Weight Loss: బరువు తగ్గేందుకు వ్యాయామమే కాదు ఇది కూడా చెయ్యండి - కొవ్వు ఇట్టే కరిగిపోతుంది
బరువు తగ్గడానికి వ్యాయామంతో పాటు ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. అప్పుడే మీరు పడే కష్టానికి ఫలితం దక్కుతుంది.
మనలో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య బరువు. వ్యాయామం చేస్తున్న కూడా బరువు తగ్గడం లేదే అని చాలా మంది అనుకుంటారు. బరువు తగ్గాలంటే వ్యాయామం మాత్రమే చేస్తే సరిపోదు అందుకు తగిన ఆహార నియమాలు కూడా పాటించాలి. ఆహారంపై శ్రద్ధ చూపించడం చాలా అవసరం. అది చాలా ముఖ్యం కూడా. కొన్ని నియమాలు పాటించడం కష్టంగా అనిపించినప్పటికి అవి అవసరం. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా బరువు తగ్గేందుకు కొన్ని ఆహార చిట్కాలను పాటించాలి. అవేంటో చూసేయండి.
రోజు ఆకుపచ్చ కూరగాయలు తినాలి
ముదురు ఆకుపచ్చ కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది. పేగులని కదిలించి పొట్టలో సమస్యలను దూరం చేస్తుంది. ఫైబర్ ఎక్కువ, కేలరీలు తక్కువ. మీరు ఎక్కువగా కేలరీలు తీసుకోకుండా చేస్తుంది. దీని వల్ల మీకు ఆకలి కూడా తక్కువగా ఉంటుంది.
- లెట్యూస్ - 15 కేలరీలు
- క్యాబేజీ- 15 కేలరీలు
- బచ్చలి కూర- 23 కేలరీలు
- అస్పరాగస్ - 24 కేలరీలు
- బ్రోకలీ - 24 కేలరీలు
చిరుతిండిలో ప్రోటీన్‌ను చేర్చాలి
ఆకలి ఎక్కువగా ఉన్నపుడు పిండి పదార్థాలతో పాటు ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని కూడా ఎంచుకోవాలి. ప్రోటీన్స్ జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కార్బోహైడ్రేట్లు మాత్రమే తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందుకే ప్రోటీన్స్ ఉన్న ఆహారం స్నాక్స్ గా తీసుకునేందుకు ప్రయత్నించాలి.
భోజనానికి ముందు నీళ్ళు తాగాలి
ఖచ్చితంగా భోజనానికి ముందు మంచి నీళ్ళు తాగడం అలవాటు చేసుకోవాలి. కొన్ని సార్లు మనకి దాహంగా అనిపించినప్పడు మెదడు మనకి ఆకలి అనే సంకేతాలు ఇస్తుంది. దాని వల్ల తింటారు కానీ నిజానికి అది దాహం అని అర్థం చేసుకోవడం కష్టం. అందుకే భోజనం చేసే ముందు నీళ్ళు తాగడం వల్ల అతిగా తినడం కూడా తగ్గుతుంది. విపరితమైనా ఆకలిగా ఉన్నప్పుడు నీటిని తాగడం వల్ల అతిగా తినకుండా నిరోదిస్తుంది. అంతే కాదు నీళ్ళు తాగడం వల్ల బర్నింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతుంది.
కనీసం వారానికి ఒకసారైనా మాంసం తినకుండా ఉండాలి
ఊబకాయం ఉన్న వ్యక్తులపై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం చాలా మంది పురుషులు, మహిళలు ఎర్ర మాంసం జంతు ప్రోటీన్‌లకు బదులుగా మొక్కల ఆధారిత ప్రోటీన్‌లను తినడానికి మారినప్పుడు బరువు తగ్గారు. కనీసం వారానికి ఒకసారి స్వచ్ఛమైన శాఖాహార ఆహారానికి మారడం వల్ల బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. భారతీయుల్లో ఎక్కువ మంది మంగళ, గురువారాల్లో మాంసాహారం తీసుకోకుండా ఉంటారు. దాని వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.
శాఖాహారం తినడం అంటే బాగా డీప్ ఫ్రై చేసిన ఆహారం లేదా జంక్ ఫుడ్ అని అనుకునేరు. అసలు కాదండోయ్. బీన్స్, పప్పులు, పనీర్, తృణధాన్యాలు, కాలానుగుణ కూరగాయలతో తయారుచేసే పోషక విలువలు ఉండే ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవాలి.
వ్యాయామం అసలు మరువకూడదు
ఆహారం ద్వారానే కాదు శరీరానికి తగిన శారీరక శ్రమ కూడా అవసరం. కేలరీలు బర్న్ చేయాలసిన అవసరం చాలా ఉంది. తక్కువగా తిన్నంత మాత్రాన్న బరువు తగ్గుతారని అనుకోకూడదు శారీరకంగా కూడా చురుకుగా ఉండాలి. అందుకే ప్రతి రోజు తప్పనిసరిగా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. వ్యాయమం బరువు తగ్గేందుకే కాకుండా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక స్థితిని బాగుంటుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు దారి చేరకుండా రక్షణగా నిలుస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: నూనె Vs వెన్న - హార్ట్ పేషెంట్లకు ఏది మంచిది?
Also Read: రాగి పాత్రల్లో నీరు ఆరోగ్యానికి మంచిదే - కానీ, ఈ సమస్యలు ఉంటే మాత్రం వద్దు!