True Friend : నిజమైన స్నేహితుడిని ఎలా గుర్తించాలి? ఫేక్ ఫ్రెండ్స్‌తో జాగ్రత్తగా ఉండండి
International Friendship Day 2025 : స్నేహం కోసం ప్రాణం పెట్టేవారు కాదు.. స్నేహం పేరుతో దగ్గర ఉంటూ గోతులు తీసేవారు కూడా ఉంటారు. అలాంటివారిని ఎలా గుర్తించాలంటే..

True Friend vs Fake Friend : స్నేహం అనేది చాలా స్పెషల్ బంధం. ఎందుకంటే ఎవరో తెలియని వారిని కూడా ఆప్తులుగా మార్చేగలిగే గుణం ఒక్క స్నేహానికే ఉంది. అలాంటి ఫ్రెండ్షిప్కి గుర్తుగా ప్రతి ఏటా ఆగస్టు మొదటి ఆదివారం రోజు ఫ్రెండ్షిప్ డే (Happy Friendship Day 2025) చేసుకుంటున్నాము. అయితే ఈ స్పెషల్ డే రోజు మీరు మీ ఫ్రెండ్స్‌తో సమయం గడపడం, విషెష్ చేయడంతో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా తెలుసుకోవాల్సి ఉంది. ఈ కాలంలో నమ్మకమైన వ్యక్తులు దొరకడం చాలా అరుదు. మరి మీ స్నేహంలో అలాంటి నమ్మకమైన వ్యక్తులు ఉన్నారా?
నిజమైన స్నేహితులను ఎప్పటికీ నమ్మకమైన వ్యక్తులగా భావిస్తాము. అలాంటివారు మన సంతోషాల్లోనే కాదు.. బాధల్లో కూడా తోడుగా నిలబడతారు. కానీ అలాంటి నమ్మకమైన స్నేహం ఈ కాలంలో దొరకడం చాలా అరుదనే చెప్పవచ్చు. ఎందుకంటే స్నేహం, ప్రేమ పేరు చెప్పి మోసం చేసేవారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. స్నేహం పేరుతో దగ్గరగా ఉంటూనే మోసం చేసేవారు ఎందరో ఉన్నారు. వారిపై ఎలాంటి డౌట్ రాకుండా చూసుకుంటూ చేయాల్సిన డ్యామేజ్ అంతా చేస్తూ ఉంటారు. చివరికి మోసం చేసి వెళ్లిపోతారు. మరి మీ జీవితంలో ఉన్న వ్యక్తులు నిజమైన, నమ్మకమైన స్నేహితులో తెలుసుకునేందుకు ఇవి ఫాలో అయిపోండి.
ఫ్రెండా? ఫేక్ ఫ్రెండా?
మీ స్నేహితుడు మీరు నమ్మదగిన వాడో కాదో తెలుసుకునేందుకు కొన్ని అంశాలు ఉన్నాయి. వారు ప్రతి విషయంలోనూ మీతో అబద్ధాలు చెప్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని, మీ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవడంలో ఎలాంటి చొరవ చూపించారు. మీరు వారిపై అభిమానాన్ని వ్యక్తం చేసినా.. వారు మీకు సరైన రెస్పాన్స్ ఇవ్వరు. అలాంటివారు ఎప్పుటికీ మీ నిజమైన స్నేహితులు కాలేరు.
నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ మీ దుఃఖంలో, బాధలో మీకు తోడుగా నిలుస్తాడు. చుట్టూ ఎవరూ లేకున్నా వారే సైన్యంగా నిలబడతారు.మీ ఆనందాన్ని తమ సంతోషంగా భావిస్తారు. మీ ప్రతి భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో, ఎప్పటికీ విడిచిపెట్టరు. అయితే మీ స్నేహితుడు మీ దుఃఖంలో మీతో లేకుండా.. కేవలం మీ ఆనందాల్లో మాత్రమే మీకు తోడుగా ఉంటే వారికి మీతో ఉన్నది నిజమైన స్నేహం కాకపోవచ్చు. కేవలం వారి అవసరం, సంతోషం కోసమే మీతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. అలాంటివారికి దూరంగా ఉంటే మంచిది.
వారిని వదులుకోకండి..
ఫ్రెండ్స్ ఎప్పుడూ మిమ్మల్ని తక్కువ చేసేందుకు చూడరు. మీరు సక్సెస్ అవ్వాలనే కోరుకుంటారు. మీరు సక్సెస్ అయ్యేందుకు హెల్ప్ చేస్తారు. నిజమైన ఫ్రెండ్ ఎప్పుడూ మీ విజయాన్నే కోరుకుంటారు. కానీ మీరు సక్సెస్ అయితే పక్కకి వచ్చేవారి కంటే.. మీ కృషిలో తోడుగా నిలిచినవారిని ఎప్పటికీ వదులుకోకూడదు. ఫ్రెండ్షిప్ అంటే మీకు లేనిపోని మాటలు చెప్పి.. మీతో ఫ్రెండ్ అంటూ తిరిగేవారు కాదు.. మీ కష్టాల్లో తోడుగా ఉండేవారే నిజమైన స్నేహితులు.
ఎలాంటి స్వార్థం లేకుండా సాయం చేసే ఫ్రెండ్స్ చాలా అరుదుగా దొరుకుతారు. కానీ కొందరు స్వార్థంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అందరూ సాయం చేయాలని రూల్ లేదు కానీ.. ప్రతి విషయంలో స్వార్థంగా ఉండేవారితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు పాజిటివ్ వైబ్ ఇచ్చేవారు.. తమ మాటలతో మిమ్మల్ని మోటివేట్ చేసి మనసు తెలికపరిచే మిత్రులను దూరం చేసుకోకండి. అలాగే మీరు చేయలేరు అని నిరుత్సాహ పరిచేవారికి కూడా మీరు దూరంగా ఉండాలి. అలాంటివారితో ఉంటే మీరు ఎప్పటికీ సక్సెస్ కాలేరు.






















