అన్వేషించండి

Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?

Common Krait Silent Killer Snake | భారత్‌లో అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పాములలో కట్లపాము ఒకటి. దీని కాటు లక్షణాలు ఏమిటీ, దీనిని సైలెంట్ కిల్లర్ అని ఎందుకు అంటారు? దీనికి చికిత్స ఏమిటో తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కట్లపాము 'సైలెంట్ కిల్లర్', నొప్పిలేని కాటు విషపూరితం, ప్రాణాంతకం.
  • చూపు మసకబారడం, శ్వాస ఇబ్బందులొచ్చి సకాల చికిత్స లేకుంటే మరణం.
  • బాధితుడిని ప్రశాంతంగా, కదల్చకుండా వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
  • గాయాన్ని కోయడం, విషం పీల్చడం, గట్టిగా కట్టడం నివారించాలి.

Common Krait Symptoms | భారత్‌లో కనిపించే అత్యంత ప్రమాదకరమైన పాములలో కట్లపాము(Common Krait) ఒకటి. శాస్త్రీయంగా దీనిని Bungarus caeruleus అని పిలుస్తారు. కట్లపామును 'సైలెంట్ కిల్లర్' అని పిలుస్తారు. ఎందుకంటే దీని కాటు ఏమాత్రం పెద్దగా నొప్పి అనిపించదు. కేవలం దోమ లేదా చీమ కుట్టినట్లు అనిపిస్తుంది. దాంతో పాటు కాటుకు గురైనప్పటికీ బాధితుడు దానిని సాధారణ గాయంగా భావించి నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. కాటువేస్తే పాము విషం నేరుగా మానవ నాడుల వ్యవస్థపై దాడి చేస్తుంది. రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో ఈ పాము కరిస్తే, చాలామందికి కాటు వేసిన విషయమే తెలియక నిద్రలోనే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చాలానే ఉన్నాయి.

 పాముకాటు వేసిన తర్వాత కనిపించే లక్షణాలు

పాము కరిచిన తరువాత ఆ ప్రదేశంలో సాధారణ నొప్పి లేదా కొంచెం వాపు ఉంటుంది. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే విషం శరీరం అంతటా వ్యాపించి కనురెప్పలు మూతపడుతుంటాయి. చూపు మసకబారడం లేదా ఒకే వస్తువు రెండుగా కనిపించడం మొదలవుతుంది. మాట్లాడటం, ఏదైనా మింగడంలో తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుంది. నోటిలో లాలాజలం ఎక్కువ కావడం,  కాళ్లు చేతుల్లో బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. సకాలంలో ట్రీట్మెంట్ అందించకపోతే శ్వాసకోశ కండరాలు పూర్తిగా పనిచేయడం ఆగిపోయి వ్యక్తి ప్రాణాలు పోతాయి.

పాము కరిచినప్పుడు ఏం చేయాలి?
బాధితుడిని ముందుగా మానసికంగా ప్రశాంతంగా ఉంచడం చాలా ముఖ్యం. వీలైనంత తక్కువగా పాముకాటు బాధితులను కదిలేలా చూడాలి. కాటుకు గురైన చెయ్యి లేదా కాలును అస్సలు కదల్చకుండా స్థిరంగా ఉంచి, సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఒకవేళ వీలైతే, ఆ సమయంలో సురక్షితమనిపిస్తే మాత్రమే ఆ పాము ఫోటో తీయడానికి ప్రయత్నించాలి. అయితే పామును పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించి ప్రమాదాల బారిన పడవద్దు. 

Also Read : మహిళల్లో ఈ వయసు తర్వాత ప్రెగ్నెన్సీ కష్టమా? ఫెర్టిలిటీ నిపుణులు ఏమంటున్నారంటే..

పాటు కాటు వేస్తే ఏం చేయకూడదు?
గాయం ఉన్న చోట కోయడం లేదా నోటితో విషాన్ని పీల్చడానికి ప్రయత్నించడం లాంటి పనులు అసలు చేయకూడదు. రక్తప్రసరణను పూర్తిగా నిలిపివేసేలా తాడు లేదా గుడ్డతో గట్టిగా కట్టకూడదు. అలాగే మంచు ముక్కలు పెట్టడం, పసర్లు రాయడం, మట్టి రాయడం లేదా భూతవైద్యం పై ఆధారపడటం ప్రాణాలకు ముప్పు తెస్తుంది. సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. పాము ఏ రకమో చెబితే డాక్టర్లు వేగంగా అందుకు సంబంధించిన చికిత్స ప్రారంభిస్తారు.

పాముకాటుకు ట్రీట్మెంట్..
కామన్ క్రైట్ (కట్లపాము) కాటుకు పరిష్కారం యాంటీ స్నేక్ వెనమ్ ఇంజెక్షన్ ఇవ్వడం మాత్రమే. దీనిని కేవలం ఆసుపత్రిలోని డాక్టర్ల పర్యవేక్షణలోనే ఇవ్వాలి. యాంటీ స్నేక్ వెనమ్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు బాధితుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే ఆక్సిజన్ అందించడం లేదా అవసరాన్ని బట్టి వెంటిలేటర్ సపోర్ట్ ఇస్తారు. బాధితుని గుండె వేగం, శ్వాసక్రియ,  రక్తపోటును నిరంతరం పర్యవేక్షిస్తూ డాక్టర్లు చికిత్స అందిస్తారు. 

Also Read : ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినా ఫెయిల్ అవుతున్నారా? సంతాన్నాన్ని దూరం చేస్తోన్న అలవాట్లు ఇవే

Frequently Asked Questions

కట్లపాము కాటు వల్ల కలిగే నొప్పి ఎలా ఉంటుంది?

కట్లపాము కాటు పెద్దగా నొప్పిని కలిగించదు, దోమ లేదా చీమ కుట్టినట్లు అనిపిస్తుంది. దీనివల్ల బాధితులు తరచుగా కాటును నిర్లక్ష్యం చేస్తారు.

కట్లపాము కరిచిన తర్వాత కనిపించే ప్రధాన లక్షణాలు ఏమిటి?

కాటు తర్వాత కనురెప్పలు మూతపడటం, చూపు మసకబారడం, మాట్లాడటం, మింగడంలో ఇబ్బంది మరియు శ్వాస తీసుకోవడంలో కష్టం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కట్లపాము కరిస్తే వెంటనే ఏమి చేయాలి?

బాధితుడిని ప్రశాంతంగా ఉంచి, కదిలించకుండా సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. సురక్షితమైతే పాము ఫోటో తీయడానికి ప్రయత్నించండి.

కట్లపాము కాటుకు గురైనప్పుడు ఏమి చేయకూడదు?

గాయాన్ని కోయడం, విషాన్ని నోటితో పీల్చడం, గట్టిగా కట్టడం, మంచు, పసర్లు లేదా మట్టి రాయడం వంటివి చేయకూడదు. భూతవైద్యంపై ఆధారపడకూడదు.

కట్లపాము కాటుకు చికిత్స ఏమిటి?

కట్లపాము కాటుకు యాంటీ స్నేక్ వెనమ్ (ASV) ఇంజెక్షన్ మాత్రమే పరిష్కారం. ఇది డాక్టర్ల పర్యవేక్షణలో ఆసుపత్రిలో ఇవ్వాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget