అన్వేషించండి

Green Tea : మహిళలు రెగ్యులర్‌గా గ్రీన్ టీ తాగితే కలిగే లాభాలు ఇవే.. నష్టాలు కూడా ఉన్నాయా?

Green Tea for Women : గ్రీన్​ టీ ఆరోగ్యానికి చాలామంచిదని తీసుకుంటారు. ఈ గ్రీన్​ టీ మహిళలు రెగ్యులర్​గా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు? ఎవరు దూరంగా ఉండాలో చూసేద్దాం. 

Green Tea Benefits for Women : ఫిట్​గా ఉండాలని, బరువు తగ్గాలని అనుకునేవారు కచ్చితంగా తమ రొటీన్​లో గ్రీన్​ టీ తీసుకుంటారు. కాఫీ, టీలకు బదులుగా దీనిని తీసుకునేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. చేదుగా ఉన్నా పర్లేదు ఆరోగ్యానికి మంచిదని తాగుతారు. అయితే దీనిని మహిళలు రెగ్యులర్​గా తీసుకోవచ్చా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? నిపుణులు ఏమంటున్నారో చూసేద్దాం. 

గ్రీన్​ టీ బెనిఫిట్స్

బరువు తగ్గాలనుకునేవారికి, ఆరోగ్యకరమైన లైఫ్​స్టైల్ కోసం గ్రీన్​ టీ తీసుకోవచ్చు. ఎందుకంటే దీనిని తక్కువగా ప్రాసెస్ చేస్తారు. కొద్దిగా చేదుగా ఉన్నా.. యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. కాబట్టి ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించండంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా చర్మానికి కూడా మంచిది. 

గ్రీన్​ టీలోని కాటెచిన్స్.. ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని తగ్గిస్తాయి. కెఫిన్, అమైనో ఆమ్లం ఎల్​-థియనిన్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది అల్జీమర్స్ వ్యాధిని కూడా దూరం చేస్తుందని పలు పరిశోధనలు నిరూపించాయి. దీనిలో కార్బోహైడ్రేట్స్, షుగర్స్ ఉండవు కాబట్టి జీవక్రియ పెరుగుతుంది. ఇది ఫ్యాట్ బర్న్ చేయడంలో హెల్ప్ చేసి బరువు తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. 

మెరుగైన ప్రయోజనాల కోసం

ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి.. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. దంతాల సమస్యలు కూడా తగ్గుతాయి. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని కార్సినోజెనిసిస్ జర్నల్​లో ప్రచురించిన పరిశోధన తెలిపింది. గ్రీన్​ టీలోని యాంటీఆక్సిడెంట్లు, ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు వృద్ధాప్య చర్మాన్ని దూరం చేసి.. వాపును తగ్గిస్తాయి. మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఒత్తిడిని తగ్గించడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. 

గ్రీన్​ టీ ఆరోగ్యానికి మంచిదే అయినా రోజుకు 2 నుంచి 3 కప్పులు తాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ తీసుకుంటే నిద్రలేమి, హార్ట్ బీట్​లో మార్పులు జరగవచ్చని చెప్తున్నారు. దీనిని ఉదయాన్నే తాగితే మెటబాలీజం పెరుగుతుంది. భోజనానికి ముందు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆకలిని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఆ సమయంలో తీసుకుంటే మంచిదని చెప్తున్నారు. 

గ్రీన్​ టీ సైడ్ ఎఫెక్ట్స్

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది కానీ.. ఎక్కువగా తీసుకుంటే కొన్ని సైడ్​ ఎఫెక్ట్స్ ఉంటాయి. నిద్రలేమి, ఆందోళన, హార్ట్ బీట్​లో మార్పులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొందరికి వికారంగా అనిపిస్తుంది. రక్తహీనత ఉన్న వ్యక్తులు ఎక్కువ తాగితే మంచిది కాదు. కొందరికి తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. కాల్షియం శోషణ దెబ్బతింటుంది. గర్భిణీ స్త్రీలు తక్కువగా తీసుకుంటే మంచిది. 

కాబట్టి గ్రీన్​ టీ ఆరోగ్యానికి మంచిదని ఎక్కువ తాగడం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. లిమిటెడ్​గా తీసుకుంటే ఇది మంచి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. కాబట్టి వైద్యులు, నిపుణుల సహాయంతో మీరు గ్రీన్ టీని మీ డైట్​లో చేర్చుకోవచ్చు.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Beetroot for Kidney Patients : కిడ్నీ సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్ తినొచ్చా? లాభాలు, నష్టాలు తెలుసుకోండి
కిడ్నీ సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్ తినొచ్చా? లాభాలు, నష్టాలు తెలుసుకోండి
BP and Diabetes Food Restrictions : బీపీ, షుగర్ కంట్రోల్ కావాలంటే ఏమి తినాలి? ఏవి మానాలి? డాక్టర్ ఇస్తోన్న సూచనలు ఇవే
బీపీ, షుగర్ కంట్రోల్ కావాలంటే ఏమి తినాలి? ఏవి మానాలి? డాక్టర్ ఇస్తోన్న సూచనలు ఇవే
Puffy Face in the Morning : ఉదయాన్నే ముఖం ఉబ్బుతుందా? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.. కారణాలు ఇవే
ఉదయాన్నే ముఖం ఉబ్బుతుందా? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.. కారణాలు ఇవే
Milk for Skin : 7 రోజులు ముఖానికి పాలు అప్లై చేస్తే ఏమవుతుంది? వేసవిలో చర్మానికి కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే
7 రోజులు ముఖానికి పాలు అప్లై చేస్తే ఏమవుతుంది? వేసవిలో చర్మానికి కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
CM Revanth Reddy: గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AIADMK MLAs resignation: ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
పోలీసులు వచ్చింది నిజమే ! పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ABP దేశంతో ఏమన్నారంటే
పోలీసులు వచ్చింది నిజమే ! పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ABP దేశంతో ఏమన్నారంటే
Rains Alert: మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Embed widget