Rose Petals: గులాబీ పూల రెక్కలను గిన్నెలో పోసి ఇంట్లో ఉంచితే ఆరోగ్యమా లేక ఆర్ధిక లాభమా?
ఇంట్లో గిన్నెలో గులాబీ రెక్కలు పోసి పెడతారు చాలా మంది. అలా పెట్టడం వెనుక అర్థం ఏమిటి?
గులాబీ పూల రెక్కలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. అందుకేనా అందరి ఇళ్లల్లో అందమైన గిన్నెలో వేసి గులాబీ రెక్కలు కనిపిస్తాయి? కాదు అంతకుమించి వాటికి విశిష్ఠత ఉందని చెబుతారు పెద్దలు. కొందరికి ఇది ఇంటి అందాన్ని పెంచే ఉద్దేశం. ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆ గులాబీలు అతిధికి స్వాగతం పలికినట్టు ఉంటాయి. ఇల్లు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. అందుకే ఆ ఇల్లు కళకళలాడుతుంది. అయితే ఇలా గులాబీ రేకులను గిన్నెడు నీళ్లలో పోసి పెట్టడం వల్ల ఇంట్లో ఆర్ధిక సమస్యలు పోతాయని చెప్పుకుంటారు.
నెగిటివ్ ఎనర్జీ మాయం
వాస్తు ప్రకారం ఇంట్లో నెగిటివ్, పాజిటివ్ అని రెండు ఎనర్జీలు ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి, పాజిటివ్ ఎనర్జీని పెంచితే ఆ ఇళ్లు ఆర్ధికంగా, ఆనందంగా కళకళలాడిపోతాయి. అనారోగ్యసమస్యలు, ఆర్ధిక సమస్యలను పారద్రోలే శక్తి పాజిటివ్ ఎనర్జీకి ఉంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగితే అప్పులు ఎక్కువ చేస్తారు, ఆర్ధిక సమస్యలు తలెత్తుతాయి, ఇబ్బందులు పడతారు. కాబట్టి దాన్ని వదిలించుకోవాల్సిన అవసరం ఉంది. పాజిటివ్ ఎనర్జీని పెంచే పనులు చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది. అందులో ఒకటి గిన్నెలో నీళ్లు పోసి గులాబీ రేకులను పోసి ఉంచడం. కేవలం ఎరుపు రంగు గులాబీ పూలనే ఇందుకు ఎంచుకోవాలి. అది కూడా గాలి తగిలే చోట పెట్టాలి. హాల్ లేదా కిటికీలు ఇలా గాలి తగిలే చోట ఉంచాలి.
ఆ పూరేకుల మీద నుంచి వీచే గాలి ఇంట్లోకి వీస్తుంది. ఆ గాలి గులాబీల పరిమళాన్ని మోసుకెళుతుంది. ఇల్లంతా ఆ పరిమళం వ్యాప్తి చెంది నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపేస్తుంది. దోషాలు కూడా పోతాయి. ఇలా రోజూ చేయడం వల్ల మీకు ఇల్లు ఆహ్లాదంగా ఉండడమే కాదు, అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. ఆర్ధికంగా కలిసి వస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు. అయితే ఓసారి నీళ్లు పోశాక... ఆ నీళ్లనే వారం పాటూ ఉంచుతారు చాలా మంది. అలా కాకుండా రోజూ ఆ నీళ్లను పారేసి కొత్త నీరు వేస్తుండాలి. కొత్త పూలు పెడుతుండాలి. రోజూ ఇలా చేయడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు కనిపిస్తాయి.
మానసిక ఆనందం
కంటికి ఆహ్లాదంగా కనిపించే పూలు మనసుకు కూడా ప్రశాంతతను అందిస్తాయి. దీని వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. నిరాశ దరిచేరదు. డిప్రెషన్ వంటి బారిన త్వరగా పడరు. అందుకే కంటికి ఇంపైన రంగులనే చూడమని చెబుతుంటారు వైద్యులు. తాజా పూలు ఎప్పుడూ మనసును ఉల్లాసపరుస్తాయి.
Also read: జుట్టు ఒత్తుగా, నల్లగా పెరగాలా? ఇలా మందార తైలాన్ని తయారుచేసి వాడండి
Also read: బిర్యానీ లవర్స్, ఈ రోజు మీరు కచ్చితంగా బిర్యానీ తినాల్సిందే, హ్యాపీ ఫస్ట్ బిర్యానీ డే