Hair Care Tips: ఈ వర్షాకాలంలో మీ జుట్టు జిడ్డుగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి
వర్షాకాలంలో జుట్టు సంరక్షణ చాలా అవసరం. ఈ సీజన్ లో జుట్టు ఎక్కువగా జిడ్డుగా ఉంటుంది. చాలమందిలో ఈ సమస్య చూస్తూ ఉంటాము. ఇక వర్షంలో తడిచి వచ్చిన తర్వాత జుట్టు మరింత దారుణంగా అయిపోతుంది.
వర్షాకాలంలో జుట్టు సంరక్షణ చాలా అవసరం. ఈ సీజన్ లో జుట్టు ఎక్కువగా జిడ్డుగా ఉంటుంది. చాలమందిలో ఈ సమస్య చూస్తూ ఉంటాము. ఇక వర్షంలో తడిచి వచ్చిన తర్వాత జుట్టు మరింత దారుణంగా అయిపోతుంది. జుట్టు గంపలాగా మారిపోయి చూడటానికే అసహ్యంగా ఉంటుంది. చెమట పట్టడం వల్ల జిడ్డుగా మారడం, జుట్టు రాలిపోవడం, దుమ్ము వల్ల చివర్ల చిట్లి పోవడం జరుగుతుంది. అలా కాకుండా మీ కేశాలు మృదువుగా ఉండాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
వర్షంలో తడవడం వల్ల జుట్టు జిడ్డుగా మారిపోతుంది. దుమ్ము చేరి జుట్టు చివర్ల చిట్లి అసహ్యంగా కనిపిస్తుంది. అందుకని చాలా మంది నూనెతో స్కాల్ఫ్ వరకు మాత్రమే నూనెతో మర్ధన చేసుకుంటారు. కుదుళ్ళ వరకు మాత్రమే నూనె పెట్టుకుని మసాజ్ చేసుకుంటారు. అలా కాకుండా తల మొత్తం శుభ్రంగా నూనె పెట్టడం వల్ల జుట్టు బాగుంటుంది. కొద్దిసేపటి తర్వాత జుట్టుని కడిగి టవల్ తో తుడుచుకోవాలి.
ఇక జుట్టు నల్లగా ఉండేందుకు రంగు వేసుకునే వాళ్ళు ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షంలో తడవడం వల్ల జుట్టు రంగు మారాడమే కాకుండా దాని సహజత్వాన్ని కూడా కోల్పోతుంది. జుట్టుకి వేసిన రంగు చెదిరిపోకుండా చేసే షాంపూలను మాత్రమే ఉపయోగించాలి. ప్రయాణాలకి వెళ్ళేటపుడు తప్పనిసరిగా మీ జుట్టుని సంరక్షించుకోవడానికి గొడుగు తీసుకుని వెళ్ళాలి.
Also read: పిజ్జా, బర్గర్లలో అతిగా చీజ్ వేసుకుని లాగిస్తున్నారా? అయితే ఈ హెచ్చరిక మీకే
చుండ్రు సమస్య అందరినీ వేధిస్తూనే ఉంటుంది. మాడు శుభ్రంగా లేకపోయినా జుట్టు జిడ్డుగా ఉన్న చుండ్రు వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. చుండ్రు వల్ల వచ్చే పొలుసులు పోయేందుకు తరచూ తలస్నానం చెయ్యడం మంచిది. కెటోకానజోల్, సెలీనియం సల్ఫైడ్ వంటి ఔషధ గుణాలు కలిగి ఉన్న షాంపూని ఉపయోగించాలి. దీని వల్ల చుండ్రు సమస్య పోవడంతో పాటు చుండ్రు వల్ల వచ్చే పొలుసు ఉత్పత్తిని తగ్గిస్తుంది.
మీ శిరోజాలు జిడ్డుగా లేకుండా ఉండాలంటే ముందుగా మీ స్కాల్ఫ్ శుభ్రంగా ఉండాలి. శిరోజాల సంరక్షణ కోసం మాడుకి హాని కలిగించేటువంటి షాంపూలను ఉపయోగించకూడదు. కండిషనర్ పెట్టుకున్నాక వేడి నీటితో కడగాలి, ఆ వెంటనే చన్నీళ్లతో కూడా శుభ్రం చేసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల వెంట్రుకల కుదుళ్లు గట్టిపడతాయి. మాడులో నూనె ఉత్పత్తి రాకుండా చేస్తుంది. స్కాల్ఫ్ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే తల, మాడు పరిశుభ్రంగా ఉండాలి. మాడుని శుభ్రం చేసుకునేందుకు వైద్యుడిని సంప్రదించి యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ లోషన్స్ రాసుకోవడం మంచిది.