Periods Pain: నెలసరి నొప్పి రాకుండా ఉండాలంటే తాగాల్సిన డ్రింకులు ఇవే
పీరియడ్స్ నొప్పి సహజంగానే వస్తుంది. కానీ కొందరిలో ఆ నొప్పి భరించలేనిదిగా మారుతుంది.
ప్రతి స్త్రీ ఆరోగ్యంలో పీరియడ్స్‌వి కీలక పాత్ర. ప్రతి నెలా రుతుస్రావం జరిగితేనే ఆమె ఆరోగ్యం బాగున్నట్టు. కానీ కొంతమందిలో రుతుక్రమం సమయంలో చాలా నొప్పులు ఇబ్బంది పెడతాయి. పొత్తి కడుపు దగ్గర పేగులు పిండేసినట్టు నొప్పి వస్తుంది. దీన్ని రుతు తిమ్మిరి అని కూడా పిలుస్తారు. ప్రతి స్త్రీ శరీరాన్ని బట్టి నొప్పి తక్కువగా, ఎక్కువగా ఉంటాయి. వాటిని భరించలేక ఏడ్చేవాళ్లు, మందులు వాడేవాళ్లు ఎంతో మంది. అయితే సహజంగానే నొప్పులు రాకుండా అడ్డుకునే కొన్ని డ్రింకులు ఉన్నాయి. వీటిని తాగడం వల్ల పీరియడ్స్ నొప్పి కంట్రోల్ అవుతుంది.
నీరు
శరీరంలో తగినంత నీరు లేకపోయినా కూడా పొత్తికడుపు నొప్పి అధికంగా వస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకుంటే నొప్పి వచ్చే అవకాశం తగ్గుతుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు ఉబ్బరం, నొప్పి తగ్గాలంటే నీరు అధికంగా తాగాలి. ఫ్రిజ్‌లో పెట్టిన నీటిని తాగకూడదు. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల నొప్పి రాదు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. డీహైడ్రేషన్ ఎక్కువైతే మాత్రం నొప్పులు పెరుగుతాయి.
ఆకుకూరల జ్యూస్
ఈ జ్యూస్ తాగడానికి కష్టంగానే ఉంటుంది. ఆకుకూరల జ్యూస్ రుచిని తట్టుకోవడం కష్టమే. కానీ తాగాల్సిందే. అది మీకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఆహారంలో తగినంత కూరగాయలు చేర్చడం వల్ల బహిష్టు సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తాయి. పాలకూర జ్యూస్ తాగడం వల్ల శరీరంలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా చేరుతాయి. అలాగే కివీ స్మూతీ, అల్లం స్మూతీ, బాదం పాలు వంటివి జ్యూస్, స్మూతీల రూపంలో చేసుకుని తాగితే రుతు సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది.
అల్లం టీ
అల్లం టీ చేసుకోవడం చాలా సులువు. అల్లంతో చేసే ఆహారాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. క్రమరహిత పీరియడ్స్‌కు అల్లం మంచి చికిత్సను అందిస్తుంది. ఆ సమయంలో ఉండే వికారం, అనారోగ్యం, కడుపు నొప్పిని తగ్గిస్తుంది అల్లం. మీరు నమ్మినా, నమ్మకపోయినా పీరియడ్స్ సమయంలో తాగే అల్లం టీ కచ్చితంగా మాయ చేస్తుంది. టీలో తురిమిన అల్లాన్ని వేసుకుని తాగితే రుచి కూడా అదిరిపోతుంది.
చేమంతి పూల టీ
అసలే ఇది చేమంతి పూలు విరివిగా కాసే కాలం. వాటితో టీ కాచుకుని తాగితే రుతు నొప్పి తగ్గుతుంది. ఇప్పటికే అనేక పరిశోధనలు చేమంతి పూల టీ అనేక రకాలుగా స్త్రీలకు మేలు చేస్తుందని నిరూపించాయి. దీనిలో హిప్పురేట్, గ్లైసిన్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి గర్భాశయాన్ని వేగంగా రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దీనిలో ఎక్కువ.
మెంతుల టీ
మెంతులతో చేసే టీని పీరియడ్స్ సమయంలో తాగడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఇందులోని గుణాలు పొట్ట కండరాలకు విశ్రాంతిని కలిగిస్తాయి. రుతునొప్పి తీవ్రతను కూడా తగ్గిస్తుంది. ఇందులో యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు అధికం కాబట్టి రుతు తిమ్మిరి పోతుంది. మెంథాల్‌కు చల్లని గుణాలు అధికం.
Also read: ఎంత నవ్వితే గుండెకు అంత మంచిది, హైబీపీ - మధుమేహం కూడా అదుపులో, ఇకనైనా నవ్వండి
Also read: రాత్రి పూట ఈ మందులు వేసుకుంటే నిద్రకు దూరమవ్వడం ఖాయం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.