొవ్వు, క్యాలెరీలు ఉంటాయి కాబట్టి బరువు తగ్గేందుకు కూడా సహకరిస్తాయి. 

బ్రౌన్ రైస్
సాధారణ బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్ డయాబెటిక్ వారికి చాలా సురక్షితం. 100 గ్రాముల బ్రౌన్ రైస్లో కేవలం 0.9గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే తెల్లబియ్యానికి బదులు వీటినే తినమని వైద్యులు సలహా ఇస్తారు. అంతేకాదు బ్రౌన్ రైస్ బరువు తగ్గేందుకు కూడా సహకరిస్తుంది. 

గ్రీకు యోగర్ట్
పెరుగుతోనే దీన్ని తయారు చేస్తారు. సాధారణ పెరుగుతో పోలిస్తే చక్కెర, కొవ్వు రెండూ తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల గ్రీకు యోగర్ట్ లో 3.2 గ్రాముల చక్కెర ఉంటుంది. కాబట్టి తిన్నా అధికంగా చక్కెర శరీరంలో చేరుతుందన్న భయం లేదు. 

పుట్టగొడుగులు
పుట్టగొడుగులతో ఆరోగ్య ప్రయోజనాలు అధికం. వీటిలో చక్కెర తక్కువగా ఉండి, ఫైబర్ అధికంగా ఉంటుంది. డయాబెటిక్ రోగులకు ఆదర్శవంతమైన ఆహారం ఇది. వందగ్రాములు తెల్ల పుట్టగొడుగులు తింటే కేవలం రెండు గ్రాముల చక్కెర మాత్రమే  శరీరంలో చేరుతుంది. కాబట్టి డయాబెటిక్ రోగులు అందబాటులో ఉనక్న రకరకాల పుట్టగొడుగులను వండుకుని తినవచ్చు.   

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

Also Read: మరణం తరువాత జీవితం ఉంటుందా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Instagram Subscriptions : ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్స్‌తో డబ్బు సంపాదించండి.. ఫీచర్ పూర్తి వివరాలు, ఎంతమంది ఫాలోవర్లు ఉండాలి?
ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్స్‌తో డబ్బు సంపాదించండి.. ఫీచర్ పూర్తి వివరాలు, ఎంతమంది ఫాలోవర్లు ఉండాలి?
Anti-Inflammatory Foods : బెస్ట్ యాంటీ ఇన్​ఫ్లమేటరీ ఫుడ్స్.. హార్ట్, షుగర్ రిస్క్ తగ్గించాలంటే ఇవి తినండి
బెస్ట్ యాంటీ ఇన్​ఫ్లమేటరీ ఫుడ్స్.. హార్ట్, షుగర్ రిస్క్ తగ్గించాలంటే ఇవి తినండి
Reduce Sun Tan : చేతులపై ట్యాన్ తగ్గించే హోమ్ రెమెడీస్.. హ్యాండ్స్ నల్లగా మారితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి
చేతులపై ట్యాన్ తగ్గించే హోమ్ రెమెడీస్.. హ్యాండ్స్ నల్లగా మారితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి
Trisha Krishnan Birthday : త్రిష కృష్ణన్ 43వ బర్త్​ డే స్పెషల్.. ఆమె స్కిన్ కేర్, బ్యూటీ సీక్రెట్స్ ఇవే
త్రిష కృష్ణన్ 43వ బర్త్​ డే స్పెషల్.. ఆమె స్కిన్ కేర్, బ్యూటీ సీక్రెట్స్ ఇవే

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TRS Kavitha Comments On Vijay TVK: టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవితలో ఉత్సాహం నింపిన తమిళనాడు ఎన్నికల ఫలితాలు! విజయ్‌ పార్టీపై ఆసక్తికర కామెంట్స్!
టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవితలో ఉత్సాహం నింపిన తమిళనాడు ఎన్నికల ఫలితాలు! విజయ్‌ పార్టీపై ఆసక్తికర కామెంట్స్!
Vijay Networth: టీవీకే అధినేత విజయ్ ఆస్తుల విలువెంత? సూపర్ స్టార్లలో ఒకరిగా దళపతి స్టార్‌డమ్
టీవీకే అధినేత విజయ్ ఆస్తుల విలువెంత? సూపర్ స్టార్లలో ఒకరిగా దళపతి స్టార్‌డమ్
West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్‌ మరో మహిళా ముఖ్యమంత్రిని చూస్తుందా! సువేందుకు పోటీగా లేడీ టైగర్స్!
పశ్చిమ బెంగాల్‌ మరో మహిళా ముఖ్యమంత్రిని చూస్తుందా! సువేందుకు పోటీగా లేడీ టైగర్స్!
Trisha Political Entry: రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ! విజయ్ స్థానంలో పోటీ! ప్రభుత్వంలో కీలక పదవి!
రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ! విజయ్ స్థానంలో పోటీ! ప్రభుత్వంలో కీలక పదవి!
Bengal Assembly Election Results: మమతా ప్రారంభించారు - బీజేపీ ముగించింది - బెంగాల్‌లో దీదీ ఓటమికి 5 కారణాలు
మమతా ప్రారంభించారు - బీజేపీ ముగించింది - బెంగాల్‌లో దీదీ ఓటమికి 5 కారణాలు
Vijay impact Sun TV Network shares: తమిళనాడులో టీవీకే ప్రభంజనం.. విజయ్ దెబ్బకు సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు ఢమాల్ !
తమిళనాడులో టీవీకే ప్రభంజనం.. విజయ్ దెబ్బకు సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు ఢమాల్ !
Bandi Sanjay on Election Results: విభజన రాజకీయాలు చేసిన రేవంత్, స్టాలిన్‌లకు ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు: బండి సంజయ్
విభజన రాజకీయాలు చేసిన రేవంత్, స్టాలిన్‌లకు ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు: బండి సంజయ్
Tamil Nadu Election Results 2026: తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో కొలత్తూరులో స్టాలిన్‌కు షాక్! డీఎంకే కోటను బ్రేక్ చేసిన విజయ్‌ టీవీకే!
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో కొలత్తూరులో స్టాలిన్‌కు షాక్! డీఎంకే కోటను బ్రేక్ చేసిన విజయ్‌ టీవీకే!
Embed widget