అన్వేషించండి

Home Remedies for Cough : దగ్గును తగ్గించే ఎఫెక్టివ్ ఇంటి చిట్కాలు.. వాతావరణం మారినప్పుడు వీటిని ఫాలో అయిపోండి

Home Remedies : వాతావరణం మారగానే దగ్గు, జలుబు, గొంతు నొప్పి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే తక్షణ ఉపశమనం కోసం కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు ఫాలో అవ్వొచ్చు. అవేంటంటే..

Home Remedies for Cough and Cold : పొడివాతవరణంలో.. లేదా సీజన్ మారే సమయంలో వాతావరణంలో జరిగే మార్పుల వల్ల సీజనల్ ఇన్​ఫెక్షన్లు పెరుగుతాయి. ముఖ్యంగా దగ్గు(Cough), జలుబు (Cold) సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. పెద్దల నుంచి పిల్లల వరకు వాతావరణ మార్పుల వల్ల గొంతు నొప్పి(Sore Throat), దుమ్ము, ధూళి వల్ల కలిగే అలర్జీలతో ఇబ్బంది పడతారు.  దగ్గు ఉంటే పరిస్థితి ఇంకా చాలా దారుణంగా మారిపోతుంది. సరిగ్గా నిద్ర పోలేరు. గుండెల్లో నొప్పిగా ఉండడంతో పాటు చాలా అలసటగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మెడిసన్స్, సిరప్​లు వాడితో ప్రయోజనంగా ఉంటుంది. 

కొన్ని ఇంటి చిట్కాలతో కూడా దగ్గు, కఫం, జలుబు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని చెప్తున్నారు డాక్టర్ దీపికా రాణా. మీకు వాతావరణంలో మార్పుల వల్ల దగ్గు వంటి సమస్యలు వస్తే సహజమైన నివారణలను ట్రై చేయవచ్చని సూచిస్తున్నారు. దగ్గు, గొంతునొప్పి, కఫం నుంచి వెంటనే ఉపశమనం ఇవ్వడంలో ఇవి మంచి ప్రయోజనాలు ఇస్తాయని చెప్తున్నారు. 

అల్లం-తేనె (Ginger-Honey Remedy)

అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు వాపు, నొప్పిని తగ్గిస్తాయి. అయితే తేనె గొంతును మృదువుగా చేస్తుంది. ఒక టీస్పూన్ అల్లం రసం తీసి.. అందులో అర టీస్పూన్ తేనె కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవడం వల్ల దగ్గు నుంచి తక్షణ ఉపశమనం దొరుకుతుంది. అలాగే అల్లాన్ని నీటిలో వేసి మరిగించి.. దానిలో తేనె కలిపి తాగితే కూడా మంచి ఫలితం ఉంటుంది.

పాలల్లో పసుపు (Milk Turmeric Remedy)

పసుపును సహజమైన యాంటీబయాటిక్​గా చెప్తారు. కాబట్టి రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ పసుపు వేసి తాగితే మంచిదట. దీనివల్ల గొంతు నొప్పి, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభించడంతో పాటు.. రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేదం చెప్తోంది.

తులసి, మిరియాల టీ (Basil and Peppar Remedy)

తులసి ఆకులు, మిరియాలు రెండూ దగ్గును నయం చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కొన్ని తులసి ఆకులను మరిగించి.. దానిలో మిరియాల పొడి వేసుకుని.. కొంచెం తేనె కలిపి టీ తయారు చేసుకోవచ్చు. దీనిని రోజూ తాగితే గొంతుకు ఉపశమనం వస్తుంది.నఅంతేకాకుండా కఫాన్ని తొలగించడంలో కూడా సహాయం చేస్తుంది.

ఆవిరి తీసుకోవడం (Steam Remedy)

గొంతు నొప్పి, దగ్గును తగ్గించుకోవాలనుకుంటే మీరు ఆవిరి తీసుకోవచ్చు. ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీనికోసం మీరు నీటిని మరిగించి దానిలో వాము లేదా పుదీనా చుక్కలు వేసుకోవాలి. దానిని ఆవిరి తీసుకోవడం వల్ల గొంతు తేమగా మారుతుంది. కఫం సులభంగా బయటకు వస్తుంది. దగ్గు, జలుబు కూడా తగ్గుతుంది.

పుక్కిలించడం (Gargling with Salt Water)

గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలించడం వల్ల దగ్గు, గొంతు నొప్పికి తగ్గుతుంది. ఇది చాలా పాతకాలం నాటి చిట్కా. బట్ వెరీ ఎఫెక్టివ్. గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ఇది మంచి ప్రయోజనాలు ఇస్తుంది. 

కాబట్టి పెద్దల నుంచి పిల్లలవరకు దగ్గు, కఫం, జలుబు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ చిట్కాలు కచ్చితంగా ప్రయత్నించండి. ఇవి ఎంత ట్రై చేసినా.. దగ్గు, గొంతు నొప్పి తగ్గకపోతే కచ్చితంగా వైద్య సేవలు తీసుకోండి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget