Summer Sleep Time: వేసవిలో ఆలస్యంగా నిద్రలేచేవారికి హెచ్చరిక, ఈ ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు!

రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయే.. పగటి వేళ ఒక గంట ఎక్కువ నిద్రపోతే ఏమవుతుందిలే అనుకుని పడుకోకండి. దానివల్ల మీకు తెలియకుండానే కొన్ని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుకుంటాయ్.

FOLLOW US: 

వేసవి వచ్చిందంటే.. నిద్ర వేళలు కూడా మారిపోతుంటాయి. చాలామందికి ఉదయం వెళల్లో ఎక్కువ సేపు గడపడం ఇష్టం ఉండదు. దీంతో రాత్రి వేళ్లల్లో ఎక్కువ సమయం మేల్కోని ఉండి ఆలస్యంగా నిద్రపోతారు. రాత్రి కోల్పోయిన నిద్రను పగటి వేళ ఒక గంట ఎక్కువగా పడుకుని కవర్ చేయాలని అనుకుంటారు. అయితే, ఇలా నిద్ర నుంచి మేల్కొనే సమయాన్ని పొడిగించడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ జీవితంలో నిద్రపోవడానికి, మేల్కోడానికి ఒక కచ్చితమైన సమయాన్ని నిర్దేశించుకోవాలని చెబుతున్నారు. మీ నిద్ర వేళలు కనీసం ఒక గంట పెరిగినా ఆరోగ్యం అదుపుతప్పుతుందని.. ఏ క్షణంలోనైనా మీరు ఆస్పత్రిపాలు కావచ్చని తెలుపుతున్నారు. 

ఏం జరుగుతుంది?: కొంతమంది వీకెండ్స్‌లో ఆలస్యంగా నిద్రపోయి తర్వాత రోజు సూర్యుడు నడి నెత్తిమీదకు వచ్చిన తర్వాత నిద్రలేస్తారు. ఉదాహరణకు శనివారం రాత్రంతా ఎంజాయ్ చేసి.. ఆదివారం ఉదయం హాయిగా నిద్రపోయి ఆ సమయాన్ని కవర్ చేయాలని అనుకుంటారు. కానీ, అది చాలా పొరపాటని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలిపింది. 

రోజూ ఒక గంట ఎక్కువ సేపు పడుకున్నప్పటికీ.. నిద్ర సమయం మారడం వల్ల గుండెపోటు, పక్షవాతం, గుండె క్రమరహితంగా కొట్టుకోవడం వంటివి ఏర్పడతాయని తెలిపింది. ఫ్లోరిడాలోని యూనివర్శిటీ ఆఫ్ మియామి మిల్లర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో స్లీప్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ గిరార్డిన్ జీన్-లూయిస్ దీని గురించి చెబుతూ.. నిద్ర సమయంలో మార్పుల వల్ల ప్రజలు కొన్ని రకాల గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు’’ అని తెలిపారు. 

స్లీప్ మెడిసిన్‌లో ప్రచురించిన 2015 అధ్యయనం ప్రకారం.. నిద్ర వేళలు మారిన మొదటి రెండు రోజుల్లో పక్షవాతం ఏర్పడే అవకాశాలు ఎనిమిది శాతం ఎక్కువగా ఉన్నట్లు కనుగొంది. 65 ఏళ్లు పైబడిన వారిలో ఇది 20 శాతం ఎక్కువగా ఉందని, క్యాన్సర్‌తో బాధపడుతున్నవారిలో ఇది 25 శాతం ఎక్కువగా ఉందని అధ్యయనం వెల్లడించింది. 2014 అధ్యయనంలో వేసవిలో నిద్ర సమయం మారడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం 24 శాతం పెరిగినట్లు పేర్కొంది. 

స్లీప్ అండ్ సిర్కాడియన్ సైన్సెస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ జీన్-లూయిస్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘యువకులు, ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో ఈ సమస్య పెద్దగా కనిపించదు. వారి నిద్ర వేళలు మారినా.. శరీరం సర్దుబాటు చేసుకోగలదు. కానీ వృద్ధులు, నిద్ర సమస్యలు ఎదుర్కొనేవారు నిద్రవేళలను మార్చితే.. శరీరం తట్టుకోలేదు’’ అని తెలిపారు. అందుకే మన పూర్వికులు చీకటి పడగానే నిద్రపోయి. సూర్యోదయం కాకముందే నిద్రలేచేవారు. 

ఉదయం వేళ్లలో ఒక గంట లేదా అంతకంటే ఎక్కువ సేపు నిద్రపోవడాన్ని ‘డేలైట్ సేవింగ్ టైమ్’గా అభివర్ణిస్తున్నారు. రోజూ మీరు మేల్కొనే వేళలలో కాకుండా.. గంట ఆలస్యంగా నిద్రలేచినట్లయితే.. శరీరానికి చెందిన సహజ సిర్కాడియన్ రిథమ్‌ గందరగోళానికి గురవ్వుతుంది. ఇది పగటి వెలుగుపై ఆధారపడి ఉంటుంది. సూర్యునికి ప్రతిస్పందనగా ప్రతి ఉదయం రీసెట్ అవుతుంది. మన అంతర్గత ‘శరీర గడియారం’ నిద్ర ద్వారా శరీరంలోని ప్రతి అవయవాన్ని నియంత్రిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ, కాలేయ పనితీరును మెరుగుపరచడంలో దీని పాత్ర కీలకం.

అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ వివరాల ప్రకారం.. నిద్ర సమయంలో మార్పు ప్రభావాలు కొన్ని నెలలు వరకు ఉండవచ్చు. డేలైట్ సేవింగ్ చేసేవారిలో మానసిక స్థితి అదుపు తప్పుతుందని, ఆకలిపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలుసుకున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు.. వైద్యులు మరికొన్ని సూచనలు చేశారు. మీరు నిద్రపోయే పడకను నేరుగా సూర్య కిరణాలు పడేలా ఏర్పాటు చేసుకోవాలి. ఉదయాన్నే సూర్యుడి కిరణాలు మిమ్మల్ని నిద్రలేపాలి.

Also Read: డయాబెటిస్‌ బాధితులకు ఈ సమ్మర్ పెద్ద సవాలే, ఈ జాగ్రత్తలు పాటిస్తేనే సేఫ్!

ఉదయం వేళ లేలేత సూర్య కిరణాలు మీ ముఖానికి తగలడం కూడా ఆరోగ్యానికి మంచిదే. దానివల్ల మీరు మరో గంట ఎక్కువ పడుకోవాలన్నా పడుకోలేరు. ఉదయం నిద్రలేవగానే సూర్యుడిని చూడటం మరింత మంచి అలవాటు. రాత్రి నిద్రపోయే ముందు కెఫిన్(కాఫీ, టీలు) తాగొద్దు. మద్యం అస్సలు వద్దు. అవి మీ నిద్రను చెడగొడతాయి. కాబట్టి, ఈ రోజు నుంచి అలారమ్‌ను స్నూజ్ పెట్టకుండా, అనుకున్న సమయానికే నిద్రలేచి పగటి వేళలలను ఎక్కువ సేపు, రాత్రి వేళలను తక్కువ సేపు గడపండి. గుండె, పక్షవాతం దరిచేరకుండా జాగ్రత్తపడకండి. 

Also Read: ‘ఏక్ మినీ కథ’ - ఇండియాలో అందరిదీ ఇదే వ్యథా? ఆ ‘సైజు’పై ఈ సర్వే వివరాలు నమ్మొచ్చా?

Published at : 26 Mar 2022 01:24 PM (IST) Tags: Sleeping Time In Summer Summer Sleeping Time Sleeping Late In Summer Waking Late in Summer Summer Sleep Time Sleeping Time Change Effects

సంబంధిత కథనాలు

Dandruff Treatment: చుండ్రు ఏర్పడటానికి కారణాలివే, రోజూ ఇలా చేస్తే మళ్లీ రమ్మన్నారాదు!

Dandruff Treatment: చుండ్రు ఏర్పడటానికి కారణాలివే, రోజూ ఇలా చేస్తే మళ్లీ రమ్మన్నారాదు!

Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!

Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!

Bad Body Odour: శరీర దుర్వాసన చికాకు పెడుతోందా? ఈ చిట్కాలు మీ కోసమే!

Bad Body Odour: శరీర దుర్వాసన చికాకు పెడుతోందా? ఈ చిట్కాలు మీ కోసమే!

Moon sand: చంద్రుని మట్టిలో ఆకుకూరల పెంపకం, భవిష్యత్తులో అక్కడ కూడా పంటలు పండిస్తామా?

Moon sand: చంద్రుని మట్టిలో ఆకుకూరల పెంపకం, భవిష్యత్తులో అక్కడ కూడా పంటలు పండిస్తామా?

World Bee Day 2022: వేల తేనెటీగల కష్టమే మనం తాగే స్పూను తేనె, నేడు తేనెటీగల దినోత్సవం

World Bee Day 2022: వేల తేనెటీగల కష్టమే మనం తాగే స్పూను తేనె, నేడు తేనెటీగల దినోత్సవం

టాప్ స్టోరీస్

Russia Ukraine War : ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !

Russia Ukraine War :  ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్

Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు !

Complaint On Avanti Srinivas :

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్