అన్వేషించండి

Diabetes Controlling Tips : ఈ టిప్స్ ఫాలో అయితే మీకు మధుమేహం రాదట

Stay From Diabetes : మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం జోలికి రాదు తెలుసా? వ్యాధి వచ్చాక కేర్ తీసుకోవడం కన్నా.. రాకముందే జాగ్రత్త పడితే మంచిది. 

Healthy Lifestyle : మధుమేహం వచ్చాక జాగ్రత్తలు తీసుకోవడం కాదు.. రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా.. జీవనశైలిలో మార్పులతో ఈ దీర్ఘకాలిక వ్యాధి వచ్చే ప్రమాదముంది. అందుకే మీ లైఫ్ స్టైల్​లో కొన్ని మార్పులతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. జబ్బు వచ్చాక నయం చేసుకునేందుకు మార్గాలు వెతుక్కోవడం కన్నా.. అది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యానికే మంచిది అంటున్నారు నిపుణులు. మధుమేహం (Diabetes Controlling Tips ) రాకుండా జీవనశైలిలో, తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇది మన దరికి రాదు అంటున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఫుడ్ విషయంలో జాగ్రత్త

మధుమేహం రావడంలో ఫుడ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి మీ డైట్​లో సమతుల్యమైన ఆహారం ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. ఇది మీరు హెల్తీగా బరువు తగ్గడంలో సహాయం చేయడంతో పాటు.. మధుమేహం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. మీకు శక్తిని అందించి.. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. 

మీ డైట్​లో కార్బో హైడ్రేట్లు, చక్కెర అధికంగా ఉండే ఆహారం లేకుండా చూసుకోండి. వాటికి బదులుగా తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు, ఫైబర్​ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోండి. ఫైబర్ మీరు కడుపు నిండుగా ఉన్నా ఫీల్ తెస్తుంది. అంతేకాకుండా మీ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. ఇది మీరు ఫుడ్​ ఎక్కువగా తీసుకోకుండా శరీరంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయం చేస్తుంది.

కొంతమంది తమ డైట్​లో భాగంగా శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలను అందించడం మానేస్తారు. లేదంటే బాగా ఎక్కువగా తినేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. మధుమేహం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అస్సలు తీసుకోకపోవడం కాకుండా.. ఏది తీసుకున్నా లిమిట్​లో తీసుకోండి. ఇది మధుమేహం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని మీకు అనిపిస్తే.. మీరు తినడం కాస్త తగ్గించండి. ఇది మీ రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. కాబట్టి అతిగా తినడాన్ని నివారించండి. ముఖ్యంగా బరువు విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. 

వీలైనంత చురుకుగా ఉండండి..

చాలామంది చేసే తప్పు ఏంటంటే తిన్నా.. తినకపోయినా ఒకేచోట కదలకుండా కూర్చొంటారు. దానివల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. శారీరక శ్రమలో పాల్గొనడం వల్ల బరువు తగ్గుతారు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్​లో ఉంటాయి. లేదంటే శరీరంలో ఇన్సులిన్​ సెన్సిటివిటి పెరుగుతుంది. బరువు తగ్గితే శరీరంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. 
కాబట్టి వీలైనంత చురుకుగా ఉండండి. ప్రతి రోజు జాగింగ్ చేయండి. స్విమ్మింగ్, సైక్లింగ్​ లేదా ఫాస్ట్ వాక్​ చేయడం వల్ల కూడా బరువు తగ్గుతారు. ఇది గుండె సమస్యలను దూరం చేస్తుంది. పైగా ఇది మధుమేహ సమస్యలను దూరం చేస్తుంది.

రోటీన్ హెల్త్ చెకప్​.. 

రక్తంలో చక్కర స్థాయిలను రెగ్యూలర్​గా చెక్​ చేయించుకోండి. మీ ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్​ ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు రెగ్యూలర్​గా డాక్టర్​ దగ్గరికి వెళ్లండి. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించండి. కొలెస్ట్రాల్ స్థాయిలను, రక్తపోటును అదుపులో ఉంచుకోండి. ఒకవేళ బరువు ఉంటే వెంటనే దానిని తగ్గేందుకు మార్గాలు వెతుక్కోండి. ఎందుకంటే అధిక బరువు మధుమేహం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. 

జీవనశైలిలో మార్పులు..

ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి ఈ రెండు అలవాట్లను కంట్రోల్​ చేయండి. పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది. ఇది మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా మధుమేహ సమస్యలు వస్తాయి. నిద్రలేమి వల్ల హర్మోన్లలో అసమతుల్యతలు పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్నిపెంచుతుంది. కాబ్టటి కచ్చితంగా ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. ఒత్తిడి వల్ల కూడా షుగర్ వచ్చే ప్రమాదముంది. కాబట్టి వీలైనంత ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఈ మార్పులతో మీరు మధుమేహం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. 

Also Read : మీరు సడెన్​గా బరువు పెరుగుతున్నారా? అయితే ఇవే కారణాలు కావొచ్చు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget