Bath Salts: ఈ ఉప్పును స్నానం చేసే నీళ్లలో కలుపుకుంటే ఆ సమస్యలన్నీ దూరం
స్నానం కేవలం శుభ్రతకే కాదు, శరీరానికీ మనసుకూ విశ్రాంతినిస్తుంది.
వేడినీటి స్నానం చాలా విశ్రాంతిని కలిగిస్తుందని చెబుతారు. నిజమే అలసిన మనసుకు, శరీరానికి వేడినీటి స్నానం మంచి ఉపశమనమే. ఆ నీటిలో బాత్ సాల్ట్ లను కలుపుకుని స్నానం చేస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. శరీరానికి, చర్మానికి వీటి బాత్ సాల్ట్‌ల వల్ల చాలా ఉపయోగాలు కలుగుతాయి. ఇవి శక్తిని పెంచుతాయి.
ఏంటీ బాత్ సాల్ట్?
బాత్ సాల్ట్ అనేవి ఖనిజాలు కలిసిన ఉప్పు. దీన్ని కేవలం స్నానానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇప్పుడు చాలా రకాల ఉప్పులు మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిల్లో ముఖ్యమైనది మాత్రం ‘ఇప్సం బాత్ సాల్ట్’. ఈ ఉప్పు శరీరానికి, చర్మానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. హిమాలయన్ బాత్ సాల్ట్, డెడ్ సీ బాత్ సాల్ట్... ఇలా చాలా రకాల స్నానపు ఉప్పులు ఉన్నాయి.
బాత్ సాల్ట్‌తో చేయడం వల్ల ఉపయోగాలు...
1. బాత్ సాల్ట్ నీటిలో కలుపుకుని ఆ నీళ్లలతో స్నానం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుచడంతో పాటూ కండరాలకు విశ్రాంతినిస్తుంది.
2. చర్మ ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. చర్మాన్ని తేమవంతంగా ఉంచుతాయి. చర్మం పొడిబారే సమస్య ఉన్నవారికి ఈ బాత్ సాల్ట్ లు చాలా మేలు చేస్తాయి. సొరియాసిస్,ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులు ఉన్న వారికి ఈ ఉప్పు స్నానం ఎంతో మేలు.
3. స్కిన్ ఎక్స్‌ఫోలియేషన్ చేసేందుకు సహాయపడుతుంది. అంటే మృతకణాలను చర్మం మీద నుంచే తొలగించే ప్రక్రియ. చర్మంపై పడే దుమ్ము, ధూళి, నూనెలు, మలినాలు అన్నింటినీ ఈ స్నానం తొలగించేస్తుంది. అలాగే అంటు వ్యాధులు, అలెర్జీలు దూరంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
4. బాత్ సాల్ట్ లలో మెగ్నీషియం ఉంటుంది. ఇది శరీరంలోని వాపు, మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. నొప్పిని కూడా తగ్గిస్తుంది.
5. బాత్ సాల్ట్ కలిపిన నీళ్లలో మీ పాదాలను కొన్ని నిమిషాల పాటూ ఉంచితే చాలా మంచిది. పాదాల ఇన్ఫెక్షన్లు పోతాయి. ఉదయం నుంచి అలసిపోయిన వారు ఇలా బాత్ సాల్ట్ నీళ్లలో పాదాలు ఉంచడం వల్ల చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది.
6. ఆర్ధరైటిస్ ఉన్న వారికి ఈ బాత్ సాల్ట్ చాలా ఉపయోగం. అలాగే జాయింట్ నొప్పులను కూడా తగ్గిస్తుంది.
7. చాలా మందిలో బాత్ సాల్ట్ బరువు తగ్గుతారనే అపోహ ఉంది. అది పూర్తిగా అబద్ధం. ఇది బరువు తగ్గేందుకు ఏమాత్రం సహకరించారు. కానీ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. సమతుల్య ఆహారం, శారీరక శ్రమ ద్వారానే బరువు నిర్వహణను చేపట్టాలి.
Also read: మిస్ ఇండియా 2022గా సినీ శెట్టి, నాట్యమే ప్రాణమంటున్న అందాల రాణి
Also read: గులాబీ పూల రెక్కలను గిన్నెలో పోసి ఇంట్లో ఉంచితే ఆరోగ్యమా లేక ఆర్ధిక లాభమా?