News
News
X

World Biryani Day: బిర్యానీ లవర్స్, ఈ రోజు మీరు కచ్చితంగా బిర్యానీ తినాల్సిందే, హ్యాపీ ఫస్ట్ బిర్యానీ డే

(World Biryani Day) బిర్యానీ అంటే నచ్చనిది ఎవరికి చెప్పండి. పేరు చెబితేనే చాలా మందికి నోరూరి పోతుంది.

FOLLOW US: 

(World Biryani Day) హైదరాబాద్ దేనికి స్పెషల్? అని ఎవరిని అడిగినా అందరూ చెప్పే సమాధానం ఒక్కటే ‘బిర్యానీ’కి అని. నిజమే... తింటే హైదారబాద్ బిర్యానీనే తినాలి. ఈ బిర్యాని ఇక్కడ్నించి ఎన్నో దేశాలకు తిరిగి అక్కడ హైదరాబాద్ దమ్ బిర్యానీ పేరు మీదే అమ్ముడుపోతోంది. ఇప్పుడు ఇంత స్పెషల్ గా బిర్యానీ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? అని సందేహం వచ్చిందా? ఈరోజు ‘ప్రపంచ బిర్యానీ దినోత్సవం’. అందుకే ప్రపంచ బిర్యానీ ప్రేమికులారా ఈరోజు మీరు అన్ని రకాల బిర్యానీలను కుమ్మేయాల్సిందే. 

బిర్యానీ డే ఏంటి?
ఇంతకుముందు బిర్యానీకు స్పెషల్ డే అంటూ ఏమీ లేదు. తొలిసారి ఈ ఏడాదే ‘వరల్డ్ బిర్యానీ డే’ నిర్వహించుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది బిర్యానీ లవర్స్ ఉన్నారు వారందరి కోసమే ఈ బిర్యానీ డే. దీన్ని మొదలుపెట్టింది ఇండియాలో బిర్యానీ బాస్మతి రైస్ ని అమ్మే ఒక బ్రాండ్ సంస్థ వారు. ఎవరు మొదలుపెట్టినా బిర్యానీ లవర్స్ కి మాత్రం పండుగ చేసుకునే రోజు ఇది. 

బిర్యానీ పుట్టింది అక్కడేనా?
బిర్యానీ ఎక్కడ పుట్టినా దానిపై చెరిగిపోని ముద్ర వేసింది మాత్రం హైదరాబాదే. ఎక్కడికెళ్లినా హైదరాబాద్ దమ్ బిర్యాని అడిగి మరీ తింటారు. నిజానికి ఇది స్థానిక వంటకంగా పేరుపొందినప్పటికీ వచ్చింది మాత్రం పరాయి దేశం నుంచే. బిర్యానీ అన్న పదం ‘బిరింజ్ బిరియాన్’ అంటే పర్షియన్ పదం నుంచి పుట్టినట్టు చెప్పుకుంటారు. ఇది పర్షియాలో పుట్టిందని అక్కడ్నించి ఇండియాకు ప్రయాణం కట్టిందని చెబుతారు. అయితే అలా పర్షియా నుంచి వచ్చింది పులావ్ అని చెప్పుకునే వారున్నారు. పులావ్ హైదరాబాద్ వచ్చాక బిర్యానిగా మారిందని అంటారు. కానీ రెండూ వేరు వేరు.  చేసే విధానం, వాడే పదార్థాలు కూడా వేరువేరు అని ప్రపంచం కూడా నమ్మింది. బిర్యానీని ‘సిండ్రెల్లా ఆఫ్ సెంట్రల్ ఏషియన్ ఫిలాఫ్’ అని పేరు. ఏది ఏమైనా చివరకు బిర్యానీ పుట్టింది ఇరాన్ అని నమ్మేవాళ్లే ఎక్కువ. 

మనదేశానికి ఎలా వచ్చింది?
మనదేశాన్ని ఎంతో మంది పరాయి దేశస్థులు పాలించారు. అలా మన దేశం కొత్త ఆహారాలను చవి చూసింది. వాటిలో ఒకటి బిర్యాని. మొఘలులు పాలిస్తున్నప్పుడు వారు ఇలాంటి వంటకాలను పరిచయం చేశారు. అలాగే నిజాంల వల్ల సైనికులుగా పనిచేసే ఎంతో మంది విదేశీ సైనికులు కూడా ఇక్కడి ప్రజలకు వారి వారి స్థానిక వంటకాలను పరిచయం చేశారు. అలాగే మొఘలులు మనకు ఇచ్చిన వరం బిర్యానీ అని చెప్పుకోవాలి.

బిర్యానీలో ఎన్నో రకాలు...
బిర్యానీ లవర్స్ కచ్చితంగా రుచి చూడాల్సిన బిర్యానీ రకాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకం బిర్యానీ ప్రాచుర్యం పొందింది. అన్నింట్లోకి ముందుగా రుచి చూడాల్సింది హైదరాబాద్ దమ్ బిర్యానీనే. అంబుర్ బిర్యానీ,  లక్నోవి బిర్యాని, కోల్ కతా బిర్యాని, దిండిగుల్ బిర్యాని, అవధి బిర్యాని, చెట్టినాడ్ బిర్యాని... ఇవి ఒక్కోటి ఒక్కో రుచితో మతి పొగొడతాయ్. 

Also read: నిద్రలో మాట్లాడడం చిన్న సమస్యేమీ కాదు, అది మానసిక అనారోగ్యానికి సూచన, ఏం చేయాలి?

Also read: సెల్‌ఫోన్లు క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయా? ఈ రెండింటికీ మధ్య లింకేంటి?

Published at : 03 Jul 2022 10:48 AM (IST) Tags: Happy biryani day First Biryani day Biryani Lovers World Boryani day Biryani News

సంబంధిత కథనాలు

ఇతరుల కన్నా దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా? దానికి మీ రంగు కూడా కారణం కావచ్చు

ఇతరుల కన్నా దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా? దానికి మీ రంగు కూడా కారణం కావచ్చు

Breakfast Recipes: మీరు చాలా బిజీయా? అయితే పది నిమిషాల్లో తయారయ్యే దోశెల రెసిపీలు ఇవిగో

Breakfast Recipes: మీరు చాలా బిజీయా? అయితే పది నిమిషాల్లో తయారయ్యే దోశెల రెసిపీలు ఇవిగో

Flag Code: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

Flag Code: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

Life Expectancy: ఇప్పుడు మన సగటు ఆయుర్ధాయం 70 ఏళ్లు, కానీ 1947లో ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Life Expectancy: ఇప్పుడు మన సగటు ఆయుర్ధాయం 70 ఏళ్లు, కానీ 1947లో ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Cucumber: తొక్కే కదా అని తక్కువగా చూడొద్దు, కీర దోస తొక్క ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Cucumber: తొక్కే కదా అని తక్కువగా చూడొద్దు, కీర దోస తొక్క ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

టాప్ స్టోరీస్

Motorola X30 Pro: ప్రపంచంలోనే బెస్ట్ కెమెరా ఫోన్ - 200 + 50 + 12 మెగాపిక్సెల్ సెన్సార్లతో మోటొరోలా మొబైల్!

Motorola X30 Pro: ప్రపంచంలోనే బెస్ట్ కెమెరా ఫోన్ - 200 + 50 + 12 మెగాపిక్సెల్ సెన్సార్లతో మోటొరోలా మొబైల్!

SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI

SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI

Munugode Congress : "మునుగోడు" ఎలా గెలుద్దాం ? కాంగ్రెస్ సీనియర్ల తర్జన భర్జన !

Munugode Congress :

Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !

Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !