అన్వేషించండి

Kids Health: చలికాలంలో ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా బుజ్జాయిలని ఇలా కాపాడుకోండి

నవజాత శిశువుల సంరక్షణకి చలికాలంలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే వాళ్ళు అనారోగ్యాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడతారు.

కరోనా కాలంలో నవజాతశిశువులు, పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ శీతాకాలంలో జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల  బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కారణం తగినంత రోగనిరోధక శక్తి లేకపోవడమే. అందువల్ల వైరస్లు, బ్యాక్టీరియాతో పోరాడటంలో విఫలం అవుతారు. చల్లటి గాలుల నుంచి వారిని రక్షించుకోవడం కోసం మెత్తగా ఉండే దుస్తులు ధరించడం, హైడ్రేట్ గా ఉంచడం, ఆరోగ్యకరమైన పోషణ అందించడం చాలా అవసరం. వాటితో పాటు జలుబు, ఫ్లూ నుంచి రక్షించుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి.

చేతులు కడుక్కోకుండా బిడ్డని తాకవద్దు

చేతుల పరిశుభ్రత చాలా ముఖ్యం. మీ బుజ్జయిల ఆరోగ్యం మీ చేతులతోనే ముడిపడి ఉంటుంది. అందుకే చేతులని సబ్బుతో కడుక్కోవాలి. బయట నుంచి వచ్చినప్పుడు లేదా ఇంట్లో పనులు చేసి వచ్చిన తర్వాత నేరుగా బిడ్డని ఎత్తుకోకుండా చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత వారిని తాకాలి. సబ్బు లేదా హ్యాండ్ వాష్ ద్వారా శుభ్రం చేసుకోవడం వల్ల క్రిములు తొలగిపోతాయి.

ఇంట్లో నవజాత శిశువులు ఉంటే వారి దగ్గరకి వచ్చే బయట వాళ్ళు తప్పనిసరిగా చేతులు శానిటైజ్ చేసుకుని రమ్మని చెప్పాలి. పిల్లల్ని చూసేందుకు బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు ఇంటికి వస్తూ ఉంటారు. సందర్శకుల వల్ల బిడ్డ అనేక అంటు వైరస్ లకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఎవరైనా ఇంట్లోకి వస్తుంటే వాళ్ళు తప్పకుండా ముఖానికి మాస్క్, చేతులకి శానిటైజర్ ఇవ్వండి.

అలాంటి వారిని దూరంగా ఉంచాలి

అంటువ్యాధుల్ని నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం అనారోగ్యంతో ఉన్న వ్యక్తులని దూరంగా ఉంచడమే. జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధులు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇన్ఫెక్షన్ సోకిన వాళ్ళు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు నోటి తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. అందుకే అటువంటి వారిని మీ పిల్లల దగ్గరకి రానివ్వద్దు. పిల్లల సంరక్షణకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

తల్లిపాలు చాలా ముఖ్యం

శిశువులకి రోగనిరోధక శక్తి పెంచడానికి తల్లిపాలు చాలా కీలకం. వాళ్ళు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా తల్లి తన బిడ్డకి పాలు ఇవ్వాలి. ఇది వాళ్ళకి స్వల్ప, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడేందుకు సహాయపడుతుంది.

ఇల్లు పరిశుభ్రత

శరీరంతో పాటు ఇంటి శుభ్రత కూడా చాలా అవసరం. మురికి వస్తువులు, చెత్త బయట పడేయాలి. మంచాల మీద ఉండే బెడ్ షీట్స్, కప్పుకునే దుప్పట్లు నిరంతరం వాష్ చేసుకోవాలి. పిల్లలకి ఉపయోగించే ప్రతి వస్తువు, వారి దుస్తులు వేడి నీటిలో వేసి శుభ్రం చేసుకోవడం ఉత్తమం.

అటువంటి పరిస్థితుల్లో బయటకి వెళ్లొద్దు

చలికాలంలో జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్ల కేసుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇటువంటి సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్న టైమ్ లో బయటకి వెళ్ళక పోవడం ఉత్తమం.  

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: అవిసె గింజల పొడి కలిపిన పాలు తాగితే బోలెడు ప్రయోజనాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత
Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత
Telangana Latest News:ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
Property Tax: ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Shreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP DesamShashank Singh on Shreyas Iyer 97 Runs | GT vs PBKS మ్యాచ్ లో అయ్యర్ బ్యాటింగ్ పై శశాంక్ ప్రశంసలుShreyas Iyer 97 Runs vs GT IPL 2025 | గుజరాత్ బౌలర్లను చెండాడిన శ్రేయస్ అయ్యర్ | GT vs PBKS | ABPMysterious Tree in Manyam Forest | ప్రాణాలు తీస్తున్న వింత వృక్షం..ఆ పల్లెలో అసలు ఏం జరుగుతోంది? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత
Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత
Telangana Latest News:ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
Property Tax: ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
Ippala Ravindra Reddy: లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
Manoj Bharathiraja: తమిళ దర్శకుడు భారతీరాజా ఇంట తీవ్ర విషాదం...‌ కుమారుడు మనోజ్ హఠాన్మరణం
తమిళ దర్శకుడు భారతీరాజా ఇంట తీవ్ర విషాదం...‌ కుమారుడు మనోజ్ హఠాన్మరణం
SLBC Tunnel Rescue Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
Telangana MLAs Case: ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Embed widget