Diabetes Control Tips : మధుమేహముంటే ఈ డ్రింక్స్‌తో కంట్రోల్ చేసేయొచ్చు.. దీనిలో రెడ్ వైన్ కూడా ఉంది
Natural Remedies for Diabetes : హెల్తీగా ఉండడంలో, మధుమేహం కంట్రోల్ చేయడంలో యాంటీ ఆక్సిడెంట్లు మేజర్ పాత్ర పోషిస్తాయి. ఇవి పుష్కలంగా లభించే డ్రింక్స్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో..
Best drinks for diabetes control : మధుమేహమున్నవారికి ఫుడ్ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వారు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. వాటితో పాలు పలు రకాల డ్రింక్స్‌ని తీసుకుంటే హెల్త్‌కి మంచిదంటున్నారు. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన పానీయాలు మధుమేహాన్ని కంట్రోల్ చేస్తాయట. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ విషయాన్ని తెలిపింది. డయాబెటిస్‌ని కంట్రోల్ చేయడానికి కొన్ని పానీయాలు తీసుకోవాలని సూచించింది. యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్న పానీయాలు డయాబెటిస్ ఉన్నవారి ఆరోగ్యంపై ఎలా ప్రభావితం చేస్తాయో కూడా తెలిపింది.
యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీరంలో మంట తగ్గి ఇన్సులిన్ కంట్రోల్ అవుతుందని తెలిపారు. ఇన్ఫ్లమేషన్ తగ్గడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా కంట్రోల్ అవుతాయి. మధుమేహం కూడా తగ్గి.. హెల్తీ లైఫ్‌ని లీడ్ చేయడానికి సహాయపడుతుంది. అయితే ఎలాంటి డ్రింక్స్‌ని డైట్లో చేర్చుకోవాలో.. వాటి వల్ల కలిగే ఫలితాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
గ్రీన్ టీ
మధుమేహమున్నవారికి కెఫిన్ లేని డ్రింక్స్ చాలా ఉత్తమమైనవి. అలాంటి వాటిలో గ్రీన్ టీ ఒకటి. డయాబెటిస్తో ఉండేవారికి గ్రీన్ టీ మెరుగైన ఫలితాలు ఇస్తుంది. దీనిలో పాలీ ఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీనిలోని కాటెచిన్స్, థియానిన్ యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇవి వాపును తగ్గించి.. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గ్లూకోస్ టాలరెన్స్‌ని మెరుగుపరచి ఇన్సులిన్ పని తీరును బెటర్ చేస్తాయి.
దానిమ్మ జ్యూస్
దానిమ్మ హెల్త్‌కి చాలా మంచిది. మధుమేహం ఉన్నా లేకపోయినా దీనిని తీసుకోవచ్చు. దీనిలోని పాలీఫెనాల్స్ ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తాయి. ఇవి రక్తంలోని షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేసి మధుమేహులకు మంచి ఫలితాలిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని బెటర్ చేస్తుంది. అయితే ప్యూర్ 100 శాతం స్వచ్ఛమైన జ్యూస్‌తోనే ఇది సాధ్యమవుతుంది. దీనిలో ఆంథోసైనిన్లు, ఫ్లేవనాయిడ్లు, ఫినాలిక్ సమ్మేళనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి మంటను తగ్గించి.. గ్లూకోజ్, ఇన్సులిన్ని మెరుగుపరుస్తాయి.
ప్రూనేతో..
ప్లం పండ్లు తెలుసుకదా. వాటిని ఎండిన తర్వాత ప్రూనే అంటారు. వాటితో చేసిన జ్యూస్‌ని ప్రూనే జ్యూస్ అంటారు. దీనిని రెగ్యూలర్‌గా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగై.. ఫాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా శరీరానికి అందుతాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. దీనిలోని ఫైబర్ కంటెంట్ ఆకలిని కంట్రోల్ చేస్తుంది. గట్ హెల్త్, బ్లడ్ షుగర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. రక్తపోటు, గుండె జబ్బులను కూడా ఇది దూరం చేస్తుంది. దీనిలో ప్రోటీన్ హెల్తీ కొవ్వును ప్రోత్సాహిస్తుంది.
రెడ్ వైన్
ఓ గ్లాస్ రెడ్ వైన్ మధుమేహులకు చాలా మంచిది. వైన్‌లో గ్రేప్ స్కిన్, పల్లీలు, బెర్రీలు ఉపయోగిస్తారు. వీటిలోని పాలీ ఫెనాల్, రెస్వెరాట్రాల్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే, విడుదల చేసే బీటా కణాలను రక్షిస్తాయని పరిశోధనలు తెలిపాయి. దీనితో కొలెస్ట్రాల్, రక్తపోటు కూడా కంట్రోల్ ఉంటుంది.
స్మూతీలు
యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన స్మూతీలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఆకుకూరలతో చేసే స్మూతీలు చాలా మంచివి. నట్స్, వోట్స్, బెర్రీలతో స్మూతీ చేసుకుని రెగ్యూలర్‌గా తీసుకోవచ్చు. ఇవి రక్తంలో చక్కెర పెరుగుదలను కంట్రోల్ చేస్తాయి. ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్ కూడా అందుతుంది. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండి.. ఇన్సులిన్ స్థాయిలను కంట్రోల్ చేస్తాయి.
ఈ తరహా డ్రింక్‌లను మీ సమతుల్యమైన ఆహారంతో కలిపి తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అయితే వీటిని ఎంత కొలతల్లో తీసుకోవాలో.. ఎప్పుడు తీసుకోవాలో.. మీ శరీర తత్వానికి ఇవి సరిపోతాయో లేదో తెలుసుకోవడానికి కచ్చితంగా వైద్యుల సలహాలు తీసుకుని వీటిని మీ డైట్లో చేర్చుకోవాలి.
Also Read : మధుమేహం, కొలెస్ట్రాల్ ఉంటే గుడ్లు తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలట.. రోజుకి ఎన్ని తినొచ్చంటే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.