Happy Friendship Day 2025 : స్నేహితుల దినోత్సవం ఎప్పుడు? సెలబ్రేషన్ ప్లాన్స్‌తో పాటు ఫ్రెండ్షిప్ డే చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే
International Friendship Day 2025 Date : స్నేహితుల దినోత్సవం, స్నేహ బంధాన్ని మరింత బలపరిచే రోజు. స్నేహితులంతా కలిసి ఈ వేడుక జరుపుకుంటారు. మరి ఈ ఏడాది ఇది ఏ రోజు వచ్చిందంటే..

Happy Friendship Day 2025 : స్నేహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అందుకే ఈ బంధాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడానికి.. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం రోజు స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారు. స్నేహ బంధాన్ని ప్రత్యేకంగా చేసుకునే రోజున స్నేహితులందరూ కలిసి తమ బంధాన్ని గుర్తు చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సంవత్సరంలో అంటే 2024లో స్నేహితుల దినోత్సవం ఆగస్టు 3వ తేదీ ఆదివారం వచ్చింది. ఇండియాలో ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే జరుపుకోగా.. మిగిలిన దేశాల్లో జూలై 30వ తేదీన చేసుకుంటారు.
స్నేహితుల దినోత్సవ చరిత్ర
స్నేహితుల దినోత్సవాన్ని ఎన్నో సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు. జూలై 30వ తేదీ 1958న అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని జరుపుకోవాలని మొదటిసారి వీరు ప్రతిపాదించారు. జూలై 30, 2011న ఐక్యరాజ్యసమితి అధికారికంగా అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని ప్రకటించింది. అప్పటినుంచి ప్రపంచంలోని చాలా దేశాలలో ప్రతి సంవత్సరం జూలై 30వ తేదీన స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే భారతదేశంలో ఆగస్టు నెల మొదటి ఆదివారం రోజు స్నేహితుల దినోత్సవాన్ని చేసుకుంటున్నారు.
స్నేహితుల దినోత్సవం ప్రాముఖ్యత
ఇండియాలో ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీన స్నేహితుల దినోత్సవం వస్తోంది. స్నేహితుల పట్ల ప్రేమ, గౌరవాన్ని తెలియజేస్తూ.. వారు తమ జీవితంలో ఎంత ముఖ్యమే చెప్పడమే ప్రధాన ఉద్దేశంగా దీనిని నిర్వహిస్తూ ఉంటారు. కొత్త స్నేహాలు చేసుకోవడానికి, పాత స్నేహితులతో ఉన్న సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఫ్రెండ్షిప్ డే హెల్ప్ చేస్తుంది. చాలామంది ఈ స్పెషల్ డే రోజు తమ స్నేహితులతో కలిసి సమయం గడుపుతారు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. మీరు కూడా మీ స్నేహితులతో కలిసి స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలనుకుంటే వీటిని ట్రై చేయవచ్చు.
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్
స్నేహితుల దినోత్సవాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడానికి.. మీరు ఇద్దరు స్నేహితులతో కలిసి పిక్నిక్కు వెళ్లవచ్చు. ఒకరితో ఒకరు సమయం గడపవచ్చు. ఫ్రెండ్స్‌తో కలిసి థియేటర్‌కి వెళ్లి సినిమా చూడొచ్చు. లేదా ఇంటికి వెళ్లి ఫ్యామిలీతో కూడా దీనిని సెలబ్రేట్ చేసుకోవచ్చు. మీ స్నేహితుడి ఇష్టమైన వస్తువులను గిఫ్ట్ చేయవచ్చు. మీ ఫ్రెండ్ దేనికి ఎక్కువ సంతోషపడతాడో తెలుసుకుని.. దానికి తగ్గట్లు మీరు మీ రోజుని ప్లాన్ చేసుకోవచ్చు.
సోషల్ మీడియాలో షేర్ చేయండి
మీరు మీ స్నేహితుడితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేయవచ్చు. వారిని ట్యాగ్ చేసి.. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పవచ్చు. వీటితో పాటు మీరు మీ చేతులతో కొన్ని వంటలు చేయవచ్చు. లేదా గ్రీటింగ్ కార్డ్‌ను తయారు చేయవచ్చు. ఏమైనా గొడవల జరిగి.. మీ మధ్య దూరం పెరిగితే.. ఆ గొడవలను పరిష్కరించుకునేందుకు ఇదే బెస్ట్ టైమ్‌గా తీసుకోవాలి. వారితో మాట్లాడటమో.. లేదా మీ గొడవను తగ్గించుకునే ప్రయత్నం చేయండి.






















