Flirting Tips: ఫ్లర్టింగ్ టిప్స్... పాతవే కానీ ఇప్పటికీ పనిచేస్తాయి, ఆమెను మీ ప్రేమలో పడేలా చేస్తాయి
ఆన్లైన్ డేటింగ్ ఇప్పుడు ఫ్యాషన్ అయింది కానీ ఒకప్పుడు ఒకరినొకరు ఎంత అందంగా ఫ్లర్ట్ చేసుకునే వారో.
కరోనా మహమ్మారి వచ్చాక దూరం బాగా పెరిగిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ పాత రోజులు వెనక్కి వస్తున్నాయి. గతఏడాది అయితే ప్రేమపక్షుల బాధ ఇంతా అంతా కాదు. మనసుకు నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయిని పడేసేందుకు వాట్సాప్, ఫేస్ బుక్ ఇలా ఆన్లైన్ దారులనే నమ్ముకున్నారు. వాట్సాప్ చాట్‌ను ప్రేమ ఎమోజీలతో నింపేసేవారు. ఇప్పుడు రెండో డోసుల వ్యాక్సిన్ వేసుకున్నవారంతా ధైర్యంగా, స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టారు. ఆంక్షలు కూడా పెద్దగా లేవు. అందుకే బయట ప్రదేశాల్లో మళ్లీ ప్రేమికులు, స్నేహితులు జంటలుగా తిరుగుతూ కనిపిస్తున్నారు. పాతరోజులు మళ్లీ వచ్చాయి. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయిని పడేయాలంటే... మళ్లీ పాత పద్దతులు ఉపయోగించవచ్చు. ఇవి సరికొత్తగా ఉండకపోవచ్చు, కానీ కచ్చితంగా వర్కవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ప్రేమను పడేయాలంటే మొదట చూపించాల్సింది వాళ్లపై మీకున్న ‘కేరింగ్’. అది వారి మనసును తాకేలా ఉండాలి. అది ఆన్ లైన్లో చూపించడం చాలా కష్టం.
చేతిపై ముద్దు
మీరు ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి చేతిని అందుకుని సున్నితంగా ముద్దు పెట్టండి. అది ఆప్యాయతను, వారి పట్ల మీకున్న ఆసక్తిని తెలియజేస్తుంది. అంతేకాదు మీ ప్రేమను వారికి చెప్పడంలో అది చాలా స్వచ్ఛమైన, మర్యాదైన పద్ధతి కూడా.
మెచ్చుకోండి
‘నువ్వు ఈ రోజు చాలా బావున్నావ్’, ‘నీతో కలిసి ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది’ ఇలా చిన్న చిన్న మెచ్చుకోళ్లతో ఎదుటి వారి మనసును మీవైపు తిప్పుకోవచ్చు. ఇలా మాట్లాడుతూ చిన్న చిరునవ్వును కూడా పెదాలపై ప్రదర్శించండి.
అబ్బాయిలకు మాత్రమే...
ఈ చిట్కా చెప్పేది కేవలం అబ్బాయిలకు మాత్రమే. రెస్టారెంట్ లేదా కారు ఏదైనా కావచ్చు, అమ్మాయి వస్తుంటే డోర్ మీరే ముందుగా తీయాలి. అలాగే ఆమె రెస్టారెంట్లోకి ఎంట్రీ ఇచ్చాక టేబుల్ దగ్గర కుర్చీ లాగి ఆమెను కూర్చోమని చెప్పే వరకు మీ బాధ్యతే. ఇలాంటి చిట్కాలను అమ్మాయిలు త్వరగా ఇంప్రెస్ అయిపోతారు.
ప్రతిదీ పంచుకోండి
మీరు ఉండే పద్దతే మీ ప్రేమను అంగీకరించాలా వద్దా, మీ ప్రేమలో పడాలా వద్ద అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి మీరు ప్రేమించిన వారితో ఉన్నప్పుడు ప్రతి షేర్ చేసుకోండి. అది బాధైనా, సంతోషమైనా. చివరికి ఆహారమైనా. ముందుగా ఆమెకు ఇచ్చాకే మీరు తినండి.