By: ABP Desam | Updated at : 18 Mar 2022 09:04 PM (IST)
Edited By: Suresh Chelluboyina
Representational Image/Pixabay And Pixels
ఈ సర్వేలోని వివరాలు తెలుసుకొనే ముందు ఒక్క విషయం ముందుగా తెలుసుకోవాలి. అదేమిటంటే.. ‘Size Doesn't Matter’. వివిధ దేశాలు, ప్రాంతాల్లో నివసించే ప్రజల సాంప్రదాయాలు, ఆచారాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లే.. శరీరాల్లో కూడా చాలామార్పులు ఉంటాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశీయులకు, ఆసియా ప్రజలకు మధ్య చాలా తేడా ఉంటుంది. రూపు రేఖలు, రంగుల్లోనే కాదు వారి ప్రైవేట్ పార్టుల సైజులు కూడా ప్రాంతాలవారీగా మారిపోతుంటాయి. అలాగని, వారు ఎక్కువ, మనం తక్కువ అని భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, లైంగికంగా కలిసేందుకు సైజుతో పని ఉండదు. కాబట్టి, ఈ సర్వేలో పేర్కొన్న అంశాలను సీరియస్‌గా తీసుకోవద్దు. దీన్ని బుర్రలో పెట్టుకుని ‘ఏక్ మినీ కథ’లో హీరోలా కుమిలి పోవద్దు.
‘ఏక్ మినీ కథ’లో హీరో పాత్ర తనది చాలా చిన్నదని బాధపడిపోతుంటాడు. మిగతావారు కూడా అతడిని ఆట పట్టిస్తారు. అయితే, అది కేవలం అతడి మానసిక సంఘర్షణ మాత్రమేనని పెళ్లి తర్వాత తన భార్యతో అనుకోకుండా జరిగే కలయిక ద్వారా తెలుసుకుంటాడు. ఆ పనికి సైజుతో పని లేదని తెలిసి సంతోషిస్తాడు. భారతీయుల్లో చాలామంది ఈ విషయంపై చింతిస్తుంటారు. అయితే, మీరు దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అక్కర్లేదు. ఎందుకంటే మన ఇండియన్ పురుషుల అంగాలు ప్రపంచంలోనే అత్యంత చిన్నవని ఓ సర్వే పేర్కొంది. ‘టార్గెట్ మ్యాప్’ నిర్వహించిన ఈ సర్వేలో ఇండియా, ఇతర ఆసియా దేశాలన్నింటినీ యావరేజ్‌గా లెక్కించి చూపించడం వల్లే మనల్ని ఆ జాబితాలో చూపించినట్లు తెలుస్తోంది.
యూకేకు చెందిన ఓ ప్రముఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. మ్యాప్‌లో రెడ్ కలర్‌లో చూపించిన ఆఫ్రికా దేశాల్లోని పురుషుల అంగాలే ప్రపంచంలో అత్యంత పెద్దవి. ముఖ్యంగా పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా, కాంగో, గ్యాబన్‌లోని పురుషుల అంగం స్తంభించిన తర్వాత 16 సెంటీ మీటర్లకు పైనే ఉంటుందట. ఆరెంజ్, లైట్ గ్రీన్‌లో ఉన్న ఆస్ట్రేలియా, ఇటలీ, నార్వే, మెక్సికో పురుషులు ఆఫ్రికన్ల తర్వాతి స్థానంలో ఉన్నారట. స్తంభన తర్వాత వీరివి 5.8 నుంచి 6.3 ఇంచుల వరకు ఉంటుందట.
Also Read: మగాళ్లు జాగ్రత్త! మొబైల్ అతిగా వాడితే ‘అది’ మటాష్, షాకింగ్ న్యూస్ చెప్పిన నిపుణులు
ఆసియా దేశాల్లో మాత్రం ప్రపంచంలోనే అత్యంత చిన్నవని ఆ మ్యాప్‌లో చూపించారు. ఇండియా, థాయ్‌లాండ్, దక్షిణ కొరియాకు సంబంధించిన వివరాలు అంతంత మాత్రంగానే లెక్కించినట్లు ఆ మీడియా సంస్థ పేర్కొంది. పైగా చైనా తదితర దేశాలను ఆ మ్యాప్‌లో చూపించలేదు. కాబట్టి, మనం దీన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోవల్సిన అసవరం కూడా లేదు. అంతేగాక, ఏ ప్రామాణికాలతో వీటిని కొలిచారనే వివరాలను కూడా స్పష్టంగా తెలియజేయలేదు. కాబట్టి.. నో వర్రీస్. అయితే, ఈ మీడియా కథనం వైరల్ కావడం వల్ల ఆసియా ప్రజలవి చిన్నవనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. మరి, ఈ సర్వేల వివరాలను నమ్మొచ్చా?
Also Read: శృంగారం తర్వాత పురుషులకు నిద్ర ఎందుకు వస్తుంది? దీని వెనుక ఇంత కథ ఉందా!
2021లో Mandatory.com అనే వెబ్‌సైట్‌లో పేర్కొన్న సర్వే ప్రకారం.. భారతీయులు ప్రపంచంలో రెండవ అతి చిన్న పురుషాంగం కలిగి ఉన్నట్లు తేలింది. స్తంభన తర్వాత సరాసరి 4 ఇంచుల పొడవు ఉంటుందని ఆ సర్వే పేర్కొంది. చైనా, జపానీయులది 4.3 ఇంచులు, ఉత్తర కొరియా పురుషులది 3.8 ఇంచులుగా పేర్కొంది. ఏది ఏమైనా.. ‘Size Doesn't Matter’. ఈ విషయాన్ని ప్రత్యేకంగా నిరూపించాల్సిన అవసరమే లేదు. కలయికలో సంతృప్తి చెందేందుకు అంగం సైజు స్తంభన తర్వాత సరాసరి 4 ఇంచులు వరకు పెరిగితే చాలని నిపుణులే చెబుతున్నారు.
Images Credit: targetmap.com and mandatory.com
గమనిక: సర్వేలో తెలిపిన వివరాలను మీ అవగాహన కోసం యథావిధిగా అందించాం. ఈ కథనంలో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.
Thyroid: హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్నారా? ఈ ఆహారాలను దూరంగా పెట్టాల్సిందే
Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది
Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!
Dhaniya Powder: ఈ ధనియాల పొడిని అన్నంతో, ఇడ్లీతో తినొచ్చు, ఎలా చేయాలో తెలుసా?
Brain Foods: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే బ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ, రోజుకొకటైనా తప్పకుండా తినిపించాల్సిందే
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో వర్షం, ఎల్లో అలర్ట్ జారీ! ఏపీలో నేడు 2-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
Hyderabad: నేడు Hydకి మోదీ, ఈ రూట్లలో ట్రాఫిక్‌కు నో ఎంట్రీ! ముందే వేరే మార్గాలు చూసుకోండి
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు