By: ABP Desam | Updated at : 16 Feb 2022 03:18 PM (IST)
(Image credit: Twitter)
పన్నెండో అంతస్థు నుంచి కిందకి చూస్తేనే కొంతమందికి భయమేస్తుంది. కానీ ఒక వ్యక్తి పన్నెండో అంతస్థు బాల్కనీలో ఉన్న రెయిలింగ్ పట్టుకుని వేలాడుతూ వ్యాయామాలు చేశాడు. అతను చేస్తున్న పనిని ఎదుటి బిల్డింగ్ నుంచి ఒక వ్యక్తి వీడియో తీసి పోస్టు చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. ఈ ఘటన ఫరీదాబాద్‌లోని సెక్టార్ 82 ప్రాంతంలో ఉన్న ఫ్లోరిడా అపార్ట్‌మెంట్‌లో జరిగింది. ఆ వీడియోలో అతను రెయిలింగ్ పట్టుకుని స్ట్రెచెస్ చేస్తూ కనిపించాడు. చూసిన వారికి చాలా భయమేసింది. కాసేపు చేశాక ఓ మహిళ వచ్చి అతడి చేయిపట్టుకుని రెయిలింగ్ దాటించి ఇంట్లోకి తీసుకెళ్లింది. ఈ ఘటన చూస్తున్న వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ వ్యక్తి మతి స్థిమితం లేక అలా చేశాడా అన్న వాదనలు కూడా ఎక్కువయ్యాయి. ఈ వీడియోను ‘వైరల్‌వీడోజ్’ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. డేర్ డెవిల్ వర్కవుట్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు.
#Viral: Daredevil workout Video of a man exercising hanging from the balcony of the 12th floor surfaced, #Faridabad #viralvideo #video #Viralvdoz #Daredevilworkout #Workout #Daredevil #NCR pic.twitter.com/X4mXPQYICx
— ViralVdoz (@viralvdoz) February 14, 2022
కొద్దిరోజుల క్రితం ఇలాగే మరో వీడియో వైరల్ అయ్యింది. అందులో ఓ తల్లి తమ ఇంటి బాల్కనీలో చీర ఆరేసింది. ఆ చీర కింద ఫ్లాట్ లో ఉన్న బాల్కనీలో పడింది. ఆ ఫ్లాట్ వాళ్లు ఊరెళ్లారు. దీంతో ఆ చీర కోసం కొడుకుకి తాడు కట్టి కింద అపార్ట్ మెంట్ బాల్కనీలోకి దించింది. ఆ చీర పట్టుకుని వచ్చిన కొడుకుని మళ్లీ జాగ్రత్తగా తాడుతో పైకి లాగింది. అయితే వీరున్నది ఏ ఫస్ట్ ఫ్లోర్లోనో కాదు, ఎనిమిదో ఫ్లోర్ లో. తాడు ముడి వీడినా, తెగినా ఆ పిల్లాడి పరిస్థితి ఏమయ్యేది అని కూడా తల్లి ఆలోచించలేదు. కేవలం పడిపోయిన చీర మాత్రమే ఆమెకు కనిపించింది. ఇలాంటి ఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఇలా ఎవరో వీడియోలు తీయడం వల్ల బయటపడుతుంటాయి.
Also read: బప్పీ లహిరి ప్రాణాలు తీసిన స్లీప్ డిజార్డర్, ఏంటి ఆ ఆరోగ్య సమస్య? ఎందుకొస్తుంది?
Also read: చెత్త ఏరుకునే ఈ వ్యక్తి హ్యాండ్సమ్ మోడల్‌లా ఎలా మారాడో చూడండి
Blood Circulation: శరీరంలో రక్త సరఫరా సరిగా జరగకపోతే కనిపించే లక్షణాలు ఇవే - జాగ్రత్త
Heart Attack: రక్తనాళాల్లో కొవ్వు చేరకూడదనుకుంటే సజ్జలను మెనూలో చేర్చుకోండి
ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఛాతీలోని కఫం, దగ్గు త్వరగా తగ్గిపోతాయి
పెద్ద పెద్ద వైద్యులు చేయలేని చికిత్స స్నేహం చేస్తుందట - ఆ వ్యాధికి ఇదే మందు!
Weight Loss Tips: ఈజీగా బరువు తగ్గాలా? జస్ట్ ఈ 5 సూత్రాలు పాటిస్తే చాలు
నాడు రావాలి జగన్-కావాలి జగన్, నేడు "మా నమ్మకం నువ్వే జగన్"
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఏ గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్!
Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం
Shiva Rajkumar Emotional : కన్నీళ్లు పెట్టుకున్న శివన్న - ఓదార్చిన బాలకృష్ణ