World Vegan Day: వీగన్ డైట్ వల్ల లాభాలేంటి? ఫాలో అయితే అందం, నాజూకుతనం... రెండూ సొంతమవుతాయా?
వీగనిజం ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని కమ్ముకుంటున్న ఆహార పద్దతి.

మాంసాహారం, శాకాహారం... అలాగే వీగనిజం. ఇది కూడా ఒక ఆహారశైలి. ప్రపంచవ్యాప్తంగా వీగన్ల సంఖ్య పెరుగుతున్నట్టు ఓ సర్వే చెబుతోంది. కొలెస్ట్రాల్ లేని ఆహారం శారీరక ఆరోగ్యానికి చాలా మంచిదని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. వీగనిజంలో కొలెస్ట్రాల్ అతి తక్కువ స్థాయిలో లభిస్తుంది. కాబట్టే వీగన్లు అందంగా, నాజుకుగా ఉంటారని కొందరి అభిప్రాయం. 1994 నుంచి ప్రతి ఏడాది నవంబర్ 1న ప్రపంచ వీగన్ దినోత్సవాన్ని వీగన్లు నిర్వహించుకుంటారు. తొలిసారి బ్రిటన్ లో ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం మొదలైంది.
వీగనిజం అంటే...
వీరు జంతువుల నుంచి వచ్చే, వాటికి సంబంధించిన ఏ ఉత్పత్తిని తినరు, వినియోగించరు. చివరికి పాలు, పెరుగు కూడా. ఎందుకంటే అవి కూడా జంతువుల నుంచే వస్తాయి కాబట్టి. కేవలం మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తారు. వాటితో తయారుచేసిన ఉత్పత్తులే వాడతారు. హ్యాండ్ బ్యాగులు కూడా లెదర్ తో చేసిన వాటికి వ్యతిరేకం.
లాభాలేంటి?
1. వీగన్ డైట్లో శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. పండ్లు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలు, గింజలు, విత్తనాలు ఇలా సంపూర్ణ ఆహారం లభిస్తుంది. వీటిలో ఎక్కువ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్లు ఏ,సి, ఇలు వీగన్ డైట్లో పుష్కలంగా లభిస్తాయి.
2. వీగన్ డైట్ పాటించే వాళ్లు క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాల బారిన తక్కువ పడతారు. ఎందుకంటే మొక్కల ఆధారిత ఆహారాలు ఫైటో కెమికల్స్ తో నిండి ఉంటాయి. అలాగే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. నాన్ వీగన్లతో పోలిస్తే వీరికి తక్కువ స్థాయి సంతృప్త కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు.
3. వీగన్ డైట్ పాటించే వాళ్లలో మూడ్ స్వింగ్స్ తక్కువగా ఉంటాయి. వీరు ఆనందంగా ఉంటారు. డిప్రెషన్ ఛాయలు తక్కువగా ఉంటాయి.
4. ఈ డైట్ ద్వారా తక్కువ కేలరీలు శరీరానికి అందుతాయి కాబట్టి బరువు త్వరగా పెరగరు. నాజూకుగా ఉంటారు. వీరిలో ఊబకాయం వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ.
5. వీగన్ ఆహారాన్ని తినేవారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే శాతం 78 శాతం తక్కువ.
6. ఈ డైట్ లో అధికంగా పండ్లు, కూరగాయలు తింటారు కాబట్టి చర్మం సహజమైన మెరుపును సంతరించుకుంటుంది. పాలు, పెరుగు, మాంసాహారం వంటివి తినరు కాబట్టి చర్మం జిడ్డు పట్టడం, మొటిమల సమస్య వీగన్ల దరిచేరదు.
వీగన్ సెలెబ్రిటీలు వీరే...
ఎంతో మంది బాలీవుడ్, హాలీవుడ్ సెలెబ్రిటీలు వీగన్లుగా మారారు. పమేలా అండర్సన్, రస్సెల్ బ్రాండ్, ఆమిర్ ఖాన్, కంగనా రనౌత్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ, శ్రద్ధా కపూర్... వీరంతా వీగన్లే.
Also read: ఈ పాపులర్ బ్రేక్‌ఫాస్ట్ మీ గుండెకు హాని చేయచ్చు... జాగ్రత్త
Also read: వారానికి రెండు సార్లు తింటే చాలు... మతిమరుపు మీ మెదడును చేరదు
Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?
Also read: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?





















