News
News
X

వైట్ చాక్లెట్ రోజుకో ముక్క తింటే చాలు, జ్ఞాపకశక్తిలో పెరుగుదల

డార్క్ చాక్లెట్ తింటేనే కాదు వైట్ చాక్లెట్ తిన్నా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

FOLLOW US: 
Share:

డార్క్ చాక్లెట్‌నే ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు. వీటిని తినడం వల్ల మానసిక సమస్యలు తగ్గుతాయని చెబుతారు మానసిక వైద్యులు. అంతేకాదు యాంగ్జయిటీ లక్షణాలు కూడా తగ్గుముఖం పడతాయని అంటారు.అందుకే ఎక్కువ మంది వాటిని తినడానికే చూస్తారు. కానీ వైట్ చాక్లెట్ తినడంవల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లలకు డార్క్ చాక్లెట్లే కాదు అప్పుడుప్పుడు వైట్ చాక్లెట్ కూడా ఇవ్వండి. 

కాల్షియం
వైట్ చాక్లెట్లో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి. నరాలు, గుండె, కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. నోటి ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి వారానికోసారైనా వైట్ చాక్లెట్ తినాలి. 

యాంటీ ఆక్సిడెంట్లు
వైట్ చాక్లెట్లో వారే కోకో బటర్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. వీటికి యాంటీ ఆక్సిడెంట్ల గుణం ఎక్కువ. ఇవి తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధికరక్తపోటు రాకుండా అడ్డుకుంటుంది. వైట్ చాక్లెట్లను కోకో బటర్‌తోనే తయారు చేస్తారు. కాబట్టి ఇవి శరీరంలో ఇన్ఫ్లమ్మేషన్ రాకుండా అడ్డుకుంటాయి. వచ్చినా కూడా వాటితో చురుకుగా పోరాడుతాయి.

జ్ఞాపకశక్తి పెరుగుదల
వైట్ చాక్లెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. మెదడుకు సంబంధించి చాలా రుగ్మతలతో పోరాడే ఫ్లేవనాయిడ్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. మతిమరుపు రాకుండా ఇవి కాపాడుతాయి. వైట్ చాక్లెట్ తినడం వల్ల స్వల్పకాలిక, దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిని నయం అవుతుంది. 

కొలెస్ట్రాల్ అదుపులో
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది వైట్ చాక్లెట్. అవాంఛిత కొవ్వు చేరడం వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయి. అవి రాకుండా గుండెను కాపాడుతుంది వైట్ చాక్లెట్. ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. దీనివల్ల గుండెపోటు రాదు. ఆహారంలోని విటమిన్లను గ్రహించేలా చేస్తుంది. 

రొమ్ము క్యాన్సర్ 
మహిళలు అప్పుడప్పుడు వైట్ చాక్లెట్ తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. దీనిలో పాలీ ఫెనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యలు తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను అణిచివేస్తుంది. 

రక్తపోటును తగ్గిస్తుంది 
అధిక రక్తపోటు ఉన్న వారు రోజుకో చిన్నముక్క వైట్ చాక్లెట్ తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. దీనిలో లినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండె, రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది.అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. 

Also read: గర్భిణులు ఆకుకూరలు తింటే శిశువులు ఏడుస్తారు, క్యారెట్లు తింటే నవ్వుతారు, అదిరిపోయే అధ్యయనం

Also read: వేడి నీటిలో, టీలో తేనె వేసుకుని తాగుతున్నారా? అయితే విషాన్ని తాగుతున్నట్టే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 28 Sep 2022 11:50 AM (IST) Tags: White Chocolate Dark chocolate Benefits of Chocolate Dark chocolate benefits

సంబంధిత కథనాలు

మూడేళ్లు దాటిన పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ప్రమాదం - వెంటనే వైద్యుల్ని కలవండి

మూడేళ్లు దాటిన పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ప్రమాదం - వెంటనే వైద్యుల్ని కలవండి

Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి

Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి

Brain Tumor: మూత్రపరీక్షతో బ్రెయిన్ ట్యూమర్ ఉందో లేదో కనిపెట్టేసే కొత్త పరికరం - శాస్త్రవేత్తల సృష్టి

Brain Tumor: మూత్రపరీక్షతో బ్రెయిన్ ట్యూమర్ ఉందో లేదో కనిపెట్టేసే కొత్త పరికరం - శాస్త్రవేత్తల సృష్టి

ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్ద గది - ఈ గదిలో మీ రక్త ప్రవాహపు శబ్దాన్ని కూడా వినవచ్చు

ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్ద గది - ఈ గదిలో మీ రక్త ప్రవాహపు శబ్దాన్ని కూడా వినవచ్చు

Red Wine: రెడ్ వైన్ తాగడం వల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయని సైన్స్ కూడా ఒప్పుకుంది

Red Wine: రెడ్ వైన్ తాగడం వల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయని సైన్స్ కూడా ఒప్పుకుంది

టాప్ స్టోరీస్

Vani Jayaram Death : వాణీ జయరామ్ తలపై గాయం నిజమే - మృతిపై ఇంకా వీడని మిస్టరీ

Vani Jayaram Death : వాణీ జయరామ్ తలపై గాయం నిజమే - మృతిపై ఇంకా వీడని మిస్టరీ

Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్

Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ - 'ఖుషి' ఖుషీగా...

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ - 'ఖుషి' ఖుషీగా...

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!