Copper Vessels: రాగి పాత్రల్లో నీరు ఆరోగ్యానికి మంచిదే - కానీ, ఈ సమస్యలు ఉంటే మాత్రం వద్దు!
రాగి పాత్రల్లో నీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వాటిని పూర్వీకులు రాగి పాత్రల్లోనే నీటిని నిల్వ చేసుకునే వాళ్ళు.
ఇప్పుడంటే వాటర్ ఫిల్టర్లు, ప్యూరిఫైర్లు వచ్చాయి కానీ మన పూర్వీకులు మాత్రం రాగి పాత్రల్లో నీటిని నిల్వ చేసుకుని తాగే వాళ్ళు. ఆ నీటిని తామ్ర జల్ అని పిలిచేవారు. ఈ నీటిని ‘ఉషపన’ అని కూడా పిలుస్తారు.
రోజూ నిద్రలేచిన వెంటనే రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మన శరీరానికి కూడా రాగి అవసరం. FDA ప్రకారం.. ఒక వ్యక్తికి రోజు మొత్తం మీద కనీసం 12 మిల్లీ గ్రాముల రాగి శరీరానికి అవసరం. అంటే రాగి పాత్రల్లోని రెండు నుంచి మూడు గ్లాసుల నీటిని తీసుకోవాలి. రాగి పాత్రల్లో నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి అన్నీ విధాలుగా మేలు జరుగుతుంది.
- రాగి పాత్రల్లోని నీరు జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది.
- ఎముకలని బలంగా మారుస్తుంది.
- థైరాయిడ్ గ్రంథి పనితీరుని నియంత్రిస్తుంది.
- చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది.
- శరీరం మీద గాయాలని త్వరగా నయం చేస్తుంది.
- ఆర్థరైటిస్ నొప్పులను ఎదుర్కోవడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
- బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది.
- గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- పేగుల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తుంది.
- ఆయుర్వేదపరంగా ఈ నీరు తాగడం వల్ల పిత, వాత, కఫా దోషాలను సమతుల్యం చేస్తుంది.
- శరీరంలోని అన్ని అవయవాల పనితీరు సక్రమంగా ఉండేలా చేస్తుంది.
ఎవరు తాగకూడదు?
తామ్ర జల్ వల్ల అన్నీ రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఆయుర్వేదం ప్రకారం కొన్ని సమస్యలతో బాధపడే వాళ్ళు వీటిని తీసుకోకపోవడమే మంచిదని చెప్తున్నారు. మలబద్ధకం, కడుపులో మంట, రక్తస్రావం వంటి రుగ్మతలు ఉన్న వాళ్ళు వాటిని తాగకూడదు. ఎందుకంటే ఈ నీటిని తీసుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని ఆయుర్వేదం నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- రాగి సీసా లేదా పాత్రలో నీటిని నింపి, మూత పెట్టి చల్లని, చీకటి ప్రదేశంలో వాటిని ఉంచాలి.
- రాగి పాత్రల్లో నీటిని 8 నుంచి 9 గంటల పాటు నిల్వ చేయడం వల్ల అవి శుద్ధి చేయబడతాయి.
- ఉదయాన్నే ఖాళీ కడుపున ఆ నీటిని తాగడం వల్ల రోజంతా ఆరోగ్యంగా ఉంటారు.
- మనిషి శరీరానికి కనీసం మూడు లీటర్ల నీరు అవసరం అని వైద్యులు సూచిస్తున్నారు.
- శరీరానికి తగినంత నీరు అందకపోతే డీ హైడ్రేట్ సమస్య తలెత్తుతుంది.
- శరీరం వేడిగా మారడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు దరి చేరతాయి.
బ్యాక్టీరియాలు నశిస్తాయి: పదహారు గంటల పాటూ రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిలో వ్యాధికారక బాక్టీరియా అయిన ఇ.కోలి, కలరాకు కారణమయ్యే విబ్రియో కలరా, సాల్మోనెల్లా సూక్ష్మజీవులు పూర్తిగా నశిస్తాయని పరిశోధనల్లో తేలింది. అందుకే ఇంట్లో రాగి బిందె ఉండాల్సిన అవసరం ఉంది. రాగి పాత్రల్లో నీటిని నిల్వ చేసుకుని తాగడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ నుంచి రక్షణ పొందవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: నువ్వుల సద్ది, సద్దుల బతుకమ్మ స్పెషల్ నైవేద్యం, ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది
Also read: బతుకమ్మని పూలతోనే ఎందుకు పేరుస్తారు, తప్పనిసరిగా వినియోగించాల్సిన పూలు ఏవి!