By: ABP Desam | Updated at : 31 Jan 2023 12:27 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Pexels
ఆడవాళ్ళు వంటగది చాలా చక్కగా సర్దుకుంటారు. శుభ్రత విషయంలో చాలా జాగ్రత్త చూపిస్తారు. ఇంట్లో పరిశుభ్రంగా పూజగది తర్వాత ఎక్కువ ప్రాధాన్యత వంటగదికే ఇస్తారు. కానీ దాన్ని శుభ్రం చేయడం అనేది మామూలు విషయం కాదు. నూనె, మసాలా మరకలు వదిలించడం చాలా కష్టం. అందులోనూ గ్యాస్ స్టవ్ మీద పడే పరకలు వదిలించాలంటే చాలా ఓపిక కావాలి. ప్రతిరోజు ఏం తుడుస్తాములే అని కొంతమంది మహిళలు అలాగే మురికిగా పెట్టేసుకుంటారు. తర్వాత ఒక్కసారిగా ఆ మురికి అంతా వదిలించుకోవాలంటే చేతులు నొప్పులు పుట్టేలాగా రుద్దుకోవాలి. అలా కాకుండా మీరు సింపుల్ గా ఈ చిట్కాలు పాటించారంటే గ్యాస్ స్టవ్ శుభ్రం చేసుకోవడం చాలా తేలిక. శుభ్రం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ కొనాల్సిన అవసరం లేదు జస్ట్ వంటింట్లో దొరికే వాటితోనే చేసుకోవచ్చు.
ఉల్లిపాయ
గ్యాస్ స్టవ్ నుంచి మరకలు తొలగించడానికి ఉల్లిపాయ చక్కగా ఉపయోగపడుతుంది. మీరు చేయాల్సిందల్లా ఉల్లిపాయ ముక్కలని 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ నిరూ చల్లారనివ్వాలి. ఈ నీటిని స్పాంజితో ముంచుకుని గ్రీజు మరకలు రుద్దాలి. అంతే గ్యాస్ స్టవ్ నిమిషాల్లోని శుభ్రంగా మెరిసిపోతుంది.
వెనిగర్
కేవలం కొన్ని చుక్కల తెల్ల వెనిగర్ ను మురికిపై పోసి ఉంచితే చాలు. దాన్ని కాసేపు అలాగే నానబెట్టాలి. తర్వాత స్పాంజి ఉపయోగించి మసాలా మరకలు తుడిచేసారంటే చేతికి కష్టం లేకుండా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. మురికి, జిడ్డు త్వరగా పోవాలని అనుకుంటే అందులో కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసి నానబెట్టవచ్చు.
బేకింగ్ సోడా
గ్యాస్ స్టవ్ శుభ్రం చేయడానికి ఆడవాళ్ళు ఎక్కువగా ఉపయోగించే అత్యంత ప్రజాదరణ పొందిన పదార్థం బేకింగ్ సోడా. నిమ్మరసం లేదా వైట్ వెనిగర్ కలిపి గ్యాస్ స్టవ్ శుభ్రం చేసుకోవచ్చు. దీని వల్ల మురికి చక్కగా పోతుంది. సమర్థవంతంగా పని చేస్తుంది.
నిమ్మకాయ
నిమ్మకాయ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఓ వైపు ఆరోగ్యాన్ని, అందాన్ని ఇవ్వడమే కాదు పరిశుభ్రత కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. గ్యాస్ స్టవ్ శుభ్రం చేసుకోవడానికి నిమ్మతొక్క, రసం రెండు బాగా పని చేస్తాయి. డిష్ లిక్విడ్ లేదా బేకింగ్ సోడాతో కలిపినప్పుడు ఇది ధూళి, మరకలు తొలగించేస్తుంది. ఇదే కాదు జిడ్డు పట్టిన గిన్నెల మురికిని కూడా వదిలించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.
డిష్ వాష్ లిక్విడ్
గ్యాస్ స్టవ్ శుభ్రం చేసుకోవడానికి అత్యంత ప్రజాదరణ పొందిన చిట్కా డిష్ వాష్ వాడటం. దుమ్ము, ధూళి తొలగించడానికి స్పాంజ్ మీద కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ వేసుకుని స్టవ్ మీద స్క్రబ్ చేస్తే సరిపోతుంది. ఎంతటి మురికి అయినా చక్కగా వదిలేస్తుంది. ఇంకా కష్టం లేకుండా ఉండాలంటే లిక్విడ్ కాస్త నీళ్ళు లేదా వెనిగర్ కలిపి స్టవ్ మీద కాసేపు వేసి నానబెట్టిన తర్వాత అయినా క్లీన్ చేసుకోవచ్చు. అంతే స్టవ్ శుభ్రం చేసుకునేటప్పుడు ఈ చిట్కాలు పాటించారంటే మురికి అనేది ఉండదు. అద్దంలా మెరిసిపోతాయి.
Also Read: రోటీలు చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించి చూడండి, మెత్తగా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయ్!
బరువు తగ్గేందుకు వ్యాయామం అక్కర్లేదట, జస్ట్ ఈ మాత్ర వేసుకుంటే చాలట!
గర్భనిరోధక మాత్రల వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందా?
Summer Skin Care: వేసవిలో మీ చర్మాన్ని సంరక్షించే విషయంలో ఈ తప్పులు చేయొద్దు
Dandruff: చుండ్రుని శాశ్వతంగా వదిలించుకోగలమా? ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా?
Red Meat: రెడ్ మీట్ అతిగా తింటున్నారా? జాగ్రత్త ప్రాణాలు తీసే ఈ వ్యాధులు వచ్చేస్తాయ్
Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల
TSRTC Dynamic Pricing: రద్దీ టైంలో తెలంగాణ బస్ టికెట్లపై బాదుడు - కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్- ఈనెల 27 నుంచే అమలు
Ustad Bhagat Singh Shoot : రాసుకో సాంబ - షూటింగుకు ఉస్తాద్ పవన్ కళ్యాణ్ రెడీ
Actor Ajith Father Died : కోలీవుడ్ హీరో అజిత్ ఇంట్లో విషాదం - హీరో తండ్రి మృతి