అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Iodized salt : రోజుకు ఇంత ఉప్పు వాడితే గుండె జబ్బులు రావట: WHO స్టడీ

Iodized salt: గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రోజుకు ఐదు గ్రాముల ఉప్పు తినమని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.

Iodized salt : ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఆరోగ్యంగా కనిపించినప్పటికీ గుండె జబ్బులు.. సైలెంట్ గా ప్రాణాలు తీస్తున్నాయి. దీనికి కారణాలు చాలానే ఉండవచ్చు. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా చెప్పవచ్చు. అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలను తగ్గించుకోవాలంటే మనం తీసుకునే ఆహారంలో ఉప్పు శాతం తక్కువగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organization - WHO) ప్రకారం అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల ఏటా 1.89 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంది. ఉప్పు తగ్గించడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిపింది. 

ఎంత ఉప్పు ఆరోగ్యానిక సేఫ్?

ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం పెద్దలు రోజుకు 10.78 గ్రాముల ఉప్పును తీసుకోవాలి. అంటే ఇది రెండు టీస్పూన్లతో సమానం. పెద్దలు రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పును తీసుకోవడం మంచిది. 2 నుంచి 15 ఏళ్ల వయస్సున్న పిల్లలు 1 టీస్పూన్ కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలని పేర్కొంది. పాలిచ్చే తల్లులకు ఇది వర్తించదు.  ఉప్పు తీసుకునే రకానికి సంబంధించి పూర్తిగా అయోడైజ్డ్ ఉప్పును మాత్రమే ఆహారంలో చేర్చుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ప్రాసెస్ చేసిన ఆహారంతోనే ఎక్కువ ముప్పు

తల్లి గర్భంలో పిండం ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి అయోడైజ్డ్ ఉప్పు చాలా అవసరం. ఇది సాధారణ ప్రజల మానసిక పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. సోడియం స్థాయి 120 ఎంజీ కంటే తక్కువగా ఉండాలని గుర్తుంచుకోండి. ఆహారాన్ని వండేటప్పుడు చాలా మంది ఉప్పు లేకుండా చేయాలి. ఉప్పును ఉపయోగించడం కంటే రుచికోసం మూలికలు, సుగంధ ద్రవ్యాలను కూడా ఉపయోగించవచ్చు. ఇవేకాకుండా సాస్ లు, డ్రెస్సింగ్ లు, ప్యాక్డ్ ప్రొడక్ట్స్ వినియోగం తగ్గించడం చాలా మంచిది. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు వినియోగం చాలా వరకు తగ్గించాలని WHO తన నివేదికలో పేర్కొంది.

10 గ్రాములు మించితే?

ఇటీవల జపనీస్ అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ 10 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది. రోజువారీ ఉప్పు తీసుకోవడం పెరుగుతున్నా కొద్దీ ఈ ప్రమాదం పెరుగుతుందని హెచ్చరించింది. ఎలుకలపై ప్రయోగం చేశారు. వాటికి ఎక్కువగా ఉప్పు ఉన్న ఆహారం ఇచ్చారు. దీంతో వాటి కడుపులో లైనింగ్ ను ప్రభావితం చేయడం గమనించారు. ఇది క్యాన్సర్‌కు కారణం అవుతుందని గుర్తించారు. దీని తర్వాత చైనా, అమెరికా, స్పెయిన్ లలో నిర్వహించిన అనేక అధ్యయనాల్లోనూ ఇదే విషయం వెల్లడైంది. మనం సాధారణంగా ఆహారంలో 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. ఎక్కువ ఉప్పు తీసుకున్నట్లయితే ఆహారం రుచి మారడమే కాదు.. అనారోగ్యాలు వెంటాడుతాయి.

Also Read : ఈజీగా, టేస్టీగా రెడీ చేసుకోగలిగే పాలకూర వడలు.. రెసిపీ ఇదే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Embed widget